క‌డ‌ప‌లో టీడీపీకి విలువ‌లు వ‌ద్దా?

ఉమ్మ‌డి విశాఖ జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ విలువ‌ల గురించి మాట్లాడింది. కానీ క‌డ‌ప‌కు వెళ్లే స‌రికి విలువ‌ల ప‌ట్ట‌డం లేదు. క‌డ‌ప జిల్లా ప‌రిష‌త్‌ను హ‌స్త‌గ‌తం చేసుకోడానికి టీడీపీ పావులు క‌దుపుతోంది.…

ఉమ్మ‌డి విశాఖ జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ విలువ‌ల గురించి మాట్లాడింది. కానీ క‌డ‌ప‌కు వెళ్లే స‌రికి విలువ‌ల ప‌ట్ట‌డం లేదు. క‌డ‌ప జిల్లా ప‌రిష‌త్‌ను హ‌స్త‌గ‌తం చేసుకోడానికి టీడీపీ పావులు క‌దుపుతోంది. పోనీ టీడీపీకి చెప్పుకోత‌గ్గ జెడ్పీటీసీ సభ్యుల బ‌లం వుందా? అంటే… లేదు. ఐదారుగురు జెడ్పీటీసీలున్నారు. జెడ్పీ చైర్మ‌న్ స్థానాన్ని సొంతం చేసుకోవాలంటే ఇంకా 20 మంది స‌భ్యులు అవ‌స‌రం.

క‌డ‌ప‌లో జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా దెబ్బ‌తీయ‌డానికి నైతిక విలువ‌ల్ని తుంగ‌లో తొక్క‌డానికి టీడీపీ సిద్ధ‌మైంద‌న్న ఆరోప‌ణ‌లు వైసీపీ నుంచి వ‌స్తున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నంత మాత్రాన పోలోమ‌ని జెడ్పీటీసీ స‌భ్యులంతా వెళ్లే అవ‌కాశం లేదు. ఒక‌వేళ టీడీపీకి వైసీపీ జెడ్పీటీసీలు మ‌ద్ద‌తు ఇవ్వాలంటే భారీ మొత్తంలో డ‌బ్బు ముట్ట‌జెప్పాలి. క‌నీసం అంటే రూ.20 ల‌క్ష‌ల నుంచి రూ.25 ల‌క్ష‌ల‌కు త‌క్కువ లేకుండా జెడ్పీటీసీల‌కు ముట్ట‌జెప్పాల్సి వుంటుంది.

టీడీపీ అధికారంలో వుండ‌డం, జ‌గ‌న్‌ను ఎలాగైనా దెబ్బ‌కొట్టాల‌నే ప‌ట్టుద‌ల‌తో భారీ మొత్తంలో జెడ్పీటీసీల‌కు డ‌బ్బు ఇచ్చే అవ‌కాశం వుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆశ్చ‌ర్య‌క‌రంగా ఇక్క‌డ విలువ‌ల గురించి టీడీపీ మాట్లాడ్డం లేదు. ఇదే విశాఖ‌లో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక విష‌యంలో మాత్రం పెద్ద సంఖ్య‌లో వైసీపీ స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల్ని కొనే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో విలువ‌ల గురించి టీడీపీ మాట్లాడింద‌ని ఆ పార్టీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు.

రాజ‌కీయంగా హ‌వా సాగే ప‌రిస్థితి వుంటే మాత్రం విలువ‌లు, నీతి, నిజాయితీ లాంటి వాటి గురించి అధికార పార్టీ నాయ‌కులు మాట్లాడ‌ర‌నేందుకు క‌డ‌ప జెడ్పీ ఉదంతమే నిద‌ర్శ‌నం. టీడీపీ ప్ర‌లోభాల్ని వైసీపీ ఎలా అధిగ‌మిస్తుందో చూడాలి!

12 Replies to “క‌డ‌ప‌లో టీడీపీకి విలువ‌లు వ‌ద్దా?”

  1. k a d a p a n u n c h i s y c o g a a d i n i t a r a m a d a a n i k i e m a i n a c h e y a v a c h u .m u s u k o l a n j a k o d a k a……. k u p p a m to t a p p u k a n a p p u d u ………. k a d a p a l o e l a t a p p u a v u t u n d i . . .?

  2. ఏంటి హుందా రాజకీయాల గురించి నువ్వు చెప్పడమా??

    స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిపించావో ఎలా సీట్లు గెలిచావో నీకు తెలియదా??

    ప్రతిపక్ష అభ్యర్థులను ప్రలోభ పెట్టి వినకపోతే బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి, దాడులు చేసి, భయపెట్టి, నామినేషన్లు చించేసి ఇంకా రిగ్గింగ్ చేసి అక్రమంగా పోలీసు భలం తో గెలిచావు..

    నిన్ను ఇలాగే వదిలేస్తే అసలు హూందా రాజకీయాలకి స్పెల్లింగ్ నేర్పింది Leven గాడే అంటావ్.. కానీ నిజం ఏంటంటే

    “రాజకీయాలు అత్యంత నీచ స్థాయికి దిగజార్చి, జిగుప్సాకరంగా మార్చిన ఈడా హుందా రాజకీయాల గురించి మాట్లాడేది??

  3. హుందా రాయకీయం అంటే ఇదా??

    నువ్వు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజాయితీ గా గెలిచావా?? లేక ప్రతిపక్ష అభ్యర్థులను ప్రలోభ పెట్టి వినకపోతే బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి, దాడులు చేసి, భయపెట్టి, నామినేషన్లు చించేసి ఇంకా రిగ్గింగ్ చేసి అక్రమంగా పోలీసు భలం తో గెలిచావు..

Comments are closed.