మరో హీరోయిన్ పెళ్లికి రెడీ

ఎట్టకేలకు తన పెళ్లిపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టింది హీరోయిన్ మేఘా ఆకాష్. 28 ఏళ్ల ఈ నటి పెళ్లికి సిద్ధమైంది. తన చిరకాల ప్రియుడు సాయివిష్ణుతో ఆమె ఎంగేజ్ మెంట్ నిన్న కేరళలో…

ఎట్టకేలకు తన పెళ్లిపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టింది హీరోయిన్ మేఘా ఆకాష్. 28 ఏళ్ల ఈ నటి పెళ్లికి సిద్ధమైంది. తన చిరకాల ప్రియుడు సాయివిష్ణుతో ఆమె ఎంగేజ్ మెంట్ నిన్న కేరళలో పూర్తయింది.

తనకు ఎంగేజ్ మెంట్ పూర్తయిన విషయాన్ని అర్థరాత్రి బయటపెట్టింది మేఘా ఆకాష్. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోల్ని కూడా పోస్ట్ చేసిందామె. మేఘా ఆకాష్, సాయి విష్ణు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారట.

మేఘా ఆకాష్ పెళ్లిపై వచ్చిన పుకార్లు అన్నీ ఇన్నీ కావు. ఒక దశలో తమిళ మీడియా ఆమెకు పెళ్లి కూడా చేసేసింది. ఎప్పటికప్పుడు తన పెళ్లిపై వస్తున్న పుకార్లను ఖండిస్తూ వచ్చిన ఆమె.. ఎట్టకేలకు తన ప్రియుడ్ని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసింది.

మేఘా ఆకాశ్ కెరీర్ అనుకున్నట్టు సాగలేదు. తమిళ్ లో చాలా పెద్ద సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆమె సక్సెస్ అందుకోలేకపోయింది. కోలీవుడ్ లో వరుస ఫ్లాపులు రావడంతో ఆమె టాలీవుడ్ కు షిఫ్ట్ అయింది.

తెలుగులో కూడా ఆమె ప్రామిసింగ్ సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. శ్రీవిష్ణుతో చేసిన రాజరాజ చోర సినిమా మాత్రమే ఆమెకు ఉన్నంతలో కలిసొచ్చింది. ఆ తర్వాత కూడా ఫ్లాపులు వెక్కిరించాయి.

ఒక దశలో తనే స్వయంగా నిర్మాతగా మారి సినిమాలు తీసింది మేఘా ఆకాష్. తల్లిని నిర్మాతగా పెట్టి, తను లీడ్ రోల్ పోషిస్తూ 2 సినిమాలు చేసింది. ఈ ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో 2 సినిమాలున్నాయి. ఈ గ్యాప్ లో సాయివిష్ణును పెళ్లాడాలని ఆమె నిర్ణయించుకుంది. పెళ్లి తేదీ ఇంకా వెల్లడించలేదు.

6 Replies to “మరో హీరోయిన్ పెళ్లికి రెడీ”

Comments are closed.