టీటీడీ ఇంజినీర్ల‌కు కంటిమీద కునుకు క‌రవు

టీటీడీ ఇంజ‌నీర్ల‌కు కంటి మీద కునుకు క‌రువైంది. టీటీడీలో పెద్ద మొత్తంలో చేప‌ట్టిన వివిధ ర‌కాల ప‌నుల‌కు సంబంధించి, ఎలా అనుమ‌తులు ఇచ్చారంటూ 72 మంది ఇంజినీర్ల‌కు విజిలెన్స్ అధికారులు ఇప్ప‌టికే నోటీసులు ఇచ్చిన…

టీటీడీ ఇంజ‌నీర్ల‌కు కంటి మీద కునుకు క‌రువైంది. టీటీడీలో పెద్ద మొత్తంలో చేప‌ట్టిన వివిధ ర‌కాల ప‌నుల‌కు సంబంధించి, ఎలా అనుమ‌తులు ఇచ్చారంటూ 72 మంది ఇంజినీర్ల‌కు విజిలెన్స్ అధికారులు ఇప్ప‌టికే నోటీసులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నోటీసుల‌పై ఇంజినీర్లు మండిప‌డుతున్నారు. టీటీడీ పాల‌క మండ‌లి తీర్మానాలను తాము పాటించామ‌ని, వ్య‌క్తిగ‌త నిర్ణ‌యాలు వుండ‌వ‌ని ఇంజినీర్లు చెబుతున్నారు.

ఇప్ప‌టికే ఇచ్చిన నోటీసులతో టీడీపీకి రాజ‌కీయంగా న‌ష్టం లేద‌నుకున్నారేమో! తాజాగా రెండో విడ‌త‌లో సుమారు 30 మంది ఇంజినీర్ల‌కు నోటీసులు ఇచ్చిన‌ట్టు తెలిసింది. టెండ‌ర్ ప్రాసెస్‌కు సంబంధించి మ‌రింత లోతుగా విచారించే క్ర‌మంలో ఇంజినీర్ల‌కు నోటీసులు ఇచ్చిన‌ట్టు తెలిసింది. ఈ ప‌రిణామాల‌పై ఇంజినీర్లు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ప‌రిపాల‌నాప‌ర‌మైన విధానాల్ని పాటించడ‌మే తాము చేసిన త‌ప్పా? అని ఇంజినీర్లు నిలదీస్తున్నారు. ఇంజినీర్ల‌తో పాటు ఇత‌ర శాఖ‌ల అధికారుల‌కు కూడా త్వ‌ర‌లో నోటీసులు ఇవ్వ‌నున్న‌ట్టు టీటీడీలో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజ‌కీయంగా ఎవ‌రిపైనో క‌క్ష‌తో ఉద్యోగుల్ని టార్గెట్ చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

త‌మ‌ను వేధించ‌డంపై టీటీడీ ఉద్యోగ సంఘాలు ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల్ని నెర‌వేర్చుకోడానికి త‌మ‌ను ఉద్యోగ సంఘాల నాయ‌కులు బ‌లి పెడుతున్నార‌ని ఉద్యోగులు విమ‌ర్శిస్తున్నారు.

9 Replies to “టీటీడీ ఇంజినీర్ల‌కు కంటిమీద కునుకు క‌రవు”

  1. వేధింపులు అంటే, అన్నయ్య జమానాలో లాగా నోటీసులు గీటీసులు లేకుండా డైరెక్టుగా లేపుకెళ్లి సెల్ లో పడేసి కుమ్మడటం.

    ఇప్పుడు నోటీసు లు ఇఛ్చి వివరణలు తీసుకుంటున్నారంటే చట్ట ప్రకారం వెళ్తున్నారని… మన అన్నయ్య జమానా తో పోలిస్తే బుజ్జగిస్తున్నారని అర్ధం.

Comments are closed.