మెగా స్టార్ ను వదలని కాంగ్రెస్ పార్టీ

మెగా స్టార్ చిరంజీవి పాలిటిక్స్ వదిలేసి చాలా ఏళ్లయింది. సినిమా హీరోగా ఉంటూ ఎన్టీఆర్ సీఎం అయ్యాడు కదా. తనకూ బొచ్చెడు పాపులారిటీ, ఇమేజ్ ఉన్నాయి కదా. తానూ ఈజీగా సీఎం అయిపోతానని అనుకున్నాడు. ఆ…

మెగా స్టార్ చిరంజీవి పాలిటిక్స్ వదిలేసి చాలా ఏళ్లయింది. సినిమా హీరోగా ఉంటూ ఎన్టీఆర్ సీఎం అయ్యాడు కదా. తనకూ బొచ్చెడు పాపులారిటీ, ఇమేజ్ ఉన్నాయి కదా. తానూ ఈజీగా సీఎం అయిపోతానని అనుకున్నాడు. ఆ పార్టీలో ఈ పార్టీలో జాయిన్ అవ్వడం ఎందుకని సొంతంగా పార్టీ పెట్టాడు.

సేమ్ ఎన్టీఆర్ బాటలోనే వెళ్ళాడు. కానీ పెద్దాయనలా క్లిక్ కాలేకపోయాడు. ఆ వాగ్ధాటి లేదు. అంత డేరింగ్ గా డాషింగ్ గా ఉండలేకపోయాడు. చివరకు ఎన్నికల్లో పద్దెనిమిది సీట్లతోనే సరిపెట్టుకున్నాడు. ఆయన పార్టీ ఓడిపోగానే కాంగ్రెస్ పార్టీ కన్ను పడింది. చిరును పార్టీలోకి లాగాలని అనుకొంది.

తాను సొంతంగా పార్టీ నడపలేనని చిరు కూడా అనుకున్నాడు. సొంత రాజకీయాలు చేయడానికి ఆయనే భయపడ్డాడో, ఎవరైనా భయపెట్టారో తెలియదుగానీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేశాడు. వాళ్ళు కూడా కేంద్ర మంత్రి ఆఫర్ ఇచ్చారు. రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చారు.

అప్పుడు యూపీఏ అధికారంలో ఉంది కాబట్టి కంఫర్ట్ గా ఉన్నాడు. కానీ తరువాతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. దీంతో చిరు రాజకీయాలకు గుడ్బై చెప్పాడు. మళ్ళీ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలం తరువాత రాజ్యసభ సభ్యత్వం కూడా ముగిసింది. ఇక కాంగ్రెసుతోనే కాదు పాలిటిక్స్ తో సంబంధం లేకుండా తన మానాన తాను బతుకుతున్నాడు.

కానీ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని వదిలిపెట్టడంలేదు. రాష్ట్రం విడిపోయాక ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిని చేయాలని పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేశారు. కానీ చిరు చలించలేదు. సంతలో సడేమియా అన్నట్లుగా చిరును తమ పార్టీలోకి లాగాలని  కాషాయం పార్టీ వాళ్ళు ట్రై చేశారు. కానీ ప్రయత్నాలు ఫలించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏపీ నాయకులు చిరు తమ పార్టీలోనే ఉన్నాడని చెప్పుకుంటూ ఉంటారు.

మరోపక్క ప్రధాని మోడీకి చిరు సన్నిహితంగా ఉన్నట్లు కనబడతాడు. తమ్ముడు పవన్ కు కూడా సపోర్ట్ గా ఉన్నాడు. ఆయన పార్టీకి భారీగా ఆర్ధిక సహాయం కూడా చేశాడు. ఇలా ఉన్న మెగా స్టార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లుగా ఫీలవుతున్న ఆ పార్టీ నాయకత్వం ఆయనకు పార్టీ మెంబర్షిప్ రెన్యూవల్ చేసింది.

ఆ కార్డు కూడా పంపింది. అంటే చిరును కాంగ్రెస్ వదలడంలేదని తెలుస్తోంది. ఎందుకంటే.. చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటి నుంచి కాంగ్రెస్ సభ్యత్వాన్ని ఎప్పుడూ రెన్యూవల్ చేసుకున్న దాఖలాలు లేవు. పార్టీ కూడా ఎప్పుడూ ఆ విషయం చెప్పలేదు.

8 Replies to “మెగా స్టార్ ను వదలని కాంగ్రెస్ పార్టీ”

  1. Potta kooti kosam koti thippalu Mr. Great Andhra . Eppudu evarno okarni pakkalo veskokunte neeku Kalam gadavademo kadara…. Deeni kanna Road Pina adukku thinochu kadara Sannasi…

  2. Potta kooti kosam koti thippalu Mr. Great Andhra . Eppudu evarno okarni pakkalo veskokunte neeku Kalam gadavademo kadara…. Deeni kanna Road Pina adukku thinochu kadara Sannasi…

Comments are closed.