ఆయన తీస్తాడా.. ఈయన చేస్తాడా..?

కొన్ని విషయాలు మాట్లాడుకోడానికి బాగుంటాయి. ఆచరణలోకి వచ్చేసరికి అస్సలు సాధ్యం కావు. ఇది కూడా అలాంటిదే. ఖుషి-2 తెరపైకి వచ్చింది. స్వయంగా హీరోయిన్ ప్రియాంక మోహన్ ఈ చర్చను మొదలుపెట్టింది. Advertisement ఖుషి సినిమాకు…

కొన్ని విషయాలు మాట్లాడుకోడానికి బాగుంటాయి. ఆచరణలోకి వచ్చేసరికి అస్సలు సాధ్యం కావు. ఇది కూడా అలాంటిదే. ఖుషి-2 తెరపైకి వచ్చింది. స్వయంగా హీరోయిన్ ప్రియాంక మోహన్ ఈ చర్చను మొదలుపెట్టింది.

ఖుషి సినిమాకు సీక్వెల్ తీయాలనేది ప్రియాంక మోహన్ డిమాండ్. పవన్ కల్యాణ్ హీరోగా ఎస్ జే సూర్య దర్శకత్వంలో అది రావాలనేది ఆమె కోరిక. నిండు సభలో ప్రియాంక ఈ డిమాండ్ చేస్తే, కింద కూర్చున్న ఎస్ జే సూర్య బిగ్గరగా నవ్వేశాడు. అంతా గోల చేశారు.

అక్కడితో ఆ మేటర్ అయిపోయింది. అసలు చర్చ ఆ తర్వాత మొదలైంది. ఖుషి-2 సినిమా చేయాల్సిందేనంటూ పవన్ ఫ్యాన్స్ ఆన్ లైన్ విన్నపాల గోల ప్రారంభమైంది.

ఖుషి లాంటి సినిమాలు ఇప్పుడు చేయలేనంటూ స్వయంగా పవన్ కల్యాణ్ గతంలో ప్రకటించారు. తన ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందని, ఖుషి లాంటి కథల్ని తను ఊహించుకోలేనని ఆయన విస్పష్టంగా ప్రకటించారు.

ఇక ఎస్ జే సూర్య దగ్గరకొద్దాం. ఈయన కూడా దర్శకత్వం తగ్గించేశాడు. తగ్గించాడు అనేకంటే దాదాపు మానేశాడు అనడం కరెక్ట్. ఎందుకంటే, ఆర్టిస్టుగా అంత బిజీగా ఉన్నాడు సూర్య.

సో.. ఇలాంటి టైమ్ లో ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టుకోడు. ఒకవేళ పట్టుకున్నా, ఖుషి సీక్వెల్ కు పవన్ కల్యాణ్ ఒప్పుకోరు. కాబట్టి ఇలాంటివి చెప్పుకోడానికి బాగుంటాయి. ఆచరణ సాధ్యం కావు.

5 Replies to “ఆయన తీస్తాడా.. ఈయన చేస్తాడా..?”

Comments are closed.