ఎన్-కన్వెన్షన్ కూల్చివేత.. బాలయ్య మాటలు వైరల్

ఓవైపు ఈ వివాదం ఇలా నడుస్తుంటే, మరోవైపు కొంతమంది బాలకృష్ణ పాత వీడియోను వైరల్ చేస్తున్నారు.

అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ ను హైడ్రా కూల్చేసింది. దీనిపై చాలా పెద్ద వివాదం నడుస్తోంది. దానిపై స్టే ఉందంటారు నాగ్. అలాంటిదే లేదు కాబట్టే కూల్చేశాం అంటారు అధికారులు. మొత్తమ్మీద నాగార్జున మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు.

ఓవైపు ఈ వివాదం ఇలా నడుస్తుంటే, మరోవైపు కొంతమంది బాలకృష్ణ పాత వీడియోను వైరల్ చేస్తున్నారు. అప్పట్లో బాలకృష్ణ చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం అంటూ వాదిస్తున్నారు. ఇంతకీ అప్పుడు బాలయ్య ఏం చెప్పారు?

టాలీవుడ్ కు సంబంధించి లాక్ డౌన్ టైమ్ లో అతిపెద్ద వివాదం ఏదైనా అందంటే… అది బాలయ్య వ్యాఖ్యల వివాదమే. టాలీవుడ్ లో కొన్ని సమస్యల పరిష్కారం, కార్మికుల సంక్షేమం కోసం అప్పటి తెలంగాణ ప్రభుత్వంతో చిరంజీవి, నాగార్జున లాంటి కొంతమంది వ్యక్తులు చర్చలు మొదలుపెడితే.. “భూములు పంచుకోవడం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాళ్లంతా కలిశారంటూ” వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాలయ్య.

మీటింగ్ కు తనను ఎవ్వరూ ఆహ్వానించలేదని, వాళ్లు వాళ్లు భూములు పంచుకుంటున్నారంటూ ఆరోపించారాయన. ఇప్పుడా వీడియోను మరోసారి వైరల్ చేస్తున్నారు కొంతమంది. ఎన్-కన్వెన్షన్ కూల్చివేతను, బాలయ్య మాటలతో ముడిపెడుతున్నారు. అప్పుడు బాలకృష్ణ చెప్పిందే ఇప్పుడు నిజమైందంటున్నారు.

నిజానికి ఈ రెండింటికి అస్సలు సంబంధం లేదు. 2020లో బాలకృష్ణ ఈ కామెంట్స్ చేయగా.. దానికి ఎన్నో ఏళ్ల ముందే ఎన్-కన్వెన్షన్ ఉంది. బాలకృష్ణ-నాగార్జున మధ్య అభిప్రాయబేధాలున్న సంగతి అందరికీ తెలిసిందే. దాన్ని మరింత ఎగదోసేందుకు మాత్రమే ఈ వీడియోను సోషల్ మీడియాలో మరోసారి హైలెట్ చేస్తున్నారు కొంతమంది.

12 Replies to “ఎన్-కన్వెన్షన్ కూల్చివేత.. బాలయ్య మాటలు వైరల్”

  1. పార్టీ లకి అతీతంగా తెలంగాణా లో అందరూ ప్రభుత్వం చర్య ని సమర్దిస్తున్నారు, ఇదొక్కటే ఎందుకు టార్గెట్ చేశారు అని ఎవరూ అడగడం లేదు, కాని ఏపీ లో ఒక తెలంగాణా ప్రముఖుడి భవనం ఇలా చేసి ఉంటే మళ్ళీ పార్టీ లకి అతీతంగా విమర్శలు చేసి ఉండేవాళ్ళు!

    1. మన రాష్ట్రము లో తెలంగాణ వాళ్ళకి అసతులు ఉంటాయి అంటారా ???? ఇక్కడ వాళ్లే అక్కడ ఆస్తులు పోగేసుకుంటుంటే

  2. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా లో హైదరాబాద్ లో అక్రమంగా నిర్మించాడని నాగార్జున N కన్వెన్షన్ సెంటర్ ని కూలగొట్టింది, వెరీ గుడ్, వెల్ డన్, మరి మన రామోజీ ఫిలిం సిటీ కూడా అదే category అని కెసిఆర్ 2014 ముందు చెప్పేవాడు. ఇలానే 2015 లో కెసిఆర్ హడావిడి చేసి సినిమా వాళ్ళ దెగ్గర , రియల్ ఎస్టేట్ వాళ్ళ దెగ్గర, drug dealers దెగ్గర settlement చేసుకున్నారని అందరు అనేవారు , ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సమె రూట్ లోనే వెళ్తుందా లేక రామోజీ ఫిలిమ్ సిటీ, ఇంకా ఓల్డ్ సిటీ లో చాల ఉన్నాయట వాటి సంగతి కూడా చూస్తారా ? చూద్దాం !

Comments are closed.