జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసి, కొన్ని నిమిషాల్లోనే విత్‌డ్రా చేసుకోవడం చర్చనీయాంశమైంది. మొదటి జాబితాలో 44 మంది అభ్యర్థుల వివరాలున్నాయి. ఏమైందో తెలియదు కానీ, ఆ జాబితాను సోషల్ మీడియా నుంచి బీజేపీ తొలగించింది. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకుంది.
రాజ్‌పోరా నుంచి ఆర్షిద్భట్, పోషియాన్ నుంచి జావేద్ అహ్మద్ ఖాద్రీ, అనంతనాగ్ వెస్ట్ నుంచి మొహమ్మద్ రషీక్ వానీ తదితరుల పేర్లు ఉన్నాయి. బీజేపీ నుంచి ముస్లిం అభ్యర్థులుండడం విశేషం. జమ్ము కశ్మీర్లో అనివార్యంగా ముస్లిం అభ్యర్థుల్ని బీజేపీ నిలపాల్సి వస్తోంది.
ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం అనే బలమైన ముద్ర వుంది. ఇటీవల వక్ప్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా ముస్లింలు దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా వుండగా బీజేపీ తన జాబితాను విత్‌డ్రా చేసుకోవడానికి కారణం ఏంటో తెలియాల్సి వుంది. జాబితాపై ఏవైనా అభ్యంతరాలున్నాయా? అనే అనుమానం తలెత్తింది. ఏది ఏమైనా బీజేపీ తన జాబితాను వెనక్కి తీసుకోవడంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
Call boy jobs available 8341510897
vc estanu 9380537747