టీడీపీలో సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయన టీడీపీలోనే ఎవరికీ లేనంత సీనియారిటీ కలిగిన నేతగా ఉన్నారు. అయ్యన్నపాత్రుడు అప్పట్లో ఒక సందర్భంలో తాను చంద్రబాబు కంటే టీడీపీలో సీనియర్ అని కూడా చెప్పుకున్నారు. టీడీపీ 1982లో ఏర్పాటు అయితే అయ్యన్న అప్పుడే చేరారు. ఆనాటికి చంద్రబాబు కాంగ్రెస్ మంత్రిగా ఉన్నారు.
అలా బోల్డ్ గా మాట్లాడుతూ ఒక్కోసారి తెలియకుండానే అధినాయకత్వానికి ఇండైరెక్ట్ గా చురకలు అంటించే అయ్యన్న స్పీకర్ అయ్యారు. అయినా ఆయన సమయం వచ్చినపుడు మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయలను చెబుతూ ఉంటారు. లేటెస్ట్ గా ఆయన చేసిన ఒక కామెంట్ మళ్లీ చర్చకు తావిస్తోంది.
తాను ఎన్టీఆర్ డిస్కవరీ అని అయ్యన్న చెప్పుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తనలాంటి వారిని ఎంతో మందిని తెచ్చారని అలా తనకు కూడా చిన్న వయసులోనే రాజకీయ బిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని అయ్యన్న గతాన్ని నెమరేసుకున్నారు. తాను టీడీపీలో ఈ రోజు ఉన్నాను అంటే అది ఎన్టీఆర్ దయ అని క్రెడిట్ అంతా పెద్దాయనకు ఇచ్చేసారు.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినపుడు ఎంతో మంది ఆయనని విమర్శించరని రాజకీయాల్లో ఆయన రాణించరు అని కూడా అన్నారని.. కానీ తాను ఎన్టీఆర్ సక్సెస్ అవుతారని ఊహించాను అని కూడా అయ్యన్న అన్నారు. ఇలా అయ్యన్న చేసిన కామెంట్స్ మీద చర్చకు తెర లేచింది. అయ్యన్న ఏది మాట్లాడినా ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. అదే ఆయన నైజం. అందులో ఏమి ఉందో అన్న రచ్చ మాత్రం జరుగుతూనే ఉంటుంది. అయ్యన్న ఎన్టీఆర్ ని తలచుకోవడం మాత్రం ఒక లేటెస్ట్ డిబేట్ గా ఉంది.
vc estanu 9380537747
లేటెస్టు డిబేట్ గా వుందా??ఏమున్నది రా ఆ మాటల్లో.. అందరికి తెలిసిందే కదా.పిల్లి వెందుల MLA కి ప్రతిపక్ష హోదా విషయం కదా లేటెస్ట్ డిబేట్.
Call boy works 8341510897
80 years industry