ఒకప్పుడు అయితే అది బెంగళూరుకు శివారు ప్రాంతం. ఎప్పుడో అక్కడ ప్రభుత్వం జైలును ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు అది బెంగళూరులో భాగం. బెంగళూరు నగరంలో భాగం అయ్యింది. బెంగళూరు మహా నగర పాలికె శివారు ప్రాంతమే అయినా.. పూర్తిగా నగర వాతావరణంలో భాగమైంది ఆ జైలు ప్రాంతమైన పరప్పన అగ్రహార. ఈ స్టేజ్ దాటిన తర్వాతే బెంగళూరు అభివృద్ధిలో కీలకం అయిన ఎలక్ట్రానిక్ సిటీ మొదలవుతుంది. ఇలా చుట్టూరా అభివృద్ధి చెందిన ప్రాంతం మధ్యన ఈ జైలు ఉంది.
ఇక్కడ గతంలో చాలా మంది ప్రముఖులు ఖైదులో ఉన్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె సన్నిహితురాలు శశికళ కూడా ఈ జైల్లోనే ఉండేవారు గతంలో. జయలలిత ఆస్తుల కేసు విచారణ తమిళనాడులో జరగడానికి వీల్లేదని దశాబ్దాల కిందటే దాన్ని కర్ణాటకకు బదిలీ చేయించారు. దీంతో జయ జైలుకు వెళ్లినప్పుడల్లా పరప్పన అగ్రహార జైలుకే వెళ్లే వారు. ఆమె మరణానంతరం ఆ కేసుల్లోనే శిక్షను పొందిన శశికళ తన శిక్ష కాలాన్ని పరప్పన అగ్రహార జైల్లోనే పూర్తి చేసుకున్నారు.
అయితే శశికళ జైల్లో ఉన్నప్పుడే పెద్ద దుమారం రేగింది. ఆమె తనకు అవసరం అయినప్పుడు జైలు నుంచి బయటకు కూడా వచ్చి వెళ్తోందనే వార్తలు వచ్చాయి. చుట్టుపక్కల ఆమె షాపింగ్ కూడా చేస్తోందనే వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించి ఆమె ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.
జైల్లో శిక్షను ఎదుర్కొంటున్న శశి అలా తనకు ఏమీ తోచనప్పుడు జైల్లోంచి బయటకు వచ్చి విహారం చేసి, చుట్టుపక్కల షాపింగ్ చేసుకుంటోందనే వార్తల నేపథ్యంలో అప్పుడు కూడా సిద్ధరామయ్య ప్రభుత్వమే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. శశికి ఉన్న ఆర్థిక శక్తి నేపథ్యంలో కర్ణాటకలో ఆమెను వైరిగా భావించే వారు లేకపోవడంతో ఆమె బయట తిరగడానికి జైలు అధికారులు కూడా సహకరించి ఉండవచ్చు!
మరి శశికే అన్ని సౌకర్యాలు దక్కినప్పుడు కన్నడ నాట స్టార్ హీరో కావడంతో దర్శన్ కు కూడా జైలు అధికారులు తమదైన సహకారం అందించి ఉండవచ్చు. పరప్పన అగ్రహార జైల్లో ప్రతిదానికీ ఒక రేటు ఉందని ఆ మేరకు దర్శన్ కు రిలాక్సేషన్ అవకాశం ఏర్పడి ఉండవచ్చని అంటున్నారు. అందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో మరోసారి పరప్పన అగ్రహార జైలు వార్తలకు ఎక్కింది.
ఇప్పుడు ఇక్కడ మరో ప్రముఖుడు ఖైదీగా ఉన్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కూడా ఈ జైల్లోనే ఉన్నాడు. లైంగిక వేధింపుల కేసులో జైల్లో ఉన్న ప్రజ్వల్ పరిస్థితి ఏమిటో అక్కడ నుంచి వీడియోలు బయటకు రాలేదు!
Call boy works 8341510897
Call boy jobs available 8341510897
vc estanu 9380537747