కల్కి తరువాత మళ్లీ ఈవారమే!

మన సినిమా అభిమానులు మొహం వాచిపోయి వున్నారు. సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. బాగుంటే చూస్తున్నారు. లేదంటే లేదు. కానీ సరైన హుషారు మాత్రం లేదు. ఏదో లోటు, సరైన హడావుడి థియేటర్ దగ్గర లేని…

మన సినిమా అభిమానులు మొహం వాచిపోయి వున్నారు. సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. బాగుంటే చూస్తున్నారు. లేదంటే లేదు. కానీ సరైన హుషారు మాత్రం లేదు. ఏదో లోటు, సరైన హడావుడి థియేటర్ దగ్గర లేని లోటు. సరైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ లేదన్న బాధ. ఇలాంటి టైమ్ లో వస్తోంది. సరిపోదా శనివారం. కల్కి లా భారీ సినిమా కాదు. పాన్ ఇండియా సినిమానే కానీ, వందల కోట్ల హడావుడి కాదు. అయినా కూడా హమ్మయ్య, థియేటర్ దగ్గర కాస్త సందడి చేసే సినిమా వచ్చిందన్న హుషారు సినిమా లవర్స్ లో కనిపిస్తోంది.

హీరో నానికి ఫ్యాన్ ఫాలోయింగ్ మొదటి నుంచీ బాగానే వుంది. అయితే శ్యామ్ సింగ రాయ్, దసరా, హాయ్ నాన్న సినిమాల తరువాత మరింత పెరిగింది. నాని సెలక్ట్ చేసుకునే సబ్ఙెక్ట్ లు అతనికి అదనపు ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చి పెట్టాయి. సరిపోదా శనివారం సినిమా ఈవారం విడుదల కాబోతోంది. ఈ సినిమా ఫుల్ యాక్షన్ సినిమా. అందువల్ల సహజంగానే మాస్ ప్రేక్షకులు ఇంట్రస్ట్ గా ఎదురు చూస్తున్నారు. దానికి తోడు హీరో నాని విపరీతంగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.

ఇటీవలి కాలంలో ఇన్ని పదుల ఇంటర్వూలు, ఇన్ని భాషల్లో మరే హీరో కూడా ఇవ్వలేదు. సినిమా విడుదల ఒకటి రెండు రోజుల్లోకి వచ్చేసినా కూడా నాని ప్రచారం వదలలేదు. దాదాపు రెండు వారాలకు పైగా నిర్విరామంగా అది కూడా మార్నింగ్ టు నైట్ ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. దీని వల్ల సినిమాకు ఓ కలర్ అంటూ వచ్చింది. ఓ పెద్ద సినిమా వస్తోందన్న వైబ్ క్రియేట్ అయింది.

దానికి తోడు అమెరికాలో ఎర్లీ ప్రీమియర్లు, తెలుగునాట ఉదయం ఏడు గంటలకే షోలు ప్లాన్ చేసారు. కల్కి తరువాత ఈ హంగామా మళ్లీ ఇప్పుడే. అందువల్ల మంచి ఓపెనింగ్ తెగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలింది సినిమా ఎలా వుంటుంది అన్నదే. కనీసం యావరేజ్‌ గా వున్నా చాలు సినిమా లాగేస్తుంది. పరిస్థితి అలా వుంది. ఎందుకంటే అగస్ట్ 15న వచ్చిన రెండు పెద్ద సినిమాలు బాగా డిస్సపాయింట్ చేసాయి. ఈ సినిమా అయితే మరీ అంత దారుణంగా డిస్సపాయింట్ చేయదనే అభిమానులు నమ్ముతున్నారు.

పైగా నాని చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఈ సినిమా గురించి చాలా పాజిటివ్ గా ప్రామిసింగ్ గా చెబుతూ వస్తున్నారు. అందువల్ల సినిమా మినిమమ్ వున్నా చాలు, థియేటర్ కు వచ్చే ప్రేక్షకుల అకలి తీరిపోతుంది.

7 Replies to “కల్కి తరువాత మళ్లీ ఈవారమే!”

Comments are closed.