అస‌లే మూలుగుతుంటే.. శివాజీ ప‌డ్డాడు!

మ‌హారాష్ట్ర‌లో అస‌లే క‌మ‌లం కూట‌మి ప‌రిస్థితి ఏం బాగున్న‌ట్టుగా లేదు. త‌మ చిత్తానికి పార్టీల‌ను చీల్చి అక్క‌డ ఒక కూట‌మిని ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ కూట‌మిలో బీజేపీ తిట్టిన వాళ్లంతా ఉన్నారు! కొంద‌రినైతే…

మ‌హారాష్ట్ర‌లో అస‌లే క‌మ‌లం కూట‌మి ప‌రిస్థితి ఏం బాగున్న‌ట్టుగా లేదు. త‌మ చిత్తానికి పార్టీల‌ను చీల్చి అక్క‌డ ఒక కూట‌మిని ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ కూట‌మిలో బీజేపీ తిట్టిన వాళ్లంతా ఉన్నారు! కొంద‌రినైతే తీవ్ర అవినీతి ప‌రులు అంటూ గ‌తంలో బీజేపీ పెద్ద ఉద్య‌మ‌మే న‌డిపింది. ఆ ఉద్య‌మం ఆధారంగానే తాము నిజాయితీతో కూడిన పాల‌న అందిస్తామంటూ దేశంలో బీజేపీ త‌న ఇమేజ్ ను పెంపొందించుకుంది. అలా బీజేపీకి అప్పుడు అవినీతి ప‌రులుగా ఉప‌యోగ‌ప‌డిన వారు ఇప్పుడు అక్క‌డ క‌మ‌లం పార్టీలోనే ఉన్నారు! మొన్న‌టి లోక్ స‌భ ఎన్నిక‌ల ముందు అలాంటి వారిని చేర్చేసుకుని బీజేపీ రాత్రికి రాత్రి వారికి నామినేటెడ్ ప‌ద‌వుల‌ను ఇచ్చింది. అయితే అంత చేసినా మ‌హారాష్ట్ర‌లో బీజేపీ పోటీ చేసిన ఎంపీ సీట్ల‌లో నెగ్గింది త‌క్కువే!

అతి త్వ‌ర‌లోనే అక్క‌డ అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా ఉన్నాయి. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ కూట‌మికి, ప్ర‌త్యేకించి బీజేపీకి ఎదురుదెబ్బ నేప‌థ్యంలో అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. ఇలాంటి నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర తీరంలో ఏర్పాటు చేసిన 35 అడుగుల శివాజీ విగ్ర‌హం నేల‌కు కూల‌డం పెనువివాదంగా మారింది. శివాజీ సెంటిమెంట్ ను బీజేపీ అక్క‌డ బాగానే వాడుకుంటూ వ‌చ్చింది. అందులో భాగంగా 35 అడుగుల భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసి.. దాదాపు ఏడాది కింద‌ట మోడీ చేతే దాన్ని ఆవిష్క‌రింపజేశారు! అంత వ‌ర‌కూ బాగానే ఉంది కానీ, ఇప్పుడు అదే విగ్ర‌హం నాణ్య‌త లేమితో కుప్ప కూలింది.

ఏడాది స‌మ‌యానికే ఆ విగ్ర‌హానికి ఏర్పాటు చేసిన బోల్టులు తుప్పు ప‌ట్టిపోయాయ‌ని దాంతోనే విగ్ర‌హం నేల‌కొరిగింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి! మ‌రీ ఏడాదికే తుప్పు ప‌ట్టి విరిగిపోవ‌డం ఏమిటో! దీంతో బ్లేమ్ గేమ్ మొద‌లైంది. త‌మ‌ది నీతికి, నిజాయితీకి నిలువెత్తు పాల‌న అని బీజేపీ ప్ర‌భుత్వం చెప్పుకుంటూ ఉంది. మ‌రి స్వ‌యంగా మోడీ చేత ఆవిష్క‌రించ‌బ‌డిన విగ్ర‌హం నాణ్య‌త ఏ పాటితో అనే చ‌ర్చ స‌హ‌జంగానే జ‌రుగుతోంది. అందునా శివాజీ ని సెంటిమెంట్ గా వాడారు. అదే విగ్ర‌హం ఇప్పుడు కూలింది!

దీంతో.. ముందుగా కాంట్రాక్ట‌ర్ పై కేసు, ఎఫ్ఐఆర్ అంటూ హ‌డావుడి చేశారు. అయితే ఇప్పుడు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఆ విగ్ర‌హంతో రాష్ట్ర ప్ర‌భుత్వానికే సంబంధం లేదంటోంది! దీనిపై డిప్యూటీ సీఎం ఫ‌డ్న‌వీస్ స్పందిస్తూ ఆ విగ్ర‌హం ఏర్పాటుతో స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ కు సంబంధం లేద‌ని, నేవీ ఏర్పాటు చేసిన విగ్ర‌హం అది అంటూ ఆయ‌న చేతులు దులుపుకునే య‌త్నం చేస్తున్నారు! మ‌రి క్రెడిట్ వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌భుత్వాల‌ది, కూలిపోయింది కాబ‌ట్టి నేవీ ఖాతాలో ఆ త‌ప్పు అనే విమ‌ర్శ‌ల జ‌డి కూడా ఇప్పుడు కురుస్తోంది!

12 Replies to “అస‌లే మూలుగుతుంటే.. శివాజీ ప‌డ్డాడు!”

  1. విగ్రహాలు, డాములు, బ్రిడ్జ్ లు పేక మేడల్లా కూలిపోతున్నాయి.. ప్రజా ధనం మీద ఎవరికీ అకౌంటెబిలిటీ లేదు.. ప్రజలు కూడా ఉచితాలు మరిగి ప్రశ్నించడం మర్చిపోయారు

        1. Ex CJI babu gari pramana sweekaraniki vachinapude ardamavvali courts entha baga pani chestunnayo.. Mana vallu briefed me ani addamga dorikina case undadu.. Quid pro quo ni. Prove cheyalekapoina burada jallutuntam.. Media and vyavastalu chetilo unnay kada

Comments are closed.