మలయాళ చిత్ర పరిశ్రమలో హేమా కమిటీ నివేదిక తాలూకు ప్రకంపనలు కొనసాగుతూ ఉన్నాయి. మలయాళ చిత్రపరిశ్రమ లో మీ టూ తాలూకు ప్రకంపనలు మొదలై చాలా కాలమే అయ్యింది. ప్రత్యేకించి ఒక నటిని కిడ్నాప్ చేయించి, వేధింపులకు పాల్పడిన వ్యవహారంలో అక్కడి స్టార్ హీరో దిలీప్ అరెస్టు, కొన్ని నెలల పాటు జైలు జీవితం, ఆ తర్వాత ఆయన పై విచారణ కొనసాగుతూ ఉన్న వ్యవహారం పెను తుఫాన్ కు కారణం అయ్యింది.
అప్పట్లోనే మలయాళ చిత్ర పరిశ్రమలో పరిస్థితులపై ప్రభుత్వం కమిటీని వేసింది. ఆ కమిటీ తన నివేదికను ఎప్పుడో ఇచ్చినా.. ఇటీవల చివరకు ప్రభుత్వం దాన్ని బహిర్గతం చేయడంతో తేనె తుట్టెను కదిపినట్టుగా అయ్యింది. వాళ్లూ వీళ్లు అని తేడా లేకుండా అంతా ఇప్పుడు కార్నర్ లో నిలబడుతున్నారు!
ఒకప్పుడు మలయాళీ చిత్ర పరిశ్రమ నటీనటుల సంఘం(అమ్మ)లో దిలీప్ హవా కొనసాగింది. మోహన్ లాల్, మమ్ముట్టీలు కూడా దిలీప్ కనుసన్నల్లోనే ఉన్నారంటారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఇండస్ట్రీని శాసించే స్థితిలో అప్పుడు దిలీప్ నిలిచాడు. ఆ అహంభావంతోనే అతడు తీవ్ర వివాదాల్లో కూరుకుపోయాడు. ఆ వివాదం తర్వాత దిలీప్ కెరీర్ పూర్తిగా మందగమనంలో పడిపోయింది. సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ, ఎవరూ పెద్దగా పట్టించుకోనంత స్థాయిలో అతడి కెరీర్ కొనసాగుతూ ఉంది. కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.
దిలీప్ వివాదం పరిస్థితుల్లో ఆ సంఘం పగ్గాలు చేపట్టిన మోహన్ లాల్ కూడా తాజాగా ఆ పదవికి రాజీనామా చేశాడు. మాలీవుడ్ లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, మహిళలకు ఏ మాత్రం సురక్షితమైన పరిస్థితులు లేవని కమిటీ తేల్చి చెప్పడం, ఆ నివేదిక ఇప్పుడు బహిర్గతం కావడం, దాంతో పాటు ఇండస్ట్రీలోని సీనియర్ల పేర్లు కూడా తలా ఒక వివాదంలో ఇరుక్కోవడంతో ఇక ఈ తలనొప్పి ఎందుకన్నట్టుగా మోహన్ లాల్ రాజీనామా చేసినట్టుగా ఉన్నాడు.
మలయాళ ఇండస్ట్రీలో సీనియర్ ఆర్టిస్ట్ సిద్ధిఖ్ కూడా వివాదంలో చిక్కుకున్నాడు. సిద్ధిఖ్ మలయాళంలో పేరున్న నటుడు ఒక తెలుగు సినిమాలో కూడా అద్భుతంగా నటించాడు. అయితే ఒక సినిమా చర్చకు అంటూ సిద్ధిఖ్ తనను పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడని, అసలు అలాంటి చిత్రమే కార్యరూపం దాల్చలేదంటూ ఒక యువతి చేసిన ఆరోపణలతో సిద్ధిఖ్ తన సభ్యత్వానికి రాజీనామా చేశాడు. విచారణను ఎదుర్కొనాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు.
కమిటీ నివేదిక బహిర్గతం కావడంతో అనేక మంది నటుల గురించి తలా ఒక వివాదం వార్తల్లోకి ఎక్కుతోంది. దీంతో.. మోహన్ లాల్ రాజీనామా చేసినట్టుగా ఉన్నాడు. అయితే ఈ తేనెతుట్టె ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. దిలీప్ వివాదం తర్వాత అక్కడ కొంతమంది నటీమణులు చాలా ఘాటుగా స్పందిస్తూ వస్తున్నారు అనేక విషయాల్లో. మరి అక్కడి సినిమా వాళ్లు గతంలో మీటింగులు పెట్టుకుని సర్దుకునే ప్రయత్నం చేశారు. దిలీప్ వివాదం తర్వాత పెద్ద పెద్ద మీటింగులు కొనసాగాయి. కమిటీ నివేదికతో ఇప్పుడు మరోసారి దుమారం రేగింది. మరి ఇదెన్నాళ్లో!
vc estanu 9380537747
what is vc?
Call boy works 8341510897
జనం పట్టించుకోరు