విలాసం ఎఫెక్ట్.. ద‌ర్శ‌న్ ను ఆ మూల జైలుకు!

త‌న అభిమాని హ‌త్య కేసులో ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైల్లో ఉంటూ, అక్క‌డ అవ‌కాశాల‌ను బ‌ట్టి రిలాక్స్ అయిన క‌న్న‌డ స్టార్ హీరో ద‌ర్శ‌న్ కు అక్క‌డ కూడా ప్ర‌శాంతత లేకుండా పోయిన‌ట్టుగా ఉంది! ద‌ర్శ‌న్…

త‌న అభిమాని హ‌త్య కేసులో ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైల్లో ఉంటూ, అక్క‌డ అవ‌కాశాల‌ను బ‌ట్టి రిలాక్స్ అయిన క‌న్న‌డ స్టార్ హీరో ద‌ర్శ‌న్ కు అక్క‌డ కూడా ప్ర‌శాంతత లేకుండా పోయిన‌ట్టుగా ఉంది! ద‌ర్శ‌న్ అక్క‌డ చిల్ అవుతున్నాడ‌నే వీడియోలు వైర‌ల్ కావ‌డంతో.. అత‌డిని త‌క్ష‌ణం వేరే జైలుకు త‌ర‌లించాల‌ని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసులు లేట్ లేకుండా ద‌ర్శ‌న్ ను బ‌ళ్లారి జైలుకు షిఫ్ట్ చేశాడు!

ఈ వ్య‌వ‌హారంపై క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కూడా స్పందించింది. జైళ్ల‌లో పరిస్థితుల‌పై త‌నిఖీలు చేయాలంటూ సీఎం సిద్ధ‌రామ‌య్య ఆ శాఖ‌కు ఆదేశాలు ఇచ్చారు. ద‌ర్శ‌న్ వివాదంపై బీజేపీ స్పందించింది. ప్ర‌భుత్వంతో సాన్నిహిత్యం వ‌ల్లే ద‌ర్శ‌న్ కు జైల్లో కూడా విలాసాలు అనే విమ‌ర్శ‌ల‌ను క‌మ‌లం పార్టీ చేసింది. ద‌ర్శ‌న్ పై న‌మోదైన కేసు కోర్టు విచార‌ణ‌లో ఉంది. ఈ నేప‌థ్యంలో అత‌డిని బ‌ళ్లారి జైలుకు త‌ర‌లించాలంటూ న్యాయ‌స్థానం ఆదేశాలు ఇచ్చింది.

కొడితే బెంగ‌ళూరులో క‌నీసం చ‌ల్ల‌టి వాతావ‌ర‌ణం కూడా ద‌ర్శ‌న్ కు మిస్ అవుతున్న‌ట్టుగా ఉంది. బెంగ‌ళూరు నుంచి ఆ రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లోని బ‌ళ్లారి జైల్లో ప‌డ్డాడు ద‌ర్శ‌న్. త‌న స‌న్నిహితురాలికి మెసేజ్ లు పంపుతున్నాడ‌ని త‌న అభిమాని అయిన రేణుకా స్వామిని హ‌త్య చేయించాడ‌నే కేసులో ద‌ర్శ‌న్ అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. త‌న అభిమాన హీరో భార్య‌ను వ‌దిలి మ‌రో మ‌హిళ‌తో స‌న్నిహితంగా ఉండ‌టం న‌చ్చ‌ని స‌ద‌రు అభిమాని ఆమెకు అస‌భ్య మెసేజ్ లు పంపించాడ‌ట సోష‌ల్ మీడియాలో.

ఈ వివాదంలో మ‌నుషుల‌ను ఏర్పాటు చేసి త‌న అభిమానిని కిడ్నాప్ చేయించి, అత‌డిని దారుణం కొట్టి హ‌త‌మార్చ‌డం వెనుక క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌గా ద‌ర్శ‌న్ వ్య‌వ‌హ‌రించాడ‌ని పోలీసులు కేసులు న‌మోదు చేశారు. అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ కూడా ద‌క్క‌క‌పోవ‌డంతో ద‌ర్శ‌న్ జైల్లో ఉన్నాడు. బెంగ‌ళూరులోని ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైల్లో ద‌ర్శ‌న్ ఇన్నాళ్లూ ఉన్నాడు. అక్క‌డా వివాదం త‌లెత్త‌డంతో బ‌ళ్లారి జైలుకు షిఫ్ట్ అయ్యాడు.

4 Replies to “విలాసం ఎఫెక్ట్.. ద‌ర్శ‌న్ ను ఆ మూల జైలుకు!”

  1. Shift cheytam.enduku bail or nirdoshi ani chepi intiki pamputey chalu kada last lo ela aina adey avatadi. Mana law ala ney undi money untey chalu em chesina bail istaru. Money money .inka enduku karchu waste intiki send cheyadi adi better.india.will never change.

Comments are closed.