వన్.. టూ అన్నారు.. ఇప్పుడు త్రీ అంటున్నారు

పుష్ప వన్ కోసం డేట్ లు తీసుకుని, షూట్ చేసినా, కొద్దిగానే స్క్రీన్ స్పేస్ దొరికిందని, అదే మని అడిగితే రెండో భాగంలో వుంటుందని చెప్పారని నటుడు రావు రమేష్ అన్నారు. మారుతీ నగర్…

పుష్ప వన్ కోసం డేట్ లు తీసుకుని, షూట్ చేసినా, కొద్దిగానే స్క్రీన్ స్పేస్ దొరికిందని, అదే మని అడిగితే రెండో భాగంలో వుంటుందని చెప్పారని నటుడు రావు రమేష్ అన్నారు. మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో రావు రమేష్ ఇంటర్వూ ఇచ్చారు.

పోనీ ఇప్పుడు పుష్ప 2 లో అయినా మంచి స్క్రీన్ స్పేస్ వుంటుందా? అని ప్రశ్నిస్తే, ఏమో..ఇప్పుడు త్రీ అని అంటున్నారు కదా, దాంట్లోకి తోస్తారేమో అని చమత్కరించారు. మరీ రొటీన్ పాత్రలు అయిపోతుండడంతొ, ఏదో తెలియని వెలితి పీడిస్తోందని, అందుకే చాలా సినిమాలు, వేరే వాళ్లకు వెళ్తాయని, ఇన్ కమ్ వుండదని తెలిసీ వదులుకుంటున్నా అని రావు రమేష్ అన్నారు. ఇలాంటి టైమ్ లో మారుతి నగర్ సినిమా వచ్చి వెలితిని చాలా వరకు పూడ్చిందని అన్నారు.

పాన్ ఇండియా సినిమాల్లో విలన్లు గా ఏరి కోరి వేరే భాషల నటులను కేవలం ప్రెజెన్స్ కోసం తెస్తున్నారు తప్ప వేరు కాదన్నారు. కేవలం ఫాజిల్ లాంటి ఒకరిద్దరు తప్ప, భాష ను భావాన్ని అర్ధం చేసుకుని, నటించేవారు అరుదుగా వుంటారన్నారు. కేవలం ప్రాంప్టింగ్ మీద, డబ్బింగ్ మీద డిపెండ్ అయితే సరైన నటన ఫేస్ లోకి రావడం కష్టం అన్నారు.

ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లు అందుకే అన్ని భాషలు నేర్చుకుని, నటించి శహభాష్ అనిపించుకుంటున్నారని అన్నారు. తాను కూడా తమిళం, కన్నడ భాషల్లో నటించినపుడు డైలాగు మొత్తం నేర్చుకుని, ప్రాంప్టింగ్ లేకుండా తానే నటించి, డబ్బింగ్ చెబుతున్నా అన్నారు.

మంచి పాత్రల కోసం చూస్తున్నా అని, ఓటిటి లాంటి ప్లాట్ ఫార్మ్ లు చూస్తుంటే, మంచి పాత్రలు కనిపిస్తుంటే, అలాంటివి చేయాలనే తపన పుడుతోందని రావు రమేష్ చెప్పారు.

4 Replies to “వన్.. టూ అన్నారు.. ఇప్పుడు త్రీ అంటున్నారు”

Comments are closed.