వాల్తేరు డివిజన్ ని మరచిపోవచ్చు

విశాఖకు రైల్వే జోన్ ఇచ్చారు. బాగానే ఉంది. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. భూములు 53 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చామని చెబుతోంది. తొందరలో రైల్వే జోన్ పనులు స్టార్ట్ కావచ్చు. అయితే విశాఖ…

విశాఖకు రైల్వే జోన్ ఇచ్చారు. బాగానే ఉంది. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. భూములు 53 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చామని చెబుతోంది. తొందరలో రైల్వే జోన్ పనులు స్టార్ట్ కావచ్చు. అయితే విశాఖ రైల్వే జోన్ లో వాల్తేరు డివిజన్ ఉండదు. దాన్ని ఆరేళ్ల క్రితమే తెగ్గొట్టేశారు.

జోన్ సంగతేమో కానీ 150 ఏళ్ల పై దాటిన వాల్తేరు డివిజన్ మాత్రం ముక్కలైపోయింది. ఒక విశాఖ నుంచి ఉన్న ముక్కను తీసుకెళ్ళి విజయవాడలో కలిపేశారు. ఆ రెండవ ముక్కను రాయగడలో కలిపేసి డివిజన్ చేసేసారు

అలా ఒడిషాకు పూర్తి న్యాయం చేశారు. ఇదంతా బిజూ జనతాదళ్ ఒడిషాలో అధికారంలో ఉండగానే జరిగింది. ఇపుడు నవీన్ పట్నాయక్ ని దించేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ కేంద్రంలోనూ ఉంది. దాంతో రాయగడ డివిజన్ ఏర్పాటుకు బీజేపీ పచ్చ జెండా ఊపేసింది.

దాని పనులు విశాఖ రైల్వే జోన్ కంటే వేగంగా జరుగుతున్నాయి. రాయగడ రైల్వే డివిజన్ కోసం అవసరమైన భూమిని చూశారు. భవనాల నిర్మాణం కోసం డిజైన్లు వేశారు. 24 భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదించారు. టెండర్లు కూడా పిలిచేశారు. ఉద్యోగుల భవనాలు క్వార్టర్లు ఇతర విభాగాల నిర్మాణానికి అవసరమైన 125 ఎకరాల స్థలాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం సిద్ధం చేసింది.

ఇలా రాయగడ డివిజన్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతూంటే విశాఖ రైల్వే జోన్ ఎప్పటికీ అన్నది ఉత్తరాంధ్ర వాసుల ప్రశ్న. విశాఖ రైల్వే జోన్ తో పాటు వాల్తేరు డివిజన్ కూడా ఉండాలని ప్రజా సంఘాలు రాజకీయ పక్షాలు పట్టుబట్టినా ఇక అది కల అన్నది తేలిపోయింది. బీజేపీ రాయగడ డివిజన్ కి అంతా సిద్ధం చేసిన వేళ వాల్తేరు డివిజన్ గురించి మరచిపోవచ్చు అంటున్నారు.

లాభాల బాటలో ఉన్న వాల్తేరు డివిజన్ లేని విశాఖ జోన్ ఎందుకు అంటే అది కూడా ఆలోచించాల్సిందే. జోన్ ఏర్పాటు వల్ల వర్కౌట్ కాదు అనుకుంటే ఫ్యూచర్ లో ఏమి చేస్తారో కూడా తెలియదు అని అంటున్నారు.

13 Replies to “వాల్తేరు డివిజన్ ని మరచిపోవచ్చు”

  1. ఇంత జరుగుతుంటే 22 మంది ఎంపీలు ఏమి చేసారు.. అన్న అనేకసార్లు ఢిల్లీ వెళ్ళాడుగా.. ఈ పాయింట్ మర్చిపోయాడా

  2. అసత్యాలు బాగానే రాస్తున్నారు, ఎప్పుడో 2003 లోనే waltair డివిజన్ ఒడిశా తాలూకు రైల్వే డివిజన్ లో కలిసింది, మ*హా నాయకుడు గారు కప్పాలు చెల్లించడమే కాని అలాంటివి పట్టించుకుంటే కదా!

  3. Vizag people ki leni badha neeku enduku GA. New capital ki fund flow 60000 crores vuntundi antunnaru. State manchi kosam antha investment vadilesukunna manchollu Vizag vallu. Whether they get anything or not Vizag people are firmly behind Kootami and development. Nuvvu mooseyyi ika.

    1. Vizag people did not vote for Amaravathi. They voted against the land grabbing done by YCP party members in last 5 years. Do not confuse people with your illogical comments.

  4. నిన్న జగన్ ఉండగానే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అయ్యింది కానీ ఫౌండేషన్ స్టోన్ వెయ్యలేదు అన్నావు, ఈ రోజేమో టీడీపీ తెచ్చిన విశాఖ జోన్ వల్ల నష్టం జరుగుతుంది ఎందుకంటే వాల్తేరు డివిజన్ ని వదులుకున్నారు అంటున్నావు. నువ్వు మాములోడివి కాదు.

    బాబు. నంది ని పంది చెయ్యాలనుకుంటున్నావు.

  5. Nice achievement. They are ready to claim achievements and investments made in last 5 years and do not want to own , question or rectify mistakes being done in the current governance.

    Some examples include looting done in name of free sand scheme and canteens, deteriorating law and order and lastly and most importantly not able to get grant for capital.

Comments are closed.