విశాఖ మీద లోకేష్ ఫోకస్

నారా లోకేష్ మంత్రి అయ్యాక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక విశాఖ రాలేదు. రెండున్నర నెలల పాలన తరువాత మొదటి సారి విశాఖకు లోకేష్ వస్తున్నారు. లోకేష్ బుధవారం రాత్రికి విశాఖ చేరుకుని పార్టీ…

నారా లోకేష్ మంత్రి అయ్యాక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక విశాఖ రాలేదు. రెండున్నర నెలల పాలన తరువాత మొదటి సారి విశాఖకు లోకేష్ వస్తున్నారు. లోకేష్ బుధవారం రాత్రికి విశాఖ చేరుకుని పార్టీ ఆఫీసులోనే బస చేస్తారు. గురువారం ఆయన కోర్టు కేసు పనిని చూసుకుని పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది.

విశాఖలో పార్టీ పరిస్థితులను ఆయన తెలుసుకుంటారని అంటున్నారు. విశాఖ రూరల్ జిల్లాకు మంత్రి పదవి అర్బన్ జిల్లాకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పోస్ట్ అన్నది ఇచ్చారు. అయినా అనుకున్న విధంగా సైకిల్ జోరు చేయడం లేదు. దాంతో లోకేష్ నాయకులకు దీని మీద దిశా నిర్దేశం చేయడానికి లోకేష్ ఈ టూర్ ని వాడుకుంటారు అని అంటున్నారు.

పార్టీలో ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి ఉండడాన్ని హై కమాండ్ గమనిస్తోంది అని అంటున్నారు. దీంతో పార్టీ అంతా పటిష్టంగా ముందుకు అడుగులు వేయడానికి తగిన సలహా సూచనలను ఇస్తారు అని అంటున్నారు. కొందరు సీనియర్లు మంత్రి పదవి రాలేదని కొంత నిరాశ లో ఉన్నారని ప్రచారం సాగుతోంది. అలాగే జూనియర్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.

నామినేటెడ్ పదవుల మీద గంపెడాశలు పెట్టుకున్నారు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు. ఇలా టీడీపీలో ఒక్కొక్కరిది ఒక్కో బాధగా ఉంది. లోకేష్ విశాఖ రావడంతో ఆయనకు తమ బాధలు చెప్పుకోవాలని తమ్ముళ్ళు ఆరాటపడుతున్నారు. లోకేష్ వారికి ఏ విధంగా ఓదార్పు ఇస్తారు ఏ విధంగా హమీ ఇస్తారు అన్నది కూడా అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

10 Replies to “విశాఖ మీద లోకేష్ ఫోకస్”

Comments are closed.