నా ఫ్లాప్ కోసం చాలామంది ఎదురుచూశారు

హీరోయిన్ కృతి శెట్టి బాంబ్ పేల్చింది. తనకు ఫ్లాప్ వస్తే చూడాలని ఓ బ్యాచ్ చాలా గట్టిగా ఎదురు చూసిందని వెల్లడించింది. Advertisement “ఉప్పెన పెద్ద హిట్టయింది. దీంతో ఓ సెక్షన్ జనం నాకు…

హీరోయిన్ కృతి శెట్టి బాంబ్ పేల్చింది. తనకు ఫ్లాప్ వస్తే చూడాలని ఓ బ్యాచ్ చాలా గట్టిగా ఎదురు చూసిందని వెల్లడించింది.

“ఉప్పెన పెద్ద హిట్టయింది. దీంతో ఓ సెక్షన్ జనం నాకు ఫ్లాప్ వస్తుందని ఎదురుచూశారు. నాకు ఫ్లాప్ వస్తే వేలెత్తి చూపించాలనుకున్నారు. అయితే నేను హిట్-ఫ్లాప్ ఒకేలా తీసుకున్నాను. ఎందుకంటే, నా మొదటి సినిమా సక్సెస్ అయినప్పుడు నేను పూర్తి క్రెడిట్ తీసుకోలేదు. కాబట్టి ఫ్లాప్ వచ్చినప్పుడు కూడా నేను పూర్తి క్రెడిట్ తీసుకోను.”

తన ఫ్లాప్ కోసం ఎదురుచూసిన వ్యక్తులు ఎవరనే విషయాన్ని కృతి చెప్పలేదు. అదే టైమ్ లో ఫ్లాపులు వల్ల తను మరింత మెరుగుపడ్డానని తెలిపింది.

“తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకున్నాను. ఓ సక్సెస్ కంటే, ఫెయిల్యూర్ వల్లనే ఎక్కువ నేర్చుకున్నాను. ఫ్లాప్స్ వల్ల ఓ టెక్నీషియన్ గా నేను మరింత మెరుగుపడ్డాను. ఎందుకు సినిమా ఆడలేదనే విశ్లేషణ నాకు బాగా పనికొచ్చింది.”

కెరీర్ స్టార్టింగ్ లోనే ఫ్లాపులు రావడంతో ఎక్కువ నేర్చుకుందట కృతి శెట్టి. అలా మరింత స్ట్రాంగ్ గా తయారై, విమర్శలు తట్టుకోగలిగే స్థాయికి చేరుకుందంట. ఆమె బాగానే స్ట్రాంగ్ అయింది కానీ, తెలుగులో ఆమెకు ఛాన్సులే అంత స్ట్రాంగ్ గా లేవు.

6 Replies to “నా ఫ్లాప్ కోసం చాలామంది ఎదురుచూశారు”

Comments are closed.