బిగ్ బాస్ హౌస్ లో వాళ్లకి నో ఎంట్రీ?

త్వరలో బిగ్ బాస్ కొత్త సీజ‌న్ ప్రారంభం కాబోతోంది. వీళ్లు వెళ్తారు.. వాళ్లు వెళ్తారు అంటూ చాలా పేర్లు వినిపిస్తున్నాయి. చాలా మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారు.…

త్వరలో బిగ్ బాస్ కొత్త సీజ‌న్ ప్రారంభం కాబోతోంది. వీళ్లు వెళ్తారు.. వాళ్లు వెళ్తారు అంటూ చాలా పేర్లు వినిపిస్తున్నాయి. చాలా మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారు. అయితే మరీ ఎక్కువ కాంట్రావర్సీ నేపథ్యం వున్న వారికి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ లేదని తెలుస్తోంది. ఇలా ఎంట్రీ కోసం చూస్తున్నవారు, కానీ ఎంట్రీ ఇవ్వడం లేదని వినిపిస్తున్న పేర్లు రెండు వున్నాయి.

జ‌బర్దస్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ, వివాదాస్పద జ్యోతిష్కుడు వేణు స్వామి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. కానీ వీళ్లకు ఎంట్రీ ఇవ్వడం మీద బిగ్ బాస్ నిర్వాహకులు ముందు వెనుక ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

వివాదాల్లో వుండే వాళ్లను తీసుకుంటే అనవసరపు వివాదాలకు తావిచ్చినట్లు అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఈ ఇద్దరికీ ఎంట్రీ వుండదని టాక్.

కాస్త ఎక్స్ పోజింగ్, గ్లామర్ వున్న ఓ యాంకర్ పేరు వినిపిస్తోంది. కానీ ఆమెను తీసుకోవడం మీద కూడా తర్జ‌న‌భ‌ర్జ‌న‌లు జ‌రుగుతున్నాయని తెలుస్తోంది. గమ్మత్తేమిటంటే తాము తీసుకోవాలి అని బిగ్ బాస్ నిర్వాహకులు అనుకుంటున్న జాబితాకు, తాము వెళ్లాలని కోరుకుంటున్న వారి జాబితాకు పొంతన అంతగా కుదరడం లేదు. అదీ సమస్య.

5 Replies to “బిగ్ బాస్ హౌస్ లో వాళ్లకి నో ఎంట్రీ?”

  1. ప్యాలస్ పులకేశి నీ పిలవండి . తోడుగా ఉప్పల్ బాలు నీ అట్టిపెట్టoడి. అదిరిపోయిడ్డి.

    అసలే నాగార్జున అతని ముఠా లో మెంబర్ నే.

Comments are closed.