కేవలం 5 థియేటర్లు.. సరిపోదు నాని

సరిపోదా శనివారం.. నాని కెరీర్ లో ప్రాపర్ పాన్ ఇండియా మూవీ ఇది. ఈ సినిమా ప్రచారం కోసం ముంబయి, చెన్నై, బెంగళూరులో ప్రచారం చేశాడు నాని. మరీ ముఖ్యంగా ముంబయిలో చాలా కష్టపడ్డాడు.…

సరిపోదా శనివారం.. నాని కెరీర్ లో ప్రాపర్ పాన్ ఇండియా మూవీ ఇది. ఈ సినిమా ప్రచారం కోసం ముంబయి, చెన్నై, బెంగళూరులో ప్రచారం చేశాడు నాని. మరీ ముఖ్యంగా ముంబయిలో చాలా కష్టపడ్డాడు. నేషనల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లు అన్నీ కవర్ చేశాడు.

కానీ నాని కష్టానికి విడుదలకు ముందే ఫలితం దక్కలేదు. ముంబయిలో సూర్యాస్ శాటర్ డే (సరిపోదా శనివారం హిందీ వెర్షన్)కు కేవలం 5 థియేటర్లు మాత్రమే దక్కాయి. ముంబయిలో ఏదో ఒక ప్రాంతానికి సంబంధించిన మేటర్ కాదిది.

ముంబయి వెస్ట్, సౌత్, సెంట్రల్, నవీ ముంబయి, థానె, కల్యాణ్ లాంటి అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమా హిందీ వెర్షన్ కు కేవలం 5 థియేటర్లు కేటాయించారు. పైగా మార్నింగ్ షోలు లేవు.

ముంబయి రీజియన్ మొత్తం సూర్యాస్ శాటర్డే సినిమాకు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి షోలు మొదలవుతున్నాయి. ఈ 5 స్క్రీన్స్ లో ఈవినింగ్ షోలున్నాయి. అయితే బుకింగ్స్ మాత్రం జీరో.

ముంబయిలో సరిపోదా శనివారం తెలుగు వెర్షన్ కు కేవలం 9 స్క్రీన్స్ మాత్రమే కేటాయించారు. వీటిలో కూడా ఎక్కడా ఓపెనింగ్స్ లేవు. ఇక తమిళ వెర్షన్ అయితే ఎక్కడా కనిపించలేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి హిట్టయితే, ఆటోమేటిగ్గా స్క్రీన్ కౌంట్ పెరుగుతుంది. లేదంటే, ప్రచారానికి పెట్టిన ఖర్చు కూడా వెనక్కురానట్టే.

10 Replies to “కేవలం 5 థియేటర్లు.. సరిపోదు నాని”

Comments are closed.