పార్టీ మారిన వాళ్లు కాల‌గ‌ర్భంలో క‌లిశారు

వైసీపీలో పార్టీ ఫిరాయింపులు రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి. ముఖ్యంగా రాజ్మ‌స‌భ స‌భ్యులు టీడీపీ, బీజేపీలో చేరుతార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. ఈ క్ర‌మంలో ఎంపీలు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బీద మ‌స్తాన్‌రావు పార్టీ, చ‌ట్ట‌స‌భ ప‌ద‌వుల‌కు…

వైసీపీలో పార్టీ ఫిరాయింపులు రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి. ముఖ్యంగా రాజ్మ‌స‌భ స‌భ్యులు టీడీపీ, బీజేపీలో చేరుతార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. ఈ క్ర‌మంలో ఎంపీలు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బీద మ‌స్తాన్‌రావు పార్టీ, చ‌ట్ట‌స‌భ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఫిరాయింపుల‌కు ఎలా అడ్డుక‌ట్ట వేయాలో వైసీపీ నేత‌ల‌కు అంతుచిక్క‌డం లేదు.

దీంతో వైసీపీ శాప‌నార్థాల‌కు దిగింది. మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు. అదేంటంటే…

“అధికారం లేదని పార్టీ మారినోళ్ళు పరువు పోగొట్టుకున్నారు కానీ, ప్రజాదరణ పొందలేదు ఇది చారిత్రిక సత్యం !”

మ‌రో మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఫిరాయింపుల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో ఇట్లే పార్టీ మారిన నేత‌లంతా కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయార‌ని కాకాణి సంచ‌ల‌న కామెంట్ చేశారు. గ‌తంలో 23 మంది ఎమ్మెల్యేల‌ను టీడీపీలో చేర్చుకుని, చివ‌రికి అన్నే సీట్ల‌కు ప‌రిమితం అయ్యార‌ని ఆయ‌న గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ నాయ‌క‌త్వాన్ని దెబ్బ‌తీసేందుకు చంద్ర‌బాబు చేసే ఇలాంటి కుట్ర‌లు ఏమీ చేయ‌లేవ‌ని కాకాణి అన్నారు.

బాబు త‌మ పార్టీ స‌భ్యుల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేసి పార్టీలో చేర్చుకోవాల‌ని అనుకుంటున్న‌ట్టు కాకాణి తెలిపారు. ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించేందుకే త‌మ రాజ్య‌స‌భ స‌భ్యుల్ని టీడీపీలో చేర్చుకుంటున్న‌ట్టు ఆయ‌న ఆరోపించారు.

వైసీపీ ఎదురుదాడి ఈ ర‌కంగా సాగుతోంది. అయితే ఇవేవీ ఫిరాయింపుల‌ను అడ్డుకోలేవ‌ని వైసీపీ నేత‌ల‌కు కూడా తెలుసు. బ‌హుశా ఇంత‌కంటే మ‌రో మార్గం కూడా వైసీపీ నేత‌ల‌కు క‌నిపిస్తున్న‌ట్టుగా లేదు.

13 Replies to “పార్టీ మారిన వాళ్లు కాల‌గ‌ర్భంలో క‌లిశారు”

  1. కాల గర్బంలో అందరు కలిసిపోయే వారే, దానికే ఆశ్చర్యపోయి జ్ఞాన భోధ చెయ్యాల్సిన అవసరేముంది శ్యాంబాబు గారు.
  2. ఒకడేమో సంజన, సృజన అంటాడు, ఒకడేమో గంట, రెండు గంటలు అంటాడు, ఒకడేమో ఆఫీసర్ తో కొడుకును కంటాడు, ఒకడేమో బట్టలు ఊడ దీసుకొని ఆడవాళ్లకు వీడియో కాల్ చేస్తాడు, ఒకడేమో పెళ్ళిడుకు వచ్చిన కూతుర్లను పెట్టుకొని ఇంకొక పెళ్ళైన స్త్రీ తో affair పెట్టుకుంటాడు, ఇక సలహాదారేమో ఆడవారిని గెస్ట్ హౌస్ లో పెట్టి టార్చర్ చేయిస్తాడు పార్టీ వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నా చర్యలు తీసుకోని నాయకుడు. ఇలాంటి పార్టీలో కొనసాగితే ఖచ్చితంగా కనుమరుగు అయిపోతారు

  3. మా తెలుగు మీడియా మమ్మలను ఎలా ట్యూన్ చేసుకుంటుంది అంటే, బాబు గారు ఏది చేసిన లోక కళ్యాణం కోసం చేసినట్లే అన్న విధంగా. మా రాష్ట్రము లో ఉన్న 11 మంది రాజ్యసభ ఎంపీ + 4 MP ల కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ ఐనది.

    BJP తొందరగా మేలుకొని మిగిలిన వారిని విలీనం చేసుకోకపోతే BJP కి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బాబు గారి మీడియా స్లీపర్ సెల్స్ తమ ప్రత్యర్థుల మీద సైకలాజికల్ వార్ చేస్తూ ఒక్కొక పార్టీ ని/వ్యక్తిని నిర్వీయం చేస్తూ ముందుకు వెళ్తుంది ,

    ఆంధ్ర లో ఉన్న వాళ్ళను టీడీపీ లోకి , తెలంగాణా లో ఉన్న వాళ్ళను కాంగ్రెస్ లోకి వెళ్లిపోయేటట్లు చేస్తూ , ప్రజల నుంచి కూడా దీనికి acceptance ఉన్నట్లు సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు,

    ఫైనల్ టార్గెట్ దేశంలో ఎక్కువ ఎంపీ లు ఉన్న ప్రాంతీయ పార్టీ గా ఎదగడం అప్పుడు తన చక్రాన్ని బయటకు తీసి Vajpayee ని బెదిరించి నట్లు బెదిరించే విధం గా సెట్ చేసుకోవడం. BJP తొందరగా వాళ్ళకు అనుకూలం గా మార్చుకోకపోతే Vajpayee గారి ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుంది మళ్ళి.

Comments are closed.