చిత్రం: సరిపోదా శనివారం
రేటింగ్: 2.75/5
తారాగణం: నాని, ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్. జె. సూర్య, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, మురళిశర్మ, అభిరామి, అదితి బాలన్, అజయ్ తదితరులు
సంగీతం: జేక్స్ బిజోయ్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
నిర్మాత: డి వి వి దానయ్య
దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
విడుదల తేదీ: 29 ఆగస్టు 2024
వివేక్ ఆత్రేయ, నాని కాంబినేషన్ అనగానే “అంటే సుందరానికి” గుర్తొస్తుంది. ఇది కూడా అలాంటి జానరేనేమో అనుకుంటే ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చేసాడు- ఇది ఫక్తు హీరో సెంట్రిక్ యాక్షన్ డ్రామా అని. జానర్ ఏదైనా జనం మెచ్చేలా ఉంటే చాలు. అలా ఉందా లేదా చూద్దాం.
కథలోకి వెళితే, సూర్య(నాని) చిన్నప్పటి నుంచి కోపిష్టి. ఎప్పుడూ ఎవర్నో ఒకళ్లని కోపంతో కొడుతుంటాడు. అతని తల్లి(అభిరామి) తన కోపానికి అర్ధముండాలంటుంది. అతని కోపం నలుగుర్ని భయపెట్టేదిగా కాకుండా పది మందికి ధైర్యమిచ్చేలా ఉండాలని చెబుతుంది. వారంలో ప్రతి రోజూ తన కోపాన్ని ఆపిన తల్లి, ఒక రోజు మాత్రం ఆపలేకపోతుంది. అది శనివారం. అప్పటి నుంచీ తన కోపాన్ని వారమంతా కంట్రోల్ చేసుకుని శనివారం మాత్రం బయట పెడుతుంటాడు. చారులత (ప్రియాంక) అనే కానిస్టేబుల్ ప్రేమలో పడతాడు సూర్య. ఇదిలా ఉండగా దయానంద్ (ఎస్ జె సూర్య) అనే సీ.ఐ అత్యంత క్రూరుడు, మహా కోపిష్టి. అతని అన్న కూర్మానంద్ (మురళిశర్మ). ఆ ఇద్దరికీ పడదు.
ఈ దయానంద్ తన కోపంతో ఒకానొక కారణం వల్ల కొందరు జనాన్ని హింసిస్తూ ఉంటాడు. ఆ జనం వెనుక సూర్య నిలబడి స్ట్రీం లైన్ అయిన తన కోపంతో అడ్డు అదుపు లేని దయానంద్ కోపాన్ని ఎలా ఎదుర్కుంటాడు అనేది తక్కిన కథ.
ఈ కథలో పాయింటేంటంటే హీరో, విలన్ ఇద్దరూ పరమకోపిష్టులే. ఒకడు శనివారం మాత్రమే కొడతాడు. ఇంకొకడు రోజూ కొడతాడు.
కథ చాలా బాగుండి ట్రీట్మెంట్ దగ్గర తేడా గొట్టే సినిమాలు ఉంటాయి. కానీ ఇది ట్రీట్మెంట్ బాగుండి కథలో డెప్త్ లేని సినిమా. ఎందుకంటే ఫలానా కారణం వల్ల కోపం హీరోకి కోపం వచ్చిందనుకున్నప్పుడు ఆ కారణం చాలా బలంగా, ఎమోషనల్ గా ఉండాలి. హీరో కోపాన్ని పరిచయం చేయడానికి ఎంచుకున్న కొన్ని ట్రాకులు గుండెని హత్తుకోవు. దానివల్ల ప్రేక్షకులు పూర్తిగా ఇమ్మెర్స్ కాలేరు.
ఈ సమస్యకి తోడు సంభాషణలు, సీన్లు చాలా లెంగ్దీగా అనిపిస్తాయి. హ్యూమర్ అనుకుని రాసుకున్న కొన్ని సంభాషణలు పేలలేదు. దర్శకుడు ఎమోషనల్ యాక్షన్ జానర్ ని ప్రయత్నించాడు కానీ వండిన ఈ వంటకం పూర్తిగా పాకన పడలేదు.
టెక్నికల్ గా చూస్తే నేపథ్య సంగీతం సగటు యాక్షన్ సినిమాలో వినపడే లౌడ్నెస్ ఉంది తప్ప ప్రత్యేకత లేదు. హీరో, విలన్ కోపాలు కథలో ప్రధాన వస్తువు అనుకున్నప్పుడు వారిద్దరి కోపానికి సెపెరేట్ గా సిగ్నేచర్ ట్రాక్స్ చేసుంటే ఎమోషన్ గ్రాఫ్ పైకి లేచుండేది. పాటలు బ్యాక్ గ్రౌండ్ కే పరిమితమయ్యాయి. అవికూడా చెప్పుకునేంతగా మనసుని తాకలేదు.
“నువ్వు చాలా పెద్ద ఆట ఆడాలిరా” అనే డైలాగ్ ఒకటుంది ఇందులో. బహుశా ఈ లైన్ దర్శకుడు ఎడిటర్ తో చెప్పాడేమో. ఎక్కడా కటింగ్ కి చాన్స్ ఇవ్వకుండా, మూడు గంటల సుదీర్ఘమైన ఆటని మన ముందుంచాడు.
కెమెరా, యాక్షన్ కోరియోగ్రఫీ బాగున్నాయి. ఓవరాల్ గా నిర్మాణ విలువలుగా చెప్పుకునే తెరమీద రిచ్నెస్ వర్కౌట్ అయ్యింది.
నేచరల్ స్టార్ నాని మాత్రం తేలిపోయాడు. అండర్ ప్లే మోడ్ లో ఇతని పాత్రచిత్రణ ఉండడంతో ఇంపాక్ట్ లేకుండా పోయింది.
దానికి తోడు ఎస్.జె సూర్య అద్భుతమైన హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పూర్తిగా డామినేట్ చేసేసాడు. సినిమా హాల్ వదిలాక నాని గుర్తురాడు.. ఎస్ జె సూర్యనే గుర్తుంటాడు.
ఆ తర్వాత మెప్పించిన నటుడు మురళిశర్మ. మెథడ్ యాక్టింగ్ తో, కొత్త మేనరిజమ్స్ చూపించి ఆకట్టుకున్నాడు. సాయికుమార్ ది రొటీన్ ఫాదర్ రోల్.
ప్రియాంక చూడడానికి బాగుంది. హీరో, విలన్ కోపాన్ని ప్రదర్శించి ఎవరినైనా చితక్కొడుతుంటే భయంతో బిగుసుకుపోయి కళ్లు మూసుకుని నిలబడడం తప్ప ఈమె పాత్రకి పెద్ద ప్రాధాన్యత కనపడలేదు.
హీరో తల్లిగా అభిరామి ఓకే. ఆమెది చిన్న నిడివి గల పాత్ర మాత్రమే.
శుభలేఖ సుధాకర్, శివాజిరాజా ప్యాడింగ్ కి పనికొచ్చారు. అజయ్ ఘోష్ ప్రారంభంలో కాసేపు కనిపిస్తాడు.
‘దసరా’ తర్వాత నాని తనలోని యాక్షన్ హీరోని మరొక యాంగిల్లో చూపించాలనే ఉత్సాహాన్ని కనబరచాడు. వివేక్ ఆత్రేయ కూడా తన మీదున్న కామెడీ డైరక్టర్ ముద్ర పోగొట్టుకుని మాస్ యాక్షన్ డైరక్టర్ అనిపించుకోవాలనే కుతూహలాన్ని తీర్చుకున్నాడు. అయితే కథలో డెప్త్ మీద ఫోకస్ పెట్టుండాల్సింది.
ప్రధామార్ధంలో కథనం అటు ఇటుగా ఉండి ప్రేక్షకుల అటెన్షన్ ని తనవైపుకి తిప్పుకోని విధంగా సాగింది. తెర మీద పాత్రల పరిచయాలు అయ్యాక ఎవరు ఎలా లింక్ చేయబడతారో ఒక అంచనా ఏర్పడుతుంది సగటు ప్రేక్షకుడికి. ఆ అంచనాని మించి ఊహించని ట్విస్ట్ కనిపించినప్పుడే ప్రేక్షకుడు వశమవుతాడు. ఆలాంటివేవీ లేకుండా ఇంటర్వల్ బ్యాంగ్ కూడా పెద్ద ట్విస్ట్ ఏమీ లేకుండా ఉంది.
ద్వితీయార్ధంలో కథనం ఊహించినట్టే నడిచినా పెద్దగా బోర్ కొట్టదు. ఎస్ జె సూర్య నటన వల్ల, హీరో పాత్ర ఆదే డబుల్ గేం వల్ల కాస్త ఆసక్తిగా మారుతుంది. అక్కడి నుంచి చివరి వరకు ఫక్తు యాక్షన్ చిత్రంగా సాగుతుంది.
పైన చెప్పుకున్నట్టు ఎడిటర్ తన కత్తెరకి ఎంత పదును పెట్టినా దర్శకుడు చెప్పిన కథని ఇంతకంటే కుదించలేకపోయాడు. రెండు గంటల యాభైమూడు నిమిషాల కథనాన్ని భరించే ఓపిక ఉండాలి.
సినిమా పూర్తవకుండానే క్లైమాక్స్ ఫైట్ మధ్యలో కొందరు ఆడియన్స్ బయటికి నడవడం చూస్తుంటే, “పోతారు అందరూ పోతారు” అని నాని చెప్పే డైలాగ్ గుర్తొచ్చింది.
గురువారం విడుదలైన ఈ “సరిపోదా శనివారం” ప్రేక్షకులని రంజింపజేసే విషయంలో సరిపోయీ సరిపోనట్టుగా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే సరిపోలేదు.
బాటం లైన్: సరిపోలేదు
ఐతే ఓటిటిలో చుస్తాంలే
Yevadu bro nuvvu prathi movie ki comment chustunna OTT lo chustam le Ani pedathavu.yevaro okaru complete eche varaku aapela levu.chusu ko careful ga undu . social media meeda kuda police lu invalment lo unnaru.yevadaina complete Este doola thiripoddi nee manchi ke chebutunna.
PAYTM SARIPOLEDU GA KI
Super 3.5/5
GA 2.75 ANTE SUPER HIT annamaata
Hello GA nuvvu rasina review ki rating 2 saripothundi , but nuvvu 2.75 echhav a base medha echhavo cheppagalava, nuvvu nee lovda rating
“ ఒకడు శనివారం మాత్రమే కొడతాడు. ఇంకొకడు రోజూ కొడతాడు.”
అలా ఎందుకు అనుకోవాలి? ఒకడు శనివారం మాత్రమే తన్నులు తింటాడు, మరొకడు వారంలో అన్ని రోజులు తన్నులు తింటాడు.
ఇద్దరు కలిసి థియేటర్ కొచ్చిన జనాలని ముద్దు గంటలు కొట్టారు అన్నమాట ..
సినిమా బావుంది కానీ లెంగ్త్ చాలా ఎక్కువ అయ్యింది ఈజీ గా ఒక 20 -25 min ట్రిమ్ చేయొచ్చు
మన వాటికన్ బిడ్డడి సినిమాకు రేటింగ్ 2.75 నేనా GA ?
As usual, aa rating ki review ki sambandhame ledhu.
Saripodaa ott
దూల తీరిందా, నీకో నమస్కారం… అని తీర్పునిచ్చారు కాబోలు
saripoda 1.75?
సరిపోదా ott
Dirty brain less fellow then why given 2.75?
నటన అమ్ముకుని బతుకు తున్నోళ్ళకి బిరుడులేమిటి..జస్ట్ అమ్ముడు పోయే జీవాలు..ఏ మీడియా అయిన ఈ తోకాలంతాగికించడాం మానేస్తేనే ఈ జీవాలకి బతుకు విలువలు తెలిసేది..
రాజకీయాల్లో ఉండి అవినీతి సంపాదన చేసే వాళ్ళు దేవుళ్ళు ఏమిటి .. సింగల్ సింహాలు .. అన్న..బిడ్డ అని పిలిపించుకోవడం ఏమిటి ..
annagaru .. gurthocharu…..evaru minahaimpu kadu…cenima…rajakeyam….
ఉద్యోగాలు చేసుకుని బ్రతికే జనాలు కూడా తమ జ్ఞానాన్ని శ్రమని అమ్ముకుని బ్రతుకుతున్నట్టే సర్. మనుషులంతా ఎవడికి వచ్ఛిన దాన్ని వాడు అమ్ముకునే బ్రతకాలి.
1.5 is best rating
Call boy jobs available 8341510897
vc estanu 9380537747
vc available 9380537747
ఐతే ఓటిటిలో చుస్తాంలే
orey review bad ga ichi rating enduku 2.75?
orey review bad ga ichav malli rating 2.75 enduku ichav.
Flop cinema ki Bagane echharu ga rating 2.75 , minimum 20laks anukuntaa rating prize..
Nuv tiy ra babu ani cheppaga oka movie
ప్రొడ్యూసర్ గా డబ్బులు పెడతావా 🤷♂️🤷♂️ ఆ దమ్ము ధైర్యం డబ్బు నీ దగ్గర ఉందా🤷♂️😂 సినిమా తీయడానికి రెడీగా ఉంటారు 🤷♂️🙋♂️👍😍🕺🤣🙆♂️ అతని అభిప్రాయం అతను చెప్పాడు.. హ దానికి. నువ్వు సినిమా తీసి చెప్పు అంటే… నీకు ఇలాంటి సమాధానాలు వస్తాయి 👊 నువ్వు ప్రతిరోజు ఎక్కడైనా హోటల్ లో గానీ రెస్టారెంట్లో గాని నువ్వు బిర్యాని తింటావు కదా ఒక చోట బానే ఉంటుంది ఒకచోట యావరేజ్ గా ఉంటది ఒక చోట చండాలంగా ఉంటుంది… ఆ మాట బిర్యాని బాగా లేదని చెప్తే వాళ్ళ హోటల్ వాడు నిన్ను నీకు బిర్యాని చేసి చూపించి చూద్దాం అంటే
lag ra babu 1990 story la undi bore kotindi chala chotla idi hit ani ela anyunaro🤔