మొదటి రోజు సరిపోలేదు నాని

గట్టిగా ప్రచారం చేశాడు నాని. ఆఖరి నిమిషం వరకు అదే పనిలో ఉన్నాడు. అన్నీ తానై చూసుకున్నాడు. కానీ తెలుగు రాష్ట్రాల్లో సరిపోదా శనివారం సినిమాకు ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. ఆ…

గట్టిగా ప్రచారం చేశాడు నాని. ఆఖరి నిమిషం వరకు అదే పనిలో ఉన్నాడు. అన్నీ తానై చూసుకున్నాడు. కానీ తెలుగు రాష్ట్రాల్లో సరిపోదా శనివారం సినిమాకు ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. ఆ ప్రభావం మొదటి రోజు వసూళ్లలో స్పష్టంగా కనిపించింది.

సరిపోదా శనివారం సినిమాకు ఏపీ, నైజాంలో మొదటి రోజు అటుఇటుగా 10 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వచ్చింది. నైజాంలో మినహా ఎక్కడా ఈ సినిమా కోటి రూపాయల షేర్ అందుకోలేకపోయింది.

ఇక ఇండియా వైడ్ చూసుకుంటే, ఈ సినిమా వసూళ్లలో పెద్దగా పెరుగుదల కనిపించలేదు. తెలుగు మినహా అన్ని భాషల్లో చాలా తక్కువగా వసూళ్లు వచ్చాయి. ఇండియా గ్రాస్ లో 90శాతం తెలుగు నుంచి వచ్చిందే.

అటు ఓవర్సీస్ లో మాత్రం సరిపోదా శనివారం సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. అన్నీ మరికొద్దిసేపట్లో ఈ సినిమా అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

చాలా సెంటర్లలో సినిమాకు మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా నిడివి విషయంలో కంప్లయింట్స్ ఎక్కువగా ఉన్నాయి.

9 Replies to “మొదటి రోజు సరిపోలేదు నాని”

    1. వాడి మొహానికి యాక్టింగే రాదు…… డబ్బులిచ్చి ఎలేవేషన్స్ చేయించుకుంటాడు….. Ga గాడు వీడికిచ్చే ఎలేవేషన్స్ మాములుగా ఉండవు

  1. నువ్వు తప్ప మిగతా వారు అందరు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయని రాశారు

  2. hero characterization ki 30 min,villan kosam 30 min, valla clash ki 30min.first half..

    second half clash ayaka em cheyali ani 30 min,andaru heros avali ani 30 min..

Comments are closed.