‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ బాగుందిగా!

సంక్రాంతికి వస్తున్నాం అనేది పెద్ద పండగకు వచ్చే సినిమాల మేకర్లు పదే పదే చెప్పే మాట. మరి దాన్నే టైటిల్ చేస్తే పోలా… అదిరిపోలా.. అనుకుంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.. నిర్మాత దిల్ రాజు.…

సంక్రాంతికి వస్తున్నాం అనేది పెద్ద పండగకు వచ్చే సినిమాల మేకర్లు పదే పదే చెప్పే మాట. మరి దాన్నే టైటిల్ చేస్తే పోలా… అదిరిపోలా.. అనుకుంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.. నిర్మాత దిల్ రాజు. ఈ మేరకు ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించారు.

అనిల్ రావిపూడి- సీనియర్ హీరో వెంకటేష్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ఒకటి వుంది. ఇద్దరు హీరోయిన్లు, ఓ హీరో నడుమ జ‌రిగే మాజీ పోలీస్ అధికారి కథ. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్.

ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. స్టార్ట్ చేయడమే అదే లక్ష్యంతో స్టార్ట్ చేసారు. మంచి స్పీడ్ గా సినిమా తీయడంలో అనిల్ రావిపూడికి పేరుతుంది. మహేష్ లాంటి సూపర్ స్టార్ తోనే సిక్స్ మంత్స్ లో సినిమా తీసేసారు. అందువల్ల సంక్రాంతికి రెడీ అవుతుందా అనే అనుమానం అక్కరలేదు. ఇటీవలే కేరళలో ఓ లెంగ్తీ షెడ్యూలు పూర్తి చేసుకున్నారు. మరో షెడ్యూలుకు రెడీ అవుతున్నారు.

ఈ సినిమాకు రకరకాల టైటిళ్లు అనుకున్నారు. కానీ సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ కథలో పాయింట్ ప్రకారం కూడా ఈ టైటిల్ సూటవుతుందని అనుకుంటున్నారు. అందువల్ల రిజిస్టర్ చేసి వుంచారు. ఒకవేళ ఇంతకన్నా అద్భుతమైన, మంచి టైటిల్ దొరికితే తప్పితే, సంక్రాంతికి వస్తున్నాం అనేదే టైటిల్ అవుతుంది.

6 Replies to “‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ బాగుందిగా!”

  1. అసలు పండగలకి ఈ పెంట సినిమాలకి సంబంధం ఏంటి.. పండగలంటే ఒక పవిత్ర భావం చచ్చి ఈ పచ్ఛి రొచ్చు చచ్చు పిచ్చి లాగా తయారైంది…

Comments are closed.