మత్తు వదలరా.. మరోసారి

హిట్ అయిన సినిమాకు సీక్వెల్ తీయాలంటే బోలెడు మార్గాలు. పాయింట్ ను కొనసాగించడం లేదా, అందులోని పాత్రలను తీసుకుని కొత్త కథ అల్లుకోవడం, ఇలా రకరకాలుగా వుంటుంది వ్యవహారం. Advertisement గతంలో మంచి హిట్…

హిట్ అయిన సినిమాకు సీక్వెల్ తీయాలంటే బోలెడు మార్గాలు. పాయింట్ ను కొనసాగించడం లేదా, అందులోని పాత్రలను తీసుకుని కొత్త కథ అల్లుకోవడం, ఇలా రకరకాలుగా వుంటుంది వ్యవహారం.

గతంలో మంచి హిట్ అనిపించుకున్న మత్తువదలరా సినిమాలోని పాత్రలు తీసుకుని, అందులోని కోర్ పాయింట్ కూడా తీసుకుని, తయారు చేస్తున్న సీక్వెల్ మత్తువదలరా 2. ఫరియా కధానాయిక. సింహా, సత్య కీలకపాత్రలు.

దొంగ కాస్తా పోలీస్ అయితే అనో, లేదా అలాంటిదో థీమ్ తో సీక్సెల్ లైన్ అల్లుకున్నట్లు కనిపిస్తోంది. షి టీమ్ కు ఇమిటేషన్ అన్నట్లుగా హి (హై ఎమర్ఙన్సీ) టీమ్ అనేది క్రియేట్ చేసారు. ఇందులో పనిచేసే హీరో అండ్ కమెడియన్. రకరకాల ఫన్ సీన్లు కలిపి టీజ‌ర్ ను బాగానే కట్ చేసారు. ఓ మంచి ఎంటర్ టైనర్ గా వుండే అవకాశం వుందని అనిపిస్తోంది.

కాలభైరవ నేపథ్య సంగీతం బాగుంది. కాస్త వైవిధ్యంగా ఉండే కామెడీ పండించడంలో దర్శకుడు రితేష్ రానా కు ఓ స్టయిల్ వుంది. అది టీజ‌ర్ లో కనిపిస్తోంది. అదే విధంగా అతగాడి స్క్రీన్ ప్లే కూడా డిఫరెంట్ గా వుంటుంది. అది చూడాలంటే టీజ‌ర్ సరిపోదు. సినిమా రావాలి. ఈ సినిమాకు నిర్మాత చెర్రీ. మైత్రీ మూవీస్ సమర్పణ.

5 Replies to “మత్తు వదలరా.. మరోసారి”

Comments are closed.