వర్జీనియా, అమెరికా: ఈ నెల 8న దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర రెడ్డి 74వ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైయస్ఆర్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున జయంతి వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ సారి వైయస్ఆర్ జయంతి వేడుకలు మరింత ఘనంగా నిర్వహించేలా ఆ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహానేత మధుర జ్ఞాపకాలను, నాటి సువర్ణ యుగాన్ని గుర్తుచేసుకుంటూ దివంగత డా.వైయస్ఆర్ కు నివాళులర్పించేందుకు ఊరు-వాడ సిద్ధమవుతోంది.
వాషింగ్టన్ డీసీలో వైయస్ఆర్ జయంతి వేడుకలు:
వైయస్ఆర్ సీపీ అమెరికా విభాగం ఆధ్వర్యంలో జరగనున్న వైయస్ఆర్ జయంతి వేడుకలకు వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా సారధి సజ్జల భార్గవ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. జులై 8, శనివారం మధ్యాహ్నం 1గంటల నుండి 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. హిల్టన్ వాషింగ్టన్ డుల్స్ హోటల్ ఈ కార్యక్రమానికి వేదిక కానుంది.
మీట్ అండ్ గ్రీట్ వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా పేరుతో జరిగే కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లతో సజ్జల భార్గవ్ నేరుగా మాట్లాడనున్నారు. వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా బలోపేతం చేయడం, మరింత పటిష్టంగా వైయస్ఆర్ సీపీ వాణిని సోషల్ మీడియాలో వినిపించడం తదితర అంశాలపై సజ్జల భార్గవ్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున హాజరయ్యేందుకు అమెరికా వ్యాప్తంగా ఉన్న వైయస్ఆర్ సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు నిర్దేశించిన ఫామ్స్ లో తమ పేరును నమోదు చేసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో వైయస్ఆర్ సీపీ హవా:
రాష్ట్రంలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను, గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. ప్రతిపక్ష పార్టీలు చేసే దుష్ప్రచారాలను, ఎల్లో మీడియా అవాస్తవ కథనాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. మీమ్స్, కార్టూన్లు తదితర వినూత్న కంటెంట్ తో సోషల్ మీడియాలో సత్తా చాటుతోంది.
గతంలో డిఫెన్సివ్ స్ట్రాటజీతో ముందుకెళ్లిన వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా.. ప్రతిపక్ష పార్టీల మూకుమ్మడి దాడి నేపథ్యంలో స్ట్రాటజీని మార్చుకుని అగ్రెస్సివ్ గా ముందుకెళుతోంది. సామాజిక మాధ్యమాలన్నింటిలో వైయస్ఆర్ సీపీ హవా ఉండేలా ప్రత్యేక ప్రణాలికలను అమలు చేస్తోంది.
వైయస్ఆర్ సీపీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం వివరాలు:
July 8th, Saturday, 1pm to 4pm.
Location: Hilton Washington Dulles Airport, 13869 Park Center Rd, Herndon, VA 20171.
నమోదు చేసుకునేందుకు క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
https://docs.google.com/forms/d/15yYpTtNM-nv6B7UyopvwmrulxUAI3PC8Jpe1Z1zhNUQ/edit