నన్ను ఇలా ఉండనివ్వండి చాలు

నాని, విజయ్ దేవరకొండ, రామ్.. వీళ్లలో ఏ ఒక్కరి సినిమా రిలీజైనా, మిగతా ఇద్దరు హీరోల సినిమాలతో పోలిక పెట్టడం సోషల్ మీడియాలో కామన్ అయిపోయింది. టయర్-2 హీరోల్లో టాప్ ఎవరంటూ ఈ హీరోల…

నాని, విజయ్ దేవరకొండ, రామ్.. వీళ్లలో ఏ ఒక్కరి సినిమా రిలీజైనా, మిగతా ఇద్దరు హీరోల సినిమాలతో పోలిక పెట్టడం సోషల్ మీడియాలో కామన్ అయిపోయింది. టయర్-2 హీరోల్లో టాప్ ఎవరంటూ ఈ హీరోల ఫ్యాన్స్ మినిమం గ్యాప్స్ లో కొట్టుకుంటూనే ఉంటారు. ఒక దశలో ఈ ఫ్యాన్స్ చర్చ జుగుప్సాకరమైన మలుపు తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి.

ఫ్యాన్స్ చర్చించుకుంటున్న ఈ పోటీపై నాని స్పందించాడు. తనకు ఏ కేటగిరీ వద్దంటున్నాడు. ఇప్పుడున్న పొజిషన్ లో తనను ఇలా ఉండనిస్తే చాలంటున్నాడు. అసలు తనను ఏ గ్రూప్ లో కలపొద్దని, ఎవ్వరితో కంపేర్ చేయొద్దని కోరుతున్నాడు.

“టయర్-1, టయర్-2 అంటూ పోలుస్తున్నారు. నాకు అలాంటివేం వద్దు. నన్ను ఇలా ఉండనివ్వండి. నా మనసుకు నచ్చిన టీమ్స్ తో పనిచేస్తున్నాను. మనసుకు నచ్చిన కథలు, దానికి తగ్గ బడ్జెట్స్ దొరుకుతున్నాయి. నా సినిమాలు చూసే ప్రేక్షకులున్నారు. నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించని బెస్ట్ ప్లేస్ లో ప్రస్తుతం ఉన్నాను. నేను ఇక్కడే ఇలానే ఉంటే చాలు. ఇంకో స్థానం నాకు అక్కర్లేదు.”

సరిపోదా శనివారం సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నట్టు రిలీజ్ కు ముందు ప్రకటించిన నాని, ప్రమోషన్ కోసం ముంబయి కూడా వెళ్లాడు. అయితే అది పాన్ ఇండియా రిలీజ్ కిందకు రాదని.. సినిమా చూడాలనే ప్రేక్షకులకు అందుబాటులో ఉండడం కోసమే రిలీజ్ చేశామని చెబుతున్నాడు.

“హిందీ, మలయాళంపై మాకు పెద్దగా ఫోకస్ లేదు. చాలా తక్కువ రిలీజ్ చేశాం. మొదటి రోజు సినిమా రిలీజ్ అయినట్టు కూడా లేదు. రెండో రోజు నుంచి అక్కడక్కడ సింగిల్ స్క్రీన్స్ లో పడ్డాయి. చాలా చిన్న రిలీజ్. ఆ ప్రాంతాల్లో చూడాలనుకున్నవాళ్లకు, మంచి క్వాలిటీతో సినిమా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అలా రిలీజ్ చేశాం. అవి అలా నడుస్తుంటాయి. మా టార్గెట్ మాత్రం తెలుగు-తమిళ్.”

సినిమా లెంగ్త్ ఎక్కువైందనే అంశంపై మరోసారి తననుతాను సమర్థించుకున్నాడు నాని. ఈ కథకు అది అవసరమన్నాడు.

4 Replies to “నన్ను ఇలా ఉండనివ్వండి చాలు”

Comments are closed.