బెస్ట్ డేట్.. ఓజీ కోసం

ఓజీ.. పవన్- సుజిత్ కాంబినేషన్ లో ప్రారంభమైన సినిమా. జ‌స్ట్ గ్లింప్స్ తోనే విపరీతమైన క్రేజ్ రేకెత్తించింది. పవన్ డిప్యూటీ సిఎమ్ అయిపోవడంతో ప్రాజెక్ట్ కు పాజ్ బటన్ పడిపోయింది. ఈ నెల లేదా…

ఓజీ.. పవన్- సుజిత్ కాంబినేషన్ లో ప్రారంభమైన సినిమా. జ‌స్ట్ గ్లింప్స్ తోనే విపరీతమైన క్రేజ్ రేకెత్తించింది. పవన్ డిప్యూటీ సిఎమ్ అయిపోవడంతో ప్రాజెక్ట్ కు పాజ్ బటన్ పడిపోయింది. ఈ నెల లేదా వచ్చే నెలలో బ్యాలన్స్ షూట్ వుంటుందని వార్తలు వినవస్తున్నాయి.

హీరో పవన్ కళ్యాణ్ కేవలం ఒక్క ఇరవై రోజులు పని చేస్తే చాలు ఓజీ సినిమా పూర్తయిపోతుంది. పవన్ కళ్యాణ్ డేట్ అలాట్ చేస్తే విజ‌యవాడలోనే షూట్ చేయడానికి నిర్మాత దానయ్య సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఈ సన్నాహాలు ఇలా వుండగానే మార్చి 27 ను విడుదల డేట్ గా లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. విడుదల డేట్ ను బయటకు ఇంకా ప్రకటించలేదు కానీ యూనిట్ మాత్రం అదే అలోచనతో వున్నట్లు తెలుస్తోంది. మార్చి 27 అంటే ఉగాది వారం. వరుస సెలవులు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ డేట్ కు విజ‌య్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సినిమా ఒక్కటి మాత్రమే షెడ్యూలు అయి వుంది. వరుస సెలవులు వున్నందున రెండు పెద్ద సినిమాలు వున్నా ఇబ్బంది ఏమీ లేదు.

అయినా పవన్ సినిమా వస్తుందంటే, తన బ్యానర్ భాగస్వామ్యంలో వుండే విజ‌య్ దేవరకొండ సినిమాను అవసరం అయితే వాయిదా వేస్తారేమో త్రివిక్రమ్. అది ఇప్పటి సంగతి కాదు. తరువాత తెలుస్తుంది. తరువాత అంటే అధికారికంగా ఓజీ డేట్ ప్రకటించిన తరువాత. మార్చిలో ఓజీ అంటే హరి హర వీరమల్లు సినిమా కన్నా ముందుగా ఓజీ నే వస్తుందనుకోవాలి.

4 Replies to “బెస్ట్ డేట్.. ఓజీ కోసం”

  1. భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ వార్త కూడా పట్టించుకోండి.

Comments are closed.