చాలా రోజుల కిందటి సంగతి. ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి ముందు, తన వాహనం వారాహికి పూజ చేశారు పవన్ కల్యాణ్. ఆ కార్యక్రమానికి పవన్ తో సినిమాలు తీస్తున్న నిర్మాతలంతా హాజరయ్యారు. పవన్ కు అనుకూలంగా ఉండేందుకు విజయవాడ-మంగళగిరి మధ్యలో షూటింగ్స్ చేస్తామని ప్రకటించారు.
నిర్మాతలైతే షూటింగ్ కు సిద్ధమయ్యారు కానీ, పవన్ మాత్రం అప్పట్నుంచి ఈ క్షణం వరకు సినిమాల్ని పక్కనపెట్టారు. ఎట్టకేలకు తన నిర్మాతలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బెజవాడ చుట్టుపక్కల షూటింగ్ పెట్టుకుంటే తనకు ఓకే అని చెప్పారు.
దీంతో నిర్మాతలంతా పవన్ తో సినిమాలు పూర్తిచేసేందుకు తమ యూనిట్స్ ను బెజవాడకు తరలించేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయంలో హరిహర వీరమల్లు యూనిట్ అందరికంటే ముందుంది..
ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివార్లలో వేసిన భారీ సెట్ లో పవన్ తో సంబంధం లేని సన్నివేశాల్ని దర్శకుడు జ్యోతికృష్ణ చిత్రీకరించాడు. ఇప్పుడు పవన్ తో చేయాల్సిన షూటింగ్ కోసం మంగళగిరిలో ఓ పెద్ద భవంతిలో ఫ్లోర్ ను అద్దెకు తీసుకున్నారు.
ఇక ఓజీ కూడా లైన్లో ఉంది. పవన్ తో కొత్త షెడ్యూల్ విజయవాడలోనే ప్రారంభమౌతుందని నిర్మాత డీవీవీ దానయ్య ఇప్పటికే ప్రకటించారు. ఓల్డ్ ముంబయిని పోలిన సెట్ ను బెజవాడ పరిసర ప్రాంతాల్లో వేయబోతున్నారు. త్వరలోనే పవన్ తమ సినిమా సెట్స్ లో జాయిన్ అవుతాడని వీళ్లు చెబుతున్నారు.
ఇక మిగిలింది ఉస్తాద్ భగత్ సింగ్ యూనిట్. వీళ్లు కూడా పవన్ కోసం సర్వసిద్ధంగా ఉన్నారు. పవన్ తో బెజవాడ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇలా పవన్ నటిస్తున్న 3 సినిమాల షూటింగ్స్, విజయవాడ చుట్టుపక్కల జరగబోతున్నాయి. వీటిలో ఏ సినిమా సెట్స్ పైకి పవన్ ముందుగా వస్తారనేది ఈ నెల్లోనే తేలిపోతుంది.
Call boy jobs available 8341510897
vc estanu 9380537747
జనాలకి సినిమాలు కేరాఫ్ ఓటిటి