మీడియా సెన్సేష‌న్ చేయొద్దు!

కృష్ణా జిల్లా గుడ్ల‌వ‌ల్లేరు ఇంజనీరింగ్ క‌ళాశాల‌లో త‌మ వాష్‌రూమ్‌ల‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ క‌ళాశాల‌లో చ‌ద‌వ‌లేమంటూ విద్యార్థులు వాపోతున్నారు. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు చంద్ర‌బాబు స‌ర్కార్…

కృష్ణా జిల్లా గుడ్ల‌వ‌ల్లేరు ఇంజనీరింగ్ క‌ళాశాల‌లో త‌మ వాష్‌రూమ్‌ల‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ క‌ళాశాల‌లో చ‌ద‌వ‌లేమంటూ విద్యార్థులు వాపోతున్నారు. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు చంద్ర‌బాబు స‌ర్కార్ క‌మిటీ కూడా వేసింది. అయితే ఇంకా విచార‌ణ ఫ‌లితాలు ఇంకా రాకుండానే, మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

అస‌లు గుడ్ల‌వ‌ల్లేరులో ఏమీ జ‌ర‌గ‌లేద‌ని, సెన్సేష‌న్ చేయొద్ద‌ని మీడియాకు నారా లోకేశ్ వార్నింగ్ ఇచ్చార‌నే వార్త‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. వేలాది మంది విద్యార్థినులు త‌మ మానాల్ని అంగ‌డి స‌రుకు చేసి, కొంద‌రు పోకిరీలు అమ్ముకోవాల‌ని దుర్మార్గ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుంటే, లోకేశ్ మాత్రం… అబ్బే అలాంటిదేమీ లేద‌ని చెప్ప‌డం ఏంట‌నే ప్ర‌శ్న ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జా సంఘాల నుంచి వ‌స్తోంది.

గుడ్ల‌వ‌ల్లేరులో ఒక్క‌టంటే ఒక్క ర‌హ‌స్య కెమెరా కూడా లేద‌ని, వీడియో ఏదీ బ‌య‌టికి రాలేద‌ని లోకేశ్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. తాను విద్యాశాఖ మంత్రి కావ‌డం వ‌ల్లే అన‌వ‌స‌రంగా ర‌చ్చ చేస్తున్నార‌ని ఆయ‌న వాపోతున్నారు. విచార‌ణ క‌మిటీతో మాట్లాడి లోకేశ్ ఇలాంటి నిర్ధార‌ణ‌కు వ‌చ్చారా? లేక త‌న మంత్రిత్వ‌శాఖ ప‌రిధిలోని అంశం కావ‌డంతో అంతా అబ‌ద్ధ‌మ‌ని చెబుతున్నారా? అనేది తేలాల్సి వుంది. ఏది ఏమైనా లోకేశ్ కామెంట్స్ స‌ర్వ‌త్రా చ‌ర్చనీయాంశ‌మ‌య్యాయి.

5 Replies to “మీడియా సెన్సేష‌న్ చేయొద్దు!”

  1. పనిలో పనిగా గుడ్లవలోరు ఘటనకు, జిందాల్ కు సంబంధం ఏమీ లేదని స్ప్రష్టం చేస్తే జనాలకు తెలుస్తుంది.

  2. బుద్ధి లేదా గాడిదలకి?? ఒకవేళ ఏమైనా ఉంటే అందరూ కలసి ఒక్కటై ఆ పని చేసిన వేధవని శిక్షించాలి అంతేగానీ మన ఆడపిల్ల బ్రతుకు తో రాజకీయాలా ?? సిగ్గుండాలి. అది ఎవరైనా కానీ …విషయం రాజకీయ లబ్ధి కోసం మాత్రం కాకూడదు…మన ఆడబిడ్డలు కదా… చాలా సెన్సిటివ్ మ్యాటర్..అధిక ప్రచారం మానుకోవాలి

Comments are closed.