నాని మాస్ చేసినా క్లాస్ యేనా!

హీరో నాని సినిమా సరిపోదా శనివారం ఫస్ట్ వీకెండ్ ముగుస్తోంది. గురువారం సినిమా విడుదల కావడంతో, నాలుగు రోజుల వీకెండ్ వచ్చింది సినిమాకు. సినిమాకు టోటల్ గా చూసుకుంటే అబౌవ్ యారేజ్ టు హిట్…

హీరో నాని సినిమా సరిపోదా శనివారం ఫస్ట్ వీకెండ్ ముగుస్తోంది. గురువారం సినిమా విడుదల కావడంతో, నాలుగు రోజుల వీకెండ్ వచ్చింది సినిమాకు. సినిమాకు టోటల్ గా చూసుకుంటే అబౌవ్ యారేజ్ టు హిట్ టాక్ వచ్చింది. కానీ బ్యాడ్ లక్ ఏమిటంటే వర్షాలు కొంత మేరకు దెబ్బతీసాయి. దాని విషయం అలా వుంచితే నాలుగు రోజుల ట్రెండ్ గమనిస్తే సినిమా అర్బన్ సినిమాగా లేదా మల్టీఫ్లెక్స్ సినిమాగా, లేదా క్లాస్ సినిమా గా ముద్రపడినట్లు కనిపిస్తోంది. హీరో నానికి మంచి మాస్ హీరో అనిపించుకోవాలని, మాస్ యాక్షన్ సినిమా చేయాలని కోరిక.

కానీ ఎంత చేసినా అది కాస్తా మళ్లీ క్లాస్ సినిమా ముద్రనే పడుతోంది. సరిపోదా శనివారం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా. అందులో సందేహం లేదు. అయినా కూడా సరిపోదా శనివారం కలెక్షన్లు తీరుచూస్తుంటే అర్బన్ ఏరియాల్లో మంచి అదరణ కనిపిస్తోంది. రూరల్ లో వుండడం లేదు.

వర్షాల్లో కూడా అర్బన్ ఏరియాల్లోని థియేటర్లు ఫుల్స్ పడుతున్నాయి. హైదరాబాద్ సిటీ, విశాఖ సిటీ, విజ‌యవాడ, కాకినాడ ఇలా అర్బన్ ఏరియాలు అన్నీ శని, ఆది వారలు మంచి ఫలితాలు కనిపించాయి. గుంటూరు కన్నా మల్టీ ఫెక్స్ లు ఎక్కువ వున్న కృష్ణా జిల్లా కలెక్షన్లు బాగున్నాయి.

వర్షాల వల్ల తక్కువ కలెక్షన్లు వున్నాయో అనుకుంటే అర్బన్ ఏరియాల్లో మరీ పెద్దగా వర్షాల ఎఫెక్ట్ కనిపించలేదు శాటర్ డే, సండే. అందువల్ల సినిమా క్లాస్ సినిమాగా లేదా అర్బన్ సినిమాగా ఫిక్స్ అయిపోతుందేమో అనిపిస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టి, మండే నుంచి రూరల్ ఏరియాలు, సెమీ అర్బన్ ఏరియాల్లో కూడా కలెక్షన్లు పెరిగితే అప్పుడు ఇది రాంగ్ అని డిసైడ్ కావచ్చు. లేదూ ఇప్పటి లాగే రాబోయే వారం అంతా వుంటే సినిమా అర్బన్ అడియన్స్ సినిమాగా ఫిక్స్ అయిపోయారు అని అర్ణం చేసుకోవ‌చ్చు.

ఇక కలెక్షన్ల సంగతికి వస్తే నైజాం ఏరియా బ్రేక్ ఈవెన్ కు సమస్య లేదు. ట్రెండ్ చూస్తుంటే సీడెడ్ కష్టం అని అంచనా. ఏపీ లో వైజాగ్ మినహా మిగిలిన ఏరియాలు ఎలా వుంటాయో ఈవారం రన్ మొత్తం చూసాక తెలుస్తుంది.

10 Replies to “నాని మాస్ చేసినా క్లాస్ యేనా!”

  1. అక్కడ ఈ మధ్య కాలం లో చేరిన ఊర మాస్ జనాలు క్లాస్ గా ఫీల్ అవడానికి ఇలాంటి సినిమాలు చూస్తారు…

  2. అక్కడ ఈ మధ్య కాలం లో చేరిన ఊర మాస్ జనాలు పాపం కొంచం క్లాస్ గా ఫీల్ అవడానికి ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటారు…

  3. పాపం కొంచం క్లాస్ గా ఫీల్ అవడానికి.. అక్కడ ఈ మధ్య కాలం లో చేరిన ఊర మాస్ జనాలు ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటారు…

Comments are closed.