రాజు గారికి ఇంతకీ ఏ పదవి ఇస్తున్నారు?

విజయనగరం పూసపాటి సంస్థానాధీశుడు, రాజకీయంగా అర్ధ శతాబ్దం అనుభవం ఉన్న వారు. రాష్ట్ర కేంద్ర మంత్రివర్గాలలో ఎన్నో పదవులు నిర్వహించిన వారు అయిన అశోక్ గజపతిరాజుకు ఏ పదవి దక్కుతుంది అన్నది ఆయన అనుచరులు…

విజయనగరం పూసపాటి సంస్థానాధీశుడు, రాజకీయంగా అర్ధ శతాబ్దం అనుభవం ఉన్న వారు. రాష్ట్ర కేంద్ర మంత్రివర్గాలలో ఎన్నో పదవులు నిర్వహించిన వారు అయిన అశోక్ గజపతిరాజుకు ఏ పదవి దక్కుతుంది అన్నది ఆయన అనుచరులు ఆసక్తిగా చూస్తున్నారు.

అశోక్ విషయం తీసుకుంటే ఆయన ఏ పదవీ అడిగే రకం కానే కాదు, ఆయనకు అన్నీ వరించి వచ్చిన పదవులే. ఆయన 2024లో విజయనగరం నుంచి లోక్ సభకు పోటీ చేయాలనుకున్నారు. కానీ కుటుంబానికి ఒక్కటే టికెట్ అన్న కండిషన్ తేవడంతో ఆయన కుమార్తెకి మాత్రమే టికెట్ దక్కింది.

అన్నీ అనుకూలించి కేంద్రంలో ఎన్డీయే ఏపీలో కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. దాంతో అశోక్ కి నాటి నుంచి ఏదో ఒక పదవి దక్కుతుందని అంతా అనుకుంటూ వస్తున్నారు. అశోక్ స్థాయికి గవర్నర్ పదవి ఇస్తారని కొన్నాళ్ళ పాటు ప్రచారం సాగింది.

ఆ మధ్య కేంద్రం కొన్ని రాష్ట్రాలకు గవర్నర్ పోస్టులను భర్తీ చేసింది కూడా. అయినా అశోక్ పేరు వినిపించలేదు. ఈలోగా వైసీపీ నుంచి ఇద్దరు ఎంపీలు తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాలు చేశారు. దాంతో అందులో ఒకటి అశోక్ కి ఇస్తారని ప్రచారం సాగుతోంది. అయితే ఇపుడు ఆ పదవులకు వేరే పేర్లు కూడా ముందుకు వస్తున్నాయి.

దాంతో అశోక్ కి ఇచ్చే పదవి ఏమిటి అన్నది రాజు గారి అభిమానులను తర్జనభర్జనలో పెడుతోంది. ఇంతకీ ఆయనకు పదవులు దక్కుతాయా లేక ఆయనకు పొలిటికల్ రిటైర్మెంట్ ఇచ్చేసినట్లేనా అన్న చర్చకు కూడా తెర లేస్తోంది. అశోక్ వంటి నీతి నిజాయతీ కలిగిన నాయకుడికి పదవులు కోరి రావాలని రాజకీయాలకు అతీతంగా అంతా కోరుకుంటున్నారు.

4 Replies to “రాజు గారికి ఇంతకీ ఏ పదవి ఇస్తున్నారు?”

Comments are closed.