ఏలూరు దక్కాలంటే ఇంకా చెమటోడ్చాల్సిందే!

కుదిరితే రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్లు అన్నీ వైసీపీ ఖాతాలోంచి ఊడ్చేయాలని.. అన్నిటి మీద కూటమి పార్టీల జెండా ఎగరేయాలని తెలుగుదేశానికి చాలా అత్యుత్సాహంగా ఉంది. Advertisement కార్పొరేటర్లు, కౌన్సిలర్లను విపరీతంగా ప్రలోభపెట్టడానికి తెదేపా సీనియర్…

కుదిరితే రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్లు అన్నీ వైసీపీ ఖాతాలోంచి ఊడ్చేయాలని.. అన్నిటి మీద కూటమి పార్టీల జెండా ఎగరేయాలని తెలుగుదేశానికి చాలా అత్యుత్సాహంగా ఉంది.

కార్పొరేటర్లు, కౌన్సిలర్లను విపరీతంగా ప్రలోభపెట్టడానికి తెదేపా సీనియర్ నాయకులు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా మునిసిపాలిటీల పరిధిలోని స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్లు ఇదే పని మీద ఉన్నారు. ప్రలోభాలు పెడుతున్నారు, భయపెడుతున్నారు, తాయిలాల ఆశచూపిస్తున్నారు. రకరకాల వేషాలు వేస్తున్నారు. కానీ.. వారు అనుకున్నంత సులువుగా మునిసిపాలిటీలు చేజిక్కడం లేదు. ఒకటిరెండు చోట్ల కూటమి జెండా ఎగిరినప్పటికీ.. చాలా చోట్ల కొంతమందిని పార్టీలో చేర్చుకోవడానికే తెలుగుదేశం వారు చెమటోడ్చాల్సి వస్తోంది. అలాంటి వాటిలో ఏలూరు కూడా ఒకటి.

ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50 మంది సభ్యులున్నారు. అందులో 47 మంది వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన వారే. తెలుగుదేశం హయాంలో ఇక్కడ మేయర్ అయిన తెలుగుదేశం నాయకురాలు ఎస్ కే నూర్జహాన్, 2021లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్లీ మేయర్ అయ్యారు. ఆమె భర్త కూడా కోఆప్షన్ సభ్యుడు అయ్యారు. తెలుగుదేశం పార్టీ అతి కష్టమ్మీద నూర్జహాన్ ను, ఆమె భర్తతో సహా తమ పార్టీలో చేర్చుకోగలిగింది. వారి ద్వారా కార్పొరేటర్లకు ఎర వేయడానికి ప్రయత్నించారు. రోజుల తరబడి ఆ ప్రయత్నాలు సాగిన తర్వాత.. ఎట్టకేలకు 14 మంది వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరారు.

కొత్తగా టీడీపీలోకి వచ్చిన 15 మందితో, పార్టీ తరఫున గెలిచిన ముగ్గురు కూడా కలిసినా మొత్తం వారి బలం 17 మాత్రమే అవుతోంది. ఈ కార్పొరేషన్ పై కూటమి జెండా ఎగరాలంటే ఇంకా 9 మంది సభ్యులు వీరి జట్టులో చేరాలి. కానీ, అది అంత సులువుగా కనిపించడం లేదు.

ప్రస్తుతానికి 14 మందిని ఒకేసారి చేర్చుకుని.. మిగిలిన సభ్యులందరిలో కూడా ఫిరాయిస్తే బెటర్ అనే ఆలోచన కలిగించాలనుకున్నారు గానీ.. ఆ పాచిక పారేలా లేదు. నిజానికి ఇక్కడ ఫిరాయింపులకు మంతనాలు జరిపే బాధ్యతను నూర్జహాన్ భర్త ఎస్ఎంఆర్ పెదబాబుకే ప్రధానంగా అప్పగించారు. స్థానిక ఎమ్మెల్యే కూడా తర్వాతి దశలో ఆశచూపిస్తున్నట్టు తెలుస్తోంది. 14 మందిని తీసుకురావడానికే నాన పాట్లు పడాల్సి వచ్చిందని.. ఇంకా 9 మంది పార్టీ దాటివచ్చేలా చేయడం కష్టం అని తెదేపా వారు అంటున్నారు.

రాష్ట్రమంతా కూడా ఇదే పరిస్థితి ఉన్నదని.. తాము గేట్లు తెరిస్తే వైసీపీ కార్పొరేటర్లు పోలోమని వచ్చేస్తారని కలగంటే.. అతికష్టమ్మీద ఒకటిరెండు మునిసిపాలిటీలు తప్ప ఇంకా ఎక్కడా ఘనమైన మెజారిటీలు దక్కడం లేదని తెదేపా వారంటున్నారు.

3 Replies to “ఏలూరు దక్కాలంటే ఇంకా చెమటోడ్చాల్సిందే!”

  1. Orai picchi news nuvvu great Andhra mathi poyinda yemiti Andhra people antha kutami vype vunnaru meeru Mee jaggadu Desam lo ee jail bagundhoo chusukondi…mental fools

Comments are closed.