ఏది ముందు, ఏది వెనక.. ఈ చర్చ వద్దు!

ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలున్నాయి. వీటిలో ఏ సినిమా ముందుగా సెట్స్ పైకి వస్తుందనే చర్చ జోరుగా నడుస్తోంది. దీనికి సంబంధించి పవన్ వర్గీయుల నుంచి క్లారిటీ వచ్చింది. Advertisement ఈసారి పవన్…

ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలున్నాయి. వీటిలో ఏ సినిమా ముందుగా సెట్స్ పైకి వస్తుందనే చర్చ జోరుగా నడుస్తోంది. దీనికి సంబంధించి పవన్ వర్గీయుల నుంచి క్లారిటీ వచ్చింది.

ఈసారి పవన్ నుంచి వచ్చే సినిమాల్లో ఏది ముందుగా సెట్స్ పైకి వస్తుందనే చర్చ అనవసరం అంటున్నారు పవన్ సంబంధీకులు. ఓ సినిమా సెట్స్ పైకి వచ్చిందని అనుకునేలోపే, మరో సినిమా కూడా మొదలవుతుందని చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ఫార్మాట్ లోనే పవన్ కూడా తన 3 సినిమాల్ని పూర్తిచేయాలని అనుకుంటున్నారట. ప్రభాస్ కొన్ని రోజులు ఓ సినిమాకు, మరికొన్ని రోజులు మరో సినిమాకు పనిచేస్తుంటారు. పవన్ కూడా అలానే మినిమం గ్యాప్స్ లో 3 సినిమాలు పూర్తిచేస్తారట.

అయితే ఇక్కడ కండిషన్స్ అప్లయ్ అంటున్నారు. ఎన్ని తక్కువ కాల్షీట్లలో సినిమా పూర్తిచేయగలిగితే అంత మంచిదని చెబుతున్నారు. మొదటి విడతలో భాగంగా దాదాపు 3 వారాల పాటు కాల్షీట్లు కేటాయిస్తారట పవన్. నిజానికి పవన్ సెట్స్ పైకి వచ్చే విషయాన్ని ఈరోజే ప్రకటించాలని అనుకున్నారట. ఏపీలో వరదల కారణంగా ఆ విషయాన్ని వాయిదావేశారు.

ఓవైపు నిరాశ.. మరోవైపు పండగ

పవన్ పుట్టినరోజు సందర్భంగా పండగ చేసుకోవాలనుకున్న అభిమానులకు వరదల కారణంగా ఆశాభంగం ఎదురైంది. ఓజీ నుంచి కీలకమైన అప్ డేట్స్, ప్రమోషనల్ మెటీరియల్ వస్తుందని భావించినప్పటికీ, ఆఖరి నిమిషంలో అన్ని కార్యక్రమాల్ని రద్దు చేశారు.

అయితే ఓవైపు ఇలా అధికారిక అప్ డేట్స్ వాయిదా వేసినప్పటికీ, మరోవైపు అనధికారికంగా పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఓజీ నుంచి ఓ స్టిల్ సోషల్ మీడియాలో లీకైంది. అది నిజంగా ఓజీ సినిమాలోనిదా లేక ఎవరైనా డీప్ ఫేక్ చేశారా అనే విషయాన్ని పక్కనపెడితే.. ఫ్యాన్స్ మాత్రం ఆ ఒక్క స్టిల్ తో ఈరోజు పండగ చేసుకుంటున్నారు.

4 Replies to “ఏది ముందు, ఏది వెనక.. ఈ చర్చ వద్దు!”

Comments are closed.