సరిపోదా శనివారం.. కాస్త డివైడ్ టాక్ తో, మూడు వంతులు పాజిటివ్ రివ్యూలతో థియేటర్లలో నిలబడింది. ఈ సినిమాకు అన్నింటికన్నా కలిసి వచ్చిన అదృష్టం ఏమిటంటే నాలుగు వారాల పాటు మరో సినిమా లేకపోవడం. సాధారణంగా ఇలాంటి అదృష్టం ఏ సినిమాకో కానీ లభించదు. సరిపోదా శనివారం విడుదలైన నాటి నుంచి నాలుగు వారాల పాటు మరో పెద్ద సినిమా అన్నది లేదు. మళ్లీ సెప్టెంబర్ 27న దేవర విడుదల వుంది. ఈ లోపు నాలుగు వారాలు అన్నీ చిన్న కంటెంట్ డ్రివెన్ సినిమాలే. 5న విజయ్ గోట్ వుంది కానీ అది డబ్బింగ్ సినిమా. వినాయకచవితి శనివారం వుంది. అంటే విడుదలైన మరుసటి వారం కూడా వరుస సెలవులు అన్న మాట.
ఇలాంటి కీలకమైన డేట్ ను, తరువాత వచ్చే వినాయకచవితి వీకెండ్ ను టాలీవుడ్ లోని మిగిలిన సరైన సినిమాలు ఏవీ ఎందుకు పట్టించుకోలేదు. ఎందుకు వదిలేసాయి అన్నది పెద్ద ప్రశ్న. టాలీవుడ్ కింగ్ పిన్ దిల్ రాజు సరిపోదా శనివారం సినిమాను అవుట్ రేట్ కు కొనడం వల్లనే ఇలాంటి అద్భుతమైన ఫీట్ సాధ్యమైందా అనే ప్రశ్న వుండనే వుంది. అది వేరే సంగతి.
ఇప్పుడు ఇక మార్కెటింగ్ సంగతి చూస్తే సినిమాను ఏపీలో 15 కోట్ల రేషియోలో, సీడెడ్ 5.40 కోట్ల రేషియోలో మార్కెట్ చేసారు. నైజాం దిల్ రాజు స్వంత విడుదల. బుక్స్ లో ఎంత అని రాసుకుని వుంటారో, వాళ్లకే తెలియాలి. సినిమాను 25 కోట్లు ప్లస్ జీఎస్టీ లెక్కన అమ్మారు అని వార్తలు వినిపించాయి కనుక, నైజాం ఓ ఎనిమిదిన్నర కోట్ల మేరకు అని అంచనా వేసుకోవచ్చు.
ఇక వసూళ్ల సంగతి చూస్తే, తొలి వీకెండ్ నాలుగు రోజులు నైజాం మంచి నెంబర్లు కనిపించాయి. నాలుగు రోజులకే ఎనిమిది కోట్ల మేరకు షేర్ వచ్చింది. నిజానికి దసరా సినిమాతో పోల్చుకుంటే ఈ నెంబర్ చాలా చిన్నది. కానీ సరిపోదా శనివారం మిగిలిన నెంబర్లతో పోల్చుకుంటే చాలా పెద్దది.
ఏపీలో చూసుకుంటే తొలి నాలుగు రోజులకు విశాఖ రెండు కోట్ల లోపు వసూళ్లు వచ్చాయి. మరో కోటిన్నర వరకు రావాల్సి వుంది ఇక్కడ. ఈస్ట్ గోదావరి కోటి రూపాయలకు కాస్త అటుగా షేర్ వచ్చిందని తెలుస్తోంది. ఇక్కడ ఇంకా కోటి పాతిక లక్షల వరకు రావాలి. వెస్ట్ గోదావరి 70 లక్షల వరకు వచ్చింది. అక్కడ మరో కోటి రూపాయల వరకు రావాలి. కృష్ణ, గుంటూరు, నెల్లూరు కూడా ఇదే విధంగా సగానికి పైగా వసూళ్లు సాధించాల్సి వుంది.
వీటన్నింటితో చూసుకుంటే సీడెడ్ పరిస్థితి ఇంకా దిగువనే వుంది. 5.40 కోట్ల మేరకు రావాలి. అక్కడ ఇప్పటి వరకు రెండున్నర కోట్ల లోపే వచ్చింది. ఇంకా మూడు కోట్లు రావాల్సి వుంది.
ఇవన్నీ కొన్న రేటు మేరకు మాత్రమే. దీనికి మరో పదిశాతం అన్నా కమిషన్ రావాలి. ఖర్చులు రావాలి. అయితే ఇక్కడ భరోసా పాయింట్ ఏమిటంటే మరో మూడు వారాల వరకు పెద్ద సినిమా అన్నది లేదు. గోట్, 35, జనక అయితే… భలే వున్నాడే, మత్తు వదలరా 2 ఇలాంటి చిన్న చిన్న కంటెంట్ బేస్డ్ సినిమాలు వున్నాయి.
అందువల్ల ఇవి ఏ మేరకు అడ్డం పడతాయి అన్నది విడుదల అయ్యే వరకు తెలియదు. ఏ మాత్రం అడ్డం పడకపోయినా సరిపోదా శనివారం సినిమా వినాయకచవితి నాటికే సీడెడ్ మినహా మిగిలిన ప్రాంతాలు బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అందులో సందేహం లేదు.
కానీ వినాయక చవితి మరే పెద్ద తెలుగు సినిమా అయినా పడి వుంటే సరిపోదా శనివారం ఇబ్బంది పడి వుండేది.
Call boy works 8341510897
సినిమా ఇంకా ఆడుతుంది అని కుళ్ళు కుంటున్నవా ?
vc available 9380537747
ముందేమో మూవీ బాలేదని ఒక ఏడుపు..తర్వాత వేరే ఏమీ లేవు కాబట్టి అని ఇంకో ఏడుపు..
ఎక్కడైనా ఇంతే కదా..
మాట మేత కి కొడుకే లేకుండుంటే..?
గ్రేటాంధ్ర వెబ్సైట్ నీకన్నా ముందే వేరేవాళ్లు రిజిస్టర్ చేసుకుని వుండుంటే?
నువ్వు మహా మేత హార్డ్ కోర్ ఫ్యాన్ కాకపోయి ఉంటే..?
ఘటనా ఘటన కల్పితాల మీద ఆర్టికల్ రాస్తూ మరీ దిగారకుండా ఉండుంటే..?
అన్ని ఊహాజనితమే కదా..
Nee badhendi ra? Edchi sastunnav nani meeda! Pedda sadist la unnav