బాబు ఇంటి స్టేట‌స్ గురించి చెప్ప‌రేం?

రాజ‌ధాని అమ‌రావ‌తిపై కూట‌మి నేత‌ల‌కు బెంగ ప‌ట్టుకుంది. గ‌తంలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అమ‌రావ‌తిని మున‌క ప్రాంతంగా అభివ‌ర్ణించారు. జ‌గ‌న్ చెప్పిందే నేడు నిజ‌మైంద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. అమ‌రావ‌తి కూడా నీళ్ల‌లో వుంద‌ని పెద్ద ఎత్తున…

రాజ‌ధాని అమ‌రావ‌తిపై కూట‌మి నేత‌ల‌కు బెంగ ప‌ట్టుకుంది. గ‌తంలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అమ‌రావ‌తిని మున‌క ప్రాంతంగా అభివ‌ర్ణించారు. జ‌గ‌న్ చెప్పిందే నేడు నిజ‌మైంద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. అమ‌రావ‌తి కూడా నీళ్ల‌లో వుంద‌ని పెద్ద ఎత్తున జ‌నం మాట్లాడుకుంటున్నారు. దీన్ని కూట‌మి నేత‌లు త‌ట్టుకోలేక‌పోతున్నారు.

ఈ నేప‌థ్యంలో వ‌ర‌ద నీటిలో అమ‌రావ‌తి ఉంద‌నే ప్ర‌చారాన్ని తిప్పి కొట్ట‌డానికి టీడీపీ అనుకూల మీడియా బాధ్య‌త‌ను భుజాన వేసుకుంది. రాజ‌ధాని ప్రాంతం మున‌క‌లో లేద‌ని చెప్ప‌డానికి ఆ మీడియా తీవ్రంగా శ్ర‌మిస్తోంది. ఇందులో భాగంగా స‌చివాల‌యం, ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల నివాస సముదాయాలు, అసెంబ్లీ త‌దిత‌ర ప్రాంతాల్లో ఎలాంటి వ‌ర‌ద నీళ్లు లేవ‌ని ఫొటోలు ప్ర‌చురించి, ఇదే నిజ‌మ‌ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తోంది.

అయితే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి నివాసం వ‌ర‌ద నీటిలో వుంద‌నే ప్ర‌చారంపై మాత్రం ఆ మీడియా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తోంది. అలాగే అధికారులు, టీడీపీ నేత‌లెవ‌రూ బాబు నివాసంపై మాట్లాడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కానీ వైసీపీ అధికార పత్రిక మాత్రం చంద్ర‌బాబు నివాసం కృష్ణా న‌ది నీటిలో ఉన్న‌ట్టు, ఆ ఇంటి వెనుక ప‌రిస్థితిని తెలియ‌జేసే ఫొటోల్ని ప్ర‌చురించ‌డం విశేషం.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నివాసం వ‌ర‌ద నీటిలో వుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అందుకే ఏ ఒక్క‌రూ మాట్లాడ్డం లేద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. త‌మ‌కు అనుకూల‌మైన అంశాల్ని మాత్ర‌మే చ‌ర్చకు పెట్ట‌డం, లేదంటే ఎదురు దాడికి దిగ‌డం ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో స‌ర్వ‌సాధార‌ణ‌మైంది.

17 Replies to “బాబు ఇంటి స్టేట‌స్ గురించి చెప్ప‌రేం?”

  1. Aray jaffadi… Karakatta ante river ki voddune vuntadhi.. obviously munige chance.. capital ki karakatta house link enti?

    Mari tadepalli house enduku munagaledhu ?

    Secreteriate , assembly , hight court munigente cheppu ??

    .

    Ayina capital lo inka development cheyaledhu.. polalu algae vadilesaru kabatti water nilichayi.. andulonu inka drainage system construct cheyaledhu..

      1. Varada vachinappudu daani pravahaniki maamulu kattadalu kottukapithayi.. The reason not to build on karakatta is to avoid heavy loads on soiled katta.. that house is not built by him.. yes it’s wrong if he continue in that home even after developing capital.

  2. చెయ్యి తెగింది అని కత్తి పారేసుకుంటామా?

    జ్వరం వచ్చింది అని చచ్చి పోతామా?

  3. అమరావతి మునిగి పోలేదని చూపించగలిగినోళ్లు చంద్రబాబు ఇల్లు మాత్రం మునిగిపోయింది అని ఎందుకు చూపిస్తారు?

  4. పది కిలోమీటర్ల దూరానికి కూడా హెలీకాఫ్టర్లో వెళ్ళేవాడు, కాలు కింద పెట్టకుండా రెడ్ కార్పెట్ మీద నడిచేవాడు, చుట్టూ బెరికేడ్స్ పెట్టుకుని వరద బాధితులను పరామర్శించేవాడు, అలాంటి మనిషిని, తండ్రిలేని బిడ్డని జాలి కూడా లేకుండా వరద నీళ్ళల్లో నడిపిస్తారా? పా ఫ్ మ్ ర రే .

  5. బుడమేరు అంటే ఏంటో తెలియదు.. అది ఎటు పారుతుందో తెలియదు.. బుడమేరుకి గేట్లు ఉంటాయని అంటున్నాడు.. విజయవాడ వాళ్ళకి మైండ్ పోయింది ఇది వినగానే.. గుంటూరు వైపున చంద్రబాబు ఇల్లు కాపాడుకోటానికి కృష్ణ జిల్లాలో ఏలూరు వైపు ప్రవహించే బుడమేరు విజయవాడ ఊరు మీదకి వదిలాడు చంద్రబాబు అంటాడు.. వీడికి మైండ్ అసలు పని చేస్తుందా ?

Comments are closed.