హీరోయిన్లపై పుకార్లు సర్వసాధారణం. కాస్త క్రేజ్ ఉన్న హీరోయిన్లపై ఇలాంటి రూమర్స్ మరింత ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి పుకారు ఒకటి ఈమధ్య కృతి శెట్టిపై జోరుగా నడుస్తోంది. ఆ రూమర్ తో సదరు హీరోయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇంతకీ ఆ పుకారు ఏంటో చూద్దాం..
కృతి షెట్టిని కొన్నాళ్లుగా ఓ వ్యక్తి వేధిస్తున్నాడట. అతడు కూడా సాధారణ వ్యక్తి కాదు. ఓ స్టార్ హీరో కొడుకు అంట. కృతి ఏ ఈవెంట్ కు వెళ్లినా అక్కడ ఆమెను వేధించేవాడంట. ఇతగాడు ఎక్కడికి వెళ్లినా, అక్కడకు కృతిని రమ్మని బలవంతం చేసేవాడంట. అలా కృతి శెట్టిని భయపెట్టడానికి చాలా ట్రై చేశాడట.
ఓ కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతిశెట్టి ఈ సంచలన ఆరోపణలు చేసినట్టు వార్తలొచ్చాయి. ఆ వెంటనే ఇవి వైరల్ అయ్యాయి. వీటిపై కృతి శెట్టి రియాక్ట్ అయింది. ఆ పుకార్లలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.
ఇలాంటి కథనాలు కల్పించడం ఆపాలని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని కోరింది కృతి శెట్టి. పుకార్లు సాధారణమే కాబట్టి ప్రారంభంలో తను దీన్ని పట్టించుకోలేదని, కానీ రోజురోజుకు ఈ పుకార్లు ఎక్కువ కావడంతో రియాక్ట్ అవ్వక తప్పడం లేదని వాపోయింది ఈ బ్యూటీ.