కళ్లుచెదిరే ఆస్తులు కూడబెట్టాడు సల్మాన్ ఖాన్. షారూక్, అక్షయ్ లాంటి హీరోల ఆస్తుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే కుర్ర హీరోలు కూడా వందల కోట్ల రూపాయలు ఆర్జిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇది అలాంటిదే. బాలీవుడ్ యంగ్ హీరోస్ లో ఒకడైన రణ్వీర్ సింగ్ నెట్ వర్త్ విలువ అక్షరాలా 334 కోట్ల రూపాయలు.
ఇది గతేడాది అంచనా. ఈ 6 నెలల ఆర్జితం కూడా కలుపుకుంటే లెక్క మరో 50 కోట్లు పెరగడం ఖాయం. ఇదంతా జస్ట్ 12 ఏళ్లలో రణ్వీర్ సింగ్ సంపాదించిన ఆస్తి.
2010లో కెరీర్ స్టార్ట్ చేశాడు రణ్వీర్ సింగ్. ఎంట్రీ ఇవ్వడమే హిట్ కొట్టాడు. ఆ తర్వాత కూడా నిలకడగా రాణించడం రణ్వీర్ కు కలిసొచ్చింది. దీంతో ప్రతి సినిమాకు అతడి పారితోషికం పెరిగింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు ఈ హీరో. ఇక ప్రతి నెలా బ్రాండింగ్స్ రూపంలో 2 కోట్ల రూపాయలు వస్తాయి.
అలా పుష్కర కాలంలో 334 కోట్ల రూపాయలకు అధిపతిగా మారాడు ఈ బాలీవుడ్ హీరో. ప్రస్తుతం బాలీవుడ్ లో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న అతికొద్ది మంది హీరోల్లో రణ్వీర్ ఒకడు.
ముంబయి బాంద్రాలోని సాగర్ రేషమ్ లో రణ్వీర్ కు సీ-ఫేసింగ్ ఫ్లాట్ ఉంది. దీని ఖరీదు అక్షరాలా 119 కోట్ల రూపాయలు. దీపిక పదుకోన్ తో కలిసి ఈ విల్లా కొనుగోలు చేశాడు రణ్వీర్. ఇక అలీబాగ్ లో 5 పడక గదులతో ఉన్న సువిశాలమైన ఇల్లు కూడా వీళ్ల సొంతం.
రణ్వీర్ సింగ్ వద్ద భారీ లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. ఆస్టిన్ మార్టిన్, రేంజ్ రోవర్, లాంబోర్గిని కంపెనీలకు చెందిన కార్లు ఉన్నాయి. ఇక ఈ హీరో చేతిలో భారీ బ్రాండ్స్ ఉన్నాయి. వీటిలో అంతర్జాతీయ కంపెనీలే ఎక్కువ. వీటి ద్వారా వచ్చే ఆదాయం కూడా కోట్లలో ఉంది. ఇక దీపిక పదుకోన్ ఆస్తులు కూడా కలిపితే ఈ జంట ఉమ్మడి ఆస్తులు చూస్తే కళ్లు తిరగాల్సిందే.