స‌త్య‌వేడు ఇన్‌చార్జ్‌గా ఎస్సీవీ నాయుడు?

తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు టీడీపీ ఇన్‌చార్జ్‌గా శ్రీ‌కాళ‌హ‌స్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడిని నియ‌మించే అవ‌కాశాలున్నాయి. ఎస్సీవీ నియామ‌కంపై తిరుప‌తి జిల్లాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఎన్నిక‌ల ముందు ఈయ‌న వైసీపీ నుంచి…

తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు టీడీపీ ఇన్‌చార్జ్‌గా శ్రీ‌కాళ‌హ‌స్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడిని నియ‌మించే అవ‌కాశాలున్నాయి. ఎస్సీవీ నియామ‌కంపై తిరుప‌తి జిల్లాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఎన్నిక‌ల ముందు ఈయ‌న వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. శ్రీ‌కాళ‌హ‌స్తి టికెట్ ఆశించిన‌ప్ప‌టికీ, బొజ్జ‌ల సుధీర్‌ను కాద‌ని చంద్ర‌బాబు ఇవ్వ‌లేక‌పోయారు.

తాజాగా స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని అత్యాచారం ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో టీడీపీ అధిష్టానం స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆదిమూలంపై తిరుప‌తి ఈస్ట్ పోలీస్‌స్టేష‌న్‌లో అత్యాచార కేసు న‌మోదైంది. ఆయ‌న కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అనారోగ్య కార‌ణంతో చెన్నైలో ఓ ఆస్ప‌త్రిలో చేరినట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆదిమూలాన్ని త‌ప్పించ‌డంతో స‌త్య‌వేడు టీడీపీకి ఇన్‌చార్జ్ అవ‌స‌రం ఏర్ప‌డింది.

దీంతో ఎస్సీవీ నాయుడిపై టీడీపీ అధిష్టానం మొగ్గు చూపుతున్న‌ట్టు తెలిసింది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో నాయుడికి మంచి ప‌రిచ‌యాలున్నాయి. అందుకే ఎస్సీవీ నాయుడిని నియ‌మించాల‌నే డిమాండ్లు అక్క‌డి టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల నుంచి వ‌స్తున్న‌ట్టుగా తెలిసింది. ఎస్సీవీ నాయుడైతేనే స‌త్య‌వేడులో టీడీపీని కాపాడ‌గ‌ల‌ర‌నే టాక్ వినిపిస్తోంది.

ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో అతి త‌క్కువ మెజార్టీతో టీడీపీ గెలుపొందింది. టీడీపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల కార‌ణంగా ఆదిమూలం బ‌ల‌హీన‌త‌ల్ని ప‌సిగ‌ట్టి, ఆయ‌న్ను ట్రాప్‌లోకి లాగార‌ని అంటున్నారు. ఆదిమూలం వ్య‌తిరేకులు ప‌న్నిన వ‌ల‌లో ఆయ‌న చిక్కి, చేజేతులా రాజ‌కీయ జీవితాన్ని నాశ‌నం చేసుకున్నారు.

5 Replies to “స‌త్య‌వేడు ఇన్‌చార్జ్‌గా ఎస్సీవీ నాయుడు?”

Comments are closed.