ఆర్‌కె అక్ష‌రాల బుర‌ద‌

అమ‌రావ‌తిలోకి నీళ్లు వ‌చ్చాయా లేదా?అది చెప్ప‌రు. చంద్ర‌బాబు ఇల్లు మునిగిందా లేదా? హెచ్చ‌రిక‌లు లేకుండా బుడ‌మేరు నీళ్లు వ‌దిలారా లేదా?

ఆదివారం సెల‌వు కాబ‌ట్టి, కొత్త ప‌లుకు ఈ సారి శ‌నివార‌మే ద‌ర్శ‌న‌మిచ్చింది. అల‌వాటు ప్ర‌కారం చంద్ర‌బాబు భ‌జ‌న‌, జ‌గ‌న్‌కి తిట్టు, వ్య‌తిరేక మీడియాని బూతురోత మీడియాగా వ‌ర్ణించ‌డం. రాధాకృష్ణ ప్ర‌త్యేక‌త ఏమంటే అనుకూల స‌త్యాన్ని గ‌ట్టిగా, ధాటిగా చెబుతారు. ప్ర‌తికూల వాస్త‌వాన్ని చూసీచూడ‌న‌ట్టు వ‌దిలేస్తారు. దీన్నే ప‌త్రికా విలువ‌లు భావిస్తారు.

పత్రికా విలువ‌లు అంటే త‌న ప‌త్రిక‌కి ఆయ‌న క‌ట్టే విలువ‌. బాబు హ‌యాంలో అది బాగానే వ‌ర్క‌వుట్ అవుతుంది. అందుకే జిల్లా స‌మావేశాల‌కి ప్ర‌త్యేక విమానంలో తిరుగుతున్నారు. ప‌త్రికా స్వేచ్ఛ అనే చ‌త్వారం మాటున ఆయ‌న త‌న‌లోని అస‌త్యాల‌ని, రోత‌ని చూడ‌లేరు. చంద్ర‌బాబు మీద ఈగ వాలితే బాధాకృష్ణ అవ‌తారంలో పాత ప‌లుకునే కొత్త ప‌లుకుగా చెబుతూ వుంటారు.

జ‌గ‌న్ బుర్ర‌లో బుర‌ద అని ఈ వారం రాసారు. మంచిదే. అస‌లు జ‌గ‌న్‌కే బుర్ర వుంటే స‌ల‌హాదారుల్ని, క‌న్స‌ల్టెంట్‌ల‌ని, బ‌ట‌న్‌ని కాకుండా పార్టీని, ప్ర‌జ‌ల్ని న‌మ్మి మ‌ళ్లీ గెలిచే ప్ర‌య‌త్నం చేసేవాళ్లు. ఓడిపోవ‌డానికే పాల‌న చేసిన ప్ర‌త్యేక ముఖ్య‌మంత్రి ఆయ‌న‌. జ‌గ‌న్ గొప్ప పాల‌నాద‌క్షుడ‌ని ఎవ‌రికీ భ్రాంతి లేదు. ఆయ‌న సాక్షిలోనే జీతాలు పెంచ‌డు, ఇక పేటీఎం బ్యాచ్‌ల‌కి డ‌బ్బులిస్తాడ‌ని రాధాకృష్ణ న‌మ్మ‌డం అంత‌కు మించిన భ్రాంతి.

బుర‌ద ప‌లుకులోని కొన్ని వాస్త‌వాల‌ని గ‌మ‌నిద్దాం. అబ‌ద్ధాలే పునాదులుగా జ‌గ‌న్ రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టాడ‌ట‌. తండ్రి మ‌ర‌ణంతో అనివార్యంగా జ‌గ‌న్ వ‌చ్చాడు త‌ప్ప‌, అబ‌ద్ధాల‌తో కాదు. ల‌క్ష్మీపార్వ‌తి సాకుతో దారుణ‌మైన అబ‌ద్ధాలు ప్ర‌చారం చేసి ఎన్టీఆర్‌ని గ‌ద్దె దించ‌డం కంటే మోసం చ‌రిత్ర‌లో ఇంకోటి క‌నిపిస్తుందా? ప‌త్రిక రాత‌ల‌తో ప్ర‌జ‌ల కోసం అనుక్ష‌ణం ప‌నిచేసే ఆర్‌కె. రాత‌ల్ని ప‌రిశీలిద్దాం.

1). అమ‌రావ‌తిలోకి నీళ్లు వ‌చ్చాయా లేదా?

అది చెప్ప‌రు. చంద్ర‌బాబు ఇల్లు మునిగిందా లేదా? హెచ్చ‌రిక‌లు లేకుండా బుడ‌మేరు నీళ్లు వ‌దిలారా లేదా?

2). రిటైనింగ్ గోడ లేక పోతే మ‌రింత న‌ష్టం జ‌రిగేదా కాదా?

– అది క‌ట్టింది జ‌గ‌న్ కాదా?

3). అబ‌ద్ధాల‌ని ప‌దేప‌దే ప్ర‌చారం చేస్తే ప్ర‌జ‌లు న‌మ్ముతార‌ని జ‌గ‌న్‌కి తెలుసట‌

– ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కి మించిన అబ‌ద్ధ‌పు ప్ర‌చారం ఈ మ‌ధ్య ఏదైనా వుందా? మీ ప‌త్రిక రాత‌ల్ని ఒక‌సారి చూసుకుంటే మీకే అర్థ‌మ‌వుతుంది.

4). బాబు హ‌యాంలో రాష్ట్రానికి ఎక్క‌డ పెట్టుబ‌డులు వ‌స్తాయో అనే దుగ్ధ‌తో జ‌గ‌న్ సైకో గుంపు వుంద‌ట

-నూరు రోజుల త‌ర్వాత కూడా వ‌ర‌ద వ‌చ్చింది కానీ, ఎక్క‌డైనా పెట్టుబ‌డులు వ‌చ్చాయా?

5). గుడ్ల‌వ‌ల్లేరు లాంటి సంఘ‌ట‌న జ‌గ‌న్ హ‌యాంలో జ‌రిగితే..

– గంజాయికి వైసీపీ నాయ‌కుల‌కి, కొలంబియాలోని సెక్స్ మాఫియా గ్యాంగ్‌ల‌కి ముడిపెట్టి మీరు క‌థ‌నాలు రాసేవాళ్లు కాదా?

6). 1998లో మీరు ఒక విలేక‌రి మాత్ర‌మే.

నెల జీతం తీసుకునే మీకు ఇబ్ర‌హీంప‌ట్నం ద‌గ్గ‌ర మినీ హైడ‌ల్ ప్లాంట్ ఏర్పాటు చేసేంత డ‌బ్బులు ఎక్క‌డివి? ఆ ర‌హ‌స్యం చెబితే, అధ్వాన‌మైన జీతాల‌తో ప‌నిచేసే మీ సంస్థ జ‌ర్న‌లిస్ట్‌లు, స‌బ్ ఎడిట‌ర్లు మీ నుంచి ఎంతోకొంత నేర్చుకుంటారు క‌దా?

7). బాధితుల‌కి జ‌గ‌న్ ఎంత విరాళ‌మిస్తారో మ‌ళ్లీ చూద్దాం. విప‌త్తులు వ‌చ్చిన ప్ర‌తిసారి గుండెలు బాదుకునే ఆర్‌కె.

త‌న జేబులో నుంచి ఎన్నిసార్లు ఎంత విరాళ‌మిచ్చాడో వివ‌రిస్తే బావుంటుంది.

8). తెలుగు బాష మీద ఆర్‌కెకి మంచి ప‌ట్టు వుంది. రాజ్య‌స‌భ స‌భ్యుల్ని జ‌గ‌న్ లాగేసి వుంటే జ‌గ‌న్ ఎర‌వేసి ప్ర‌లోభాల‌కి గురి చేసి కొన్నాడ‌ని రాస్తారు.

జ‌గ‌న్ స‌భ్యుల్ని బిజెపి, తెలుగుదేశం లాగితే మాత్రం, వాళ్ల‌ని జ‌గ‌న్‌కి దూరం చేసే చ‌ర్య‌గా రాస్తారు.

9). గోరంట్ల మాధ‌వ్ గురించి ఎంత రాసారో, కొత్త ప‌లుకుని ఎంత నింపారో గ‌తంలోకి వెళ్లి చూసుకోండి.

అదే టిడిపి ఆదిమూలం అంత‌కు మించి భ్ర‌ష్టుప‌డితే ఏక వాక్యంలో తీర్మానించారు.

ఒక‌వేళ ఆదిమూలం వైసిపిలోనే వుండి వుంటే కొత్త ప‌లుకు ఆయ‌న శృంగార లీల‌ల‌తో నిండి వుండేది.

సోష‌ల్ మీడియా లేదా మీ భాష‌లో కూలి మీడియా లేదా పేటిఎం బ్యాచ్ పొట్ట కూటి కోసం రూపాయి డ‌బ్బుల‌కి క‌క్కుర్తి ప‌డ్డారంటే అర్థ‌ముంది. కానీ వేల కోట్ల య‌జ‌మానులైన మీరు అబ‌ద్ధాల‌ని నిజాలుగా, నిజాల్ని అబ‌ద్ధాలుగా ద‌శాబ్దాలుగా రాస్తున్నారంటే దేని కోసం?

అక్ష‌రాల‌ని తూక‌మేసి జ‌ర్న‌లిజాన్ని ఎపుడో అమ్మేసారు. కాక‌పోతే మ‌నుషుల్ని బ‌ట్టి ధ‌ర‌లు మారుతాయి. కూలోళ్ల‌కి పేటిఎం, య‌జ‌మానుల‌కి ప‌వ‌ర్‌ప్లాంట్‌లు, ప్ర‌త్యేక విమానాలు.

74 Replies to “ఆర్‌కె అక్ష‌రాల బుర‌ద‌”

  1. ఒక పక్క ఆ బూతు కిట్టు గాడి మీద ఏడుస్తూ… మళ్ళీ అవే లే కి రాతలు రాసే నీలాంటి వాళ్ళను ఏమనాలి GA…

  2. గ్రేట్ ఆంధ్రా ఆదిమూలం మీద ఆరోపణలు రాగానే చంద్రబాబు మారు మాట్లాడకుండా పార్టీ నుండి సస్పెండ్ చేశారు. మీ జగన్ ఈ మధ్య ఇటువంటి ఆరోపణలు వచ్చిన వారు ఏడు, ఎనిమిది మంది నీ అభిమాన పార్టీ లో ఉన్నారు. నీ ఆరాధ్య దైవం వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నాడా చెప్పు. అసలు ఆదిమూలం విషయం వెలిగులోకి తెచ్చింది ఆర్ కె గారి పేపరే. అది తెలుసుకో

    1. TDP leaders have boycotted theblady fromnthebparty who raised the issue on Aadimoolam. What is more shameless than that. The suspension is just for name sake to showoff in public. What was done to leaders involved in call money case? All leaders and parties are same in this regard and innocent people are made to fight on the lines of caste, creed or religion.

  3. 2014 కి ముందు కొద్దో గొప్పో జ్యోతి రాతల మీద విశ్వసనీయత ఉండేది, ఆతర్వాత నుంచి నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్న రీతిలో మన వాళ్ళు అంటే టీడీపీ, కాంగ్రెస్ లు మంచోళ్ళు, వైసీపీ, బీజేపీ చెడ్డ అని ద్వేషం రాతలు మొదలెట్టాడు, అంతకుముందు మరీ ఎక్కువ ఉండేది కాదు.

      1. సాక్షి గురించి అసలు చర్చ అవసరం లేదు, పూర్తిగా జగన్ గురించి మాత్రమే పని చేస్తుంది, నేను ఎప్పుడూ దాన్ని చదవలేదు.

  4. ఇంతకూ వరద సహాయం మీద జగన్ తన సొంత డబ్బు యెంత ఖర్చు పెట్టారు? ఎంత విరాళం ఇచ్చారు.

    అతను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.

    మొన్న సందర్శన కి వచ్చిన ఖర్చు కూడా పాపం ఆ విజయవాడ ఫ్యాన్ పార్టీ కార్యకర్తల తాము జేబుల్లో డబ్బు చందాలు వేసుకుని డీజిల్, జగన్ కి ఫైవ్ స్టార్ భోజనం ఖర్చులు పెట్టుకున్నారు.. కాదు అని నిరూపించు, దమ్ము వుంటే.

  5. ఆ యజమాని జర్నలిజం ముసుగులో రోత రాతలు రాయడం ఎదుటివారి మీద నెట్టడం ఈ దమ్మున్నోడికే చెల్లిద్ది. జగన్ వ్యాఖ్యలు తన మీడియాలో ప్రచురించి, చూపే ధైర్యం లేని ఈ చెత్త పలుకులు పలికే వారి వల్లే జర్నలిజం విలువలు మంట కలుస్తున్నాయి. నాణేనికి రెండో వైపు ఎప్పుడు చూపే ధైర్యం లేదు..

  6. Their agenda….tdp. No one should be on CM chair except babu. If at all pavan improves his voting by chance and if he and his fans aspire for CM post, pavan also will be treated like jagan.

  7. మన స్థాయికి కింద వారి గురించి రాయడం waste like RK, why c p etc. బురద జీవాలు స్థావరం కూడా “PEN” English లో.

  8. 1. వర్షం వస్తే నీళ్ళే వస్తాయి.. నీళ్ళు రావడానికి, వరదకు తేడా తెలేదానీకు.. వరదోస్తే హైకోర్టు, సెక్రటేరియట్ ఎలా పని చేశాయి?

    2. రిటైనింగ్ వాల్ 2019 కి ముందే 2.30 కిలోమీటర్లు పూర్తి అయ్యింది.. అప్పుడు జగన్ సీఎం నీ దృష్టిలో.

    3.37 మంది కమ్మ డీఎస్పీ లు, పింక్ డైమండ్.. ఇవన్నీ నిజాలే నీ దృష్టిలో, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అబద్దమా?

    4.ap లో వద్దు తెలంగాణాలో పెట్టుబడులు పెట్టండని మీ సోషల్ మీడియాలో ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అయినా వస్తున్నాయి.. 100 రోజుల్లో పెట్టుబడులు తెస్తానని చెప్పాడా బాబు? పోనీ 5 ఏళ్లలో మీరెన్ని తెచ్చారు? తరిమేసినై ఎన్ని?

    5. ఏం జరిగింది గుడ్లవల్లేరు లో? కొవ్వెక్కిన నాయకుల పిల్లలు బట్టలిప్పుకొని కాల్స్ చేసుకొని ఒకరికొకళ్ళు బ్లాక్మెయిల్ చేసుకున్నారు.. దాన్ని మీరు కెమెరాలు, వీడియోలు అని గోల చేసారు.. ఒక్క వీడియో అయినా దొరికిందా?

    6. అంటే 1989 లో ఎలా వున్నారో ఇప్పుడూ అలాగే వుండాలా?

    2003 లో వైఎస్, జగన్లు అప్పుల్లో వున్నారు.. ఇప్పుడు లక్షల కోట్లు.. ఎలా వచ్చాయ్?

    7. Rk ఇస్తేనే జగన్ ఇస్తాడా విరాళాలు? భువనేశ్వరి, ప్రభాస్, పవన్ వాళ్ళంతా ఇచ్చారు కదా.. పిల్లికి బిచ్చం కూడా వెయ్యాడు మీ జగన్.. ఒక్క ఉదాహరణ చూపించు..

    8. డబ్బు ఇచ్చి కొనే బ్యాచ్ కాదు జగన్..భయపెట్టు, కేసులు పెట్టీ

    లాగేసే బ్యాచ్.

    9.

  9. మీ కంటే ముచ్చట వెబ్మీడియా లో బాగా రాసారు “చె*త్త పలుకు” గురించి.

  10. జగన్ దుష్ట చతుష్టయం అని విమర్శించినప్పుడు ఏమైనావు గ్రేటాంద్ర

  11. ఒక పక్క బూతు కిట్టు ను చూసి ఏడుస్తావు….ఇంకో పక్క pawan మీద విషం కక్కుతావ్….రెండు నష్టమే…😂😂…గెలుపు ఓటమి సహజం GA….. ఇప్పటికి ఐన మీరు అహం వదిలి, 11 కి ఎందుకు పడిపోయారో అర్థం చేసుకుంటానికి ప్రయత్నిస్తే బాగుపడతారు…..

  12. ఒక పక్క buthu కిట్టును చూసి ఏడుస్తారు….ఇంకో పక్క pawan మీద విషం కక్కుతారు…రెండు నష్టమే….😂😂….గెలుపు ఓటమి సహజం GA…. ఇప్పటికైనా అహం వదిలి, 11 ఎందుకు వచ్చాయో కారణం తెలుసుకుంటే బాగు పడతారు….లేకపోతే మీ ఖర్మ….

  13. ఈ విషయంలో మీరేం తక్కువ తినలేదు గ్రేట్ ఆంధ్ర

    మీరు కూడా వీలయితే కాదు ఎప్పుడు కూడా జగన్ రెడ్డికి పొగడ్త, బాబుకు తిట్లు మీరు ఎప్పుడూ రాసేవే కదా ఈ విషయంలో మాత్రం మీరు పీహెచ్డీ చేసారు

  14. Excellent Article, ఒరిస్సా లో వరదలు తుఫానులు భారీ స్తాయిలో వస్తాయి. అక్కడి ముఖ్యమంత్రి ఓక్క రోజు కూడా పడవల మీద ఏక్కి తిరిగింది లేదు, కానీ ఐదు సార్లు వరుసగా గెలిచాడు. కర్ణాటక లో ఏముఖ్యమంత్రి, పార్టీ బెంగులూరు, సాఫ్ట్ వేర్ మా వల్లే అభివృద్ది చెందింది అని చెప్పు కోలేదు.

    1. ఒరిస్సాలో వరదలు కాదు తుఫానులొస్తాయి. కొంచెం చరిత్ర తెలుసుకుంటే 1999 లో ఏం జరిగిందో బాబు ఒరిస్సాకి కూడా సహాయం చేసిన సంగతి తెలుస్తుంది. అయినా అక్కడ వచ్చేది తుఫానులు, చాలా చాలా తరచుగా వస్తాయి. తరవాత తరవాత డిసాస్టర్ రెస్పాన్స్ చాలా బాగా డెవలెప్ చేసారు అస్తమానూ ముఖ్యమంత్రి వెళ్ల్లక్కరలేకుండా. మనదగ్గర అప్పుడప్పుడూ వస్తాయి ఇలాంటి ఉత్పాతాలు. ముఖ్యమంత్రి ఫీల్డ్ లో తిరుగుతున్నాడు అంటే అధికారులు కూడా సరిగ్గా పని చేస్తారు. వైకేరియస్ల యబిలిటీ అని మన ఏంబిఎస్ అంటాడు చూడు అది. అందుకని పడవమీద తిరుగుతాడు.

      బెంగుళూరు, నిజమే ఏ ముఖ్యమంత్రి చెప్పుకోలేదు. అక్కడ డెవలప్మెంట్ ప్లాన్డ్ కాదు. అందుకనే ఆ ఊరు అంత అధ్వాన్నంగా తయారయింది.

      హైదరాబాద్ ప్లాన్ ప్రకారం, ఎంతో ముందుచూపుతో, ఒక కొత్త ఏరియాని డెవలప్ చేయబట్టి ఈ మాత్రమైనా ఉంది. కొన్ని ప్రాంతాలకే పరిమితమైనా అధిక ధరలు, ట్రాఫిక్ ఊరంతా ఉండేది. జీడిమెట్ల లాంటి ప్రాంతాలలో కూడా రెంట్లూ ట్రాఫిక్ తో నరకం కనబడి ఉండేది.

  15. Yes Jagan has done total wrong everyone will agree but what present govt is doing same as like previous govt AMARAVATHI is not suitable capital now most of people are believing same even Vizag is also not suitable for capital Politicians must realize they must make A cspial interest public for not their personal opinion otherwise u conduct polls for Capital of ANDRA take a decision accordingly whether it is fir capital of ANDR people will decide it is KURNOOL, OR ONGOLE OR GUNTUR, OR RAJMUNDRY OR KAKINADA

    1. 2024 polls people have given clear mandate and verdict on the capital. Jagan said before elections, vizag will be capital if he comes back. CBN /Kootami clearly said Amaravathi will continue to be solo capital. Jagan lost all seats in Vizag city, is the verdict not enough ?

  16. యుద్ధం చేస్తే యుద్ధం చెయ్యాలి లేక పోతే ఇంట్లో ఉండాలి . నేను చేస్తే యుద్ధం ఎదుతోడు చేస్తే వెన్నుపోటు . సూపర్ .మనం మాత్రం విజయవాడలో వరచాలని రాజకీయంగా వదీసుకోవచ్చు . అమరావతి మునిగి పోయింది అని మన మీడియా లో ఇసుకోవచ్చు ఏదోటోడు అలా నోరు మూసుకొని ఉండాలి .మనం చూపించినెహ్దే నీతి . మన నయుకుడు నత్తి పౌకులే మనకి రక్షా

  17. బూతు బ్రా రతి కన్నా వెకిలి పత్రికాధినేత / నేత్రి ఎవరన్నా ఉన్నారా?? దాని బ్రతుకు, పేపర్ అంత రంక్కు బాగోతం !!

  18. హైదరాబాద్ లో చాలా భూమి ఉంది.. హాయిగా కొంత కొనుగోలు చేసి.. కావలసినవి కట్టుకొని.. అక్కడి నించే పాలన చేస్తే పోతుంది.. ఎలాగో ఆంధ్రా వాళ్ళు హైదరాబాద్ ని వదిలి ఉండలేరు కదా.. అందరికీ మధ్య లో అందుబాటులో కూడా ఉంటుంది…

  19. ఈ సొ*ల్లు కబు*ర్లు ఆపి, ముందు జ*గన్ ఎంత వరద సహా*య నిధి కి విరా*ళం ఇచ్చాడో లేక సొంత గా అయిన సరే తన తరపు వి*రాళం ఇచ్చా*డో చె*ప్పు ముందు.

    ఆఖరికి ఉ*ప్పలె బా*లు కూడా వర*ద సహా*యము చేశా*డు, తన వంతు గా.

    కానీ వేల కోట్లు వున్న జగ*న్, ఒక్క రూ*పాయి కాదు కదా, కనీసం అ*న్న పొ*ట్లం కూడా ఇవ్వలేదు. ఏమి బ*తుకు అ*ది!

  20. ఒర్ నువ్వు ఓ ఊహా ప్రపంచం సృష్టించుకుని, ఆ ఊహా ప్రపంచంలో ఉంటూ, నీకు నచ్చింది రాసుకుంటూ నమ్మించాలని నీ తాపత్రయం ..

    రీటైనింగ్ వాల్ చంద్రబాబు గారి ఆలోచన.. ఆయనే 2019 ముందు కట్టింది..

    వార్డులు, పంచాయతీల పేర్లు మార్చి సచివాలయం అని పెట్టాడు ..

    అక్కడ పని చేసింది NDRF, పారిశుధ్య కార్మికులు, ఫైర్ సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు..

    108 రామలింగరాజు గారు తెచ్చింది, 104 చంద్రబాబు గారు తెచ్చింది

    ప్రభుత్వ డాక్టర్లు, మీ తాత బైరేటీస్ గనులు లేపేసిన కాలం నుంచి ఉన్నారు..

    వాడు ఓ చేతకాని వాడివి.. అందుకే వాడి చేతకాని తనం కప్పిపుచ్చడానికి , వేరే వాళ్ళు చేసిన పనులు, వాడివని చెప్పుకుంటూ, స్వయం తృప్తి పడుతుంటారు బులుగు మంద ..

    1. retaining wall alonncha 2009 . YSR/kiran kumar reddy proposed but could ot materialized . CBN could able to allocate funds for phase 1 and did not finished . we had seen floods in 2019 * 2020 ( 6 lakhs cusces ) . many people are movied to relief camps . by 2021 phase 1 , 2 , 3 is completed and in 2022 floods not even a single person was reallocated .

  21. ప్యాలస్ పులకేశి ప్యాలస్ లో కట్టు బానిస పనికి కుదిరిన గ్రేట్ ఆంధ్ర.

    చీ కొట్టిన కూడా ప్యాలెస్ పులకేశి కి చెక్క భజన చేసున్న గ్రేట్ ఆంధ్ర

  22. జగన్ గారిమీద ఈగవాలకుండా ఆయణచేతకానితనాన్ని మీ లాంటి పేటియం బ్యాచ్ గొప్పలవల్ల ఆయన (జగన్) పులకేశిగా మిగిలిపోయిండు

  23. Retaining walls to safeguard these families during the floods has been the plan since 2009. It was Chandrababu Naidu who got a DPR readied for the retaining wall and started construction as well.

    1. CBN plan chestadu ….like Kamaravatho lo Olympics ani Oka vela Kamaravathi lo 2090 lo Olympics ayetya ma Visionary babu mundu chupu ani dappu kottutaharu….

  24. అసలు బుడమేరు కి చంద్రబాబు ఇంటికి ఏమైనా సంబందం ఉందా, ఉంటే అది చూపించగలరా, మేము వస్తాము, బుడమేరు కాలువపై విజయవాడ ఎగువున ఎక్కడ గేట్లు ఉన్నాయే అవి కూడా చూపించండి. లేకపోతే అన్ని మూసుకుని కూర్చోండి.

  25. పాస్పోర్ట్ కోసం జోలె పట్టుకుని అడుక్కునే ఒకే ఒక పార్టీ నాయకుడు ప్యాలస్ పులకేశి గాడే అనుకుంటా, ఈ దేశం లో

Comments are closed.