నెయ్యి ఒక్కటీ మారిస్తే సరిపోతుందా సార్!

తిరుమల శ్రీవారి ప్రసాదంగా భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదానికి ఆధ్యాత్మికంగా ఎంత ప్రాశస్త్యం ఉన్నదో అందరికీ తెలుసు. ఈ లడ్డూ ప్రసాదాల నాణ్యత నానాటికీ దిగజారిపోతున్నదనే ఫిర్యాదులు చాలాకాలంగా ఉన్నాయి. Advertisement…

తిరుమల శ్రీవారి ప్రసాదంగా భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదానికి ఆధ్యాత్మికంగా ఎంత ప్రాశస్త్యం ఉన్నదో అందరికీ తెలుసు. ఈ లడ్డూ ప్రసాదాల నాణ్యత నానాటికీ దిగజారిపోతున్నదనే ఫిర్యాదులు చాలాకాలంగా ఉన్నాయి.

ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. లడ్డూ నాణ్యతను మెరుగుపరుస్తాం అనే మాటతో టీటీడీ కొత్త ప్రయత్నాలు ప్రారంభించింది. నాణ్యమైన నెయ్యిని వాడడం ద్వారా లడ్డూ ప్రసాదాల నాణ్యత మెరుగుపడేలా చేస్తాం అంటున్నారు. లడ్డూ ప్రసాదం నాణ్యతకు కట్టుబడి ఉండడం చాలా మంచిదే. కానీ.. లడ్డూ రుచి, నాణ్యత అంటే కేవలం నెయ్యి మాత్రమే కాదు కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. వైసీపీ హయాంలో ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లను మార్చడం, కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించడం, ఆ ముసుగులో తమ వారిని ప్రోత్సహించడం అనే కార్యక్రమం నిరాటంకంగా జరుగుతోంది.

ఇప్పటికే పోలవరం వంటి భారీ ప్రాజెక్టుల విషయంలో కూడా వైసీపీ జమానాలో పనులు చేసిన వారిని రద్దుచేసి, కొత్తగా టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేశారు. చివరికి టీటీడీ లడ్డూ ప్రసాదాల విషయంలో కూడా నెయ్యి కాంట్రాక్టర్లను మార్చడానికి ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది.

లడ్డూ అంటే కేవలం నెయ్యి మాత్రమే కాదు.. శ్రేష్ఠమైన నెయ్యిని వాడి, మిగిలిన దినుసులు, శెనగపప్పు, యాలకులు, ఎండుద్రాక్ష వంటివి నాసిరకం వాడినా నాణ్యత తీసికట్టు అవుతుంది. అద్భుతమైన నెయ్యివాడాం అని చెప్పుకోవాల్సిందే తప్ప దాని ఫలితం రుచిలో కనిపించదు.

పైగా లడ్డూ నాణ్యత గురించి ఈవో శ్యామలరావు, మెరుగుపరుస్తాం అంటూ వివరాలు వెల్లడించినప్పుడు.. వైసీపీ హయాంలో సామాన్య వ్యక్తులు కూడా బిడ్లు వేసేసి నెయ్యి సరఫరా కాంట్రాక్టులు దక్కించుకున్నారని అంటున్నారు. అంటే ఇప్పుడు సామాన్యులకు కాకుండా పెద్ద సంస్థలకు మాత్రమే కాంట్రాక్టు ఇవ్వాలని తలపోస్తున్నట్టుగా తెలుస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వయంగా డెయిరీ ఉత్పత్తుల వ్యాపారం ఉండడం, ఆ రంగంలో ఆయన కుటుంబానికి గట్టి పరిచయాలు ఉండే నేపథ్యంలో.. ఇప్పుడు పెద్ద సంస్థల ముసుగులో అయినవారికే నెయ్యి కాంట్రాక్టులు కట్టబెడతారనే అనుమానం పుడుతోంది. నెయ్యి కాంట్రాక్టులు ఎవరికిచ్చుకున్నా ఓకే..కానీ మిగిలిన అన్ని దినుసుల నాణ్యత కూడా సమానంగా పట్టించుకోవాలని.. టెండర్ కోట్ చేసేటప్పుడు సరఫరా చేసే నాణ్యతతో ప్రతి లోడ్ వచ్చినప్పుడు నాణ్యతలను తనిఖీచేస్తుండాలని.. అలా అయితే తప్ప.. టీటీడీ గౌరవం కాపాడేలా లడ్డూ ప్రసాదం ఇవ్వలేరని పలువురు అభిప్రాయపడుతున్నారు.

12 Replies to “నెయ్యి ఒక్కటీ మారిస్తే సరిపోతుందా సార్!”

  1. నీవు ఏమి వ్రాస్తున్నావో నీకైనా తెలుస్తుందా. మీ జగన్ లాగా పోలవరం కాంట్రాక్టర్ ని మార్చడంలేదు అని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు గారు తెలియచేసారు కదా. మీ నాయకుడు సెలెక్ట్ చేసిన మేఘా వారితో మిగిలిన పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు కదా. ఎందుకు ఇలాంటి పిచ్చి వ్రాతలు. నీవు ఎంత లేపాలని చూసిన మీ నాయకుని గ్రాఫ్ పెరగదు

  2. లడ్డు రుచి కి శ్రేష్టమైన నెయ్యి నే ప్రధానం. వైసీపీ కల్తీ నెయ్యి వల్ల లడ్లు మూడురోజులకు స్మెల్ వచ్చేవి. ఆంధ్ర లో తయారైన దేశవాళీ ఆవులు, గేదెల నెయ్యి మాత్రమే వాడాలి. జెర్సీ ఆవుల బట్టర్ నుంచి తీసిన నెయ్యి పనికిరాదు. పెరుగు తోడు పెట్టి నెయ్యి తియ్యాలి. ఇంకా పచ్చ కర్పూరం వాడాలి లడ్లు లో. దాని శాతం వైసీపీ బాగా తగ్గించింది. ఇలాచీ కేరళ నుంచి బెస్ట్ క్వాలిటీ నే వస్తుంది అది చాల చీప్. అలానే కిస్మిస్ , జీడిపపప్పు లో ఏమంత తేడా ఉండదు, ఏది గాలి కబుర్లు చెప్పకు.

    1. మిగతావి.. అన్నీ. రకాల వస్తువులు.. నాణ్యత లేని వి.. ఉంటే చాలు. రుచి బహు చక్కని ఆరోగ్యానికి మంచి ది

  3. అంటే ఒప్పుకున్నావ్ కదరా నీ జగన్ గాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నెయ్యి మరియు మిగతా సరకులు అన్ని డూప్లికేట్ వే వడ్యడని… నువ్వు ఎంత చెత్త రాసిన నీ జగన్ గాడి… మీది గ్రాఫ్ నెమ్ ఫెమ్ అన్నీ కింద పడుతూనే ఉంటవి ముందు ముందు మీరే జగన్ గాడినీ ఇంకా కింద పడేస్తర్ర

    మీలాంటి వాళ్ళు చాలా అవసరం,😆

Comments are closed.