విజ‌య‌వాడ‌కు వ‌ర‌ద ముప్పు త‌ప్పిన‌ట్టేనా?

విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద ముంచెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం బుడ‌మేరుకు గండ్లు ప‌డ‌డ‌మే. బుడ‌మేరుకు మొత్తం మూడు గండ్లు ప‌డ్డాయి. తుపాను ప్ర‌భావంతో గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా రెండు రోజుల్లో 40 సెం.మీ పైగా వ‌ర్షం…

విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద ముంచెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం బుడ‌మేరుకు గండ్లు ప‌డ‌డ‌మే. బుడ‌మేరుకు మొత్తం మూడు గండ్లు ప‌డ్డాయి. తుపాను ప్ర‌భావంతో గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా రెండు రోజుల్లో 40 సెం.మీ పైగా వ‌ర్షం కురిసింది. అంతేకాకుండా, ఖ‌మ్మం జిల్లాలో భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో, ఆ నీళ్ల‌న్నీ బుడ‌మేరు వైపు వ‌చ్చాయి. బుడ‌మేరుకు మూడు గండ్లు ప‌డ‌డంతో విజ‌య‌వాడ‌కు వ‌ర‌ద పోటెత్తింది.

ఈ నేప‌థ్యంలో నాలుగు రోజులుగా ఆ గండ్ల‌ను పూడ్చ‌డంలో అధికారులు నిమ‌గ్న‌మ‌య్యారు. ఆర్మీ ఇంజ‌నీర్ల రాక‌తో ప‌నులు వేగ‌వంత‌మ‌య్యాయి. జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు రేయింబ‌వ‌ళ్లు అక్క‌డే వుంటూ, వ‌ర్షంలో త‌డుస్తూ గండ్ల‌ను పూడ్చ‌డాన్ని ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించారు.

ఎట్ట‌కేల‌కు ప్ర‌భుత్వ కృషి ఫ‌లించింది. ఇవాళ్టితో మూడు గండ్ల పూడ్చివేత ప‌రిస‌మాప్త‌మైంది. ఇక‌పై విజ‌య‌వాడ వాసులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేద‌ని అధికారులు తెలిపారు. బుడ‌మేరు గండ్ల పూడ్చివేత‌తో ప్ర‌భుత్వం ఊపిరి పీల్చుకుంది. ఇక‌పై అజాగ్ర‌త్త‌గా వుండ‌కూడ‌ద‌ని అధికారులను ప్ర‌భుత్వ పెద్ద‌లు అప్ర‌మ‌త్తం చేశారు.

బుడ‌మేరే విజ‌య‌వాడ క‌ష్ట‌న‌ష్టాల‌కు కార‌ణ‌మ‌ని అంద‌రూ అంటున్నారు. అయితే బుడ‌మేరు గండ్ల‌కు మీరంటే మీరే కార‌ణ‌మ‌ని అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు తిట్టుకున్న సంగ‌తి తెలిసిందే.

9 Replies to “విజ‌య‌వాడ‌కు వ‌ర‌ద ముప్పు త‌ప్పిన‌ట్టేనా?”

  1. For any drain annual maintance is critical. You should check and fix the walls. My family used to take up these contracts in the past. Last5 years all those works stalled and not billed. So people paying the price.

  2. ఏంటి విజయవాడ మునకకు కారణం బుడమేరా ? ఖమ్మం లో పడిన వర్షాలా ? అదేంటి కృష్ణ వరద నీటి ని బుడమేరు ‘నది’ లోకి తరలించలేదా?

Comments are closed.