ఆదర్శాలను అటకెక్కించిన కమలదళం!!

భారతీయ జనతా పార్టీ, ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయంగా చాలా చాలా ఆదర్శాలను వల్లిస్తూనే ఉంటారు. ప్రాంతీయ పార్టీలు ప్రకటించే సంక్షేమ పథకాల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తన అభ్యంతరాలను వినిపిస్తుంటారు.…

భారతీయ జనతా పార్టీ, ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయంగా చాలా చాలా ఆదర్శాలను వల్లిస్తూనే ఉంటారు. ప్రాంతీయ పార్టీలు ప్రకటించే సంక్షేమ పథకాల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తన అభ్యంతరాలను వినిపిస్తుంటారు. ఈ దేశంలో చాక్లెట్ రాజకీయం నడవరాదు’ అని మోడీ పలు సందర్భాలలో ఎద్దేవా చేయడం కూడా మనం గమనించాం.

పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా బిజెపి ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్త పడింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మేనిఫెస్టోను విడుదల చేస్తే ఆ మ్యానిఫెస్టోతో తమకు సంబంధం లేదు అన్నట్లుగా బిజెపి వ్యవహరించింది. అందులో ఉన్న అనేక తాయులాలకు తాము పూచి తీసుకోవడం లేదు అన్నట్లుగా వారు నిరూపించుకున్నారు.

కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇలాంటి ఆదర్శాలన్నింటిని కట్టగట్టి అటక మీద పెట్టింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న సమయంలో అక్కడ కాస్తయినా పరువు దక్కేలాగా ఎమ్మెల్యే సీట్లు దక్కించుకోవాలని ఆరాటంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. అధికారంలోకి రావాలి లేదా కనీసం గణనీయంగా సీట్లు దక్కితే మాత్రమే ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తమ నిర్ణయానికి ప్రజామోదం ఉన్నదనే నమ్మకం దేశానికి వాళ్లు కలిగించగలరు. లేకపోతే పరువు పోతుంది. ఇలాంటి సంక్లిష్టతల మధ్య అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్న బిజెపి తమ మేనిఫెస్టోలో విచ్చలవిడిగా తాయిలాలను ప్రకటించడం గమనార్హం.

‘మా సన్మాన్ యోజన’ అనే పేరుతో ప్రతి కుటుంబంలోని సీనియర్ మహిళకు ఏడాదికి 18 వేల రూపాయలు ఉచితంగా ఇస్తాం అనే పథకాన్ని బిజెపి ప్రకటించింది. అలాగే ఉజ్వల పథకం కింద ప్రతి ఇంటికి రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తామని కూడా పేర్కొన్నది. పదవ తరగతి విద్యార్థులకు టాబ్లెట్లు, లాప్ టాప్ లు అందిస్తామని ప్రకటించింది. 5 లక్షల ఉద్యోగాలు కల్పన అనేది మరొక హామీ.

అయితే బీజేపీ నుంచి ఇలాంటి తాయిలాల హామీలను ప్రజలు ఊహించలేదు. ఒక్క ఆర్టికల్ 370 విషయంలో మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లుగా వాళ్ళు మేనిఫెస్టో విడుదల సమయంలో కూడా వ్యవహరించారు. 370 అనేది ముగిసిపోయిన చరిత్ర అంటూ అమిత్ షా వ్యాఖ్యానించడం విశేషం. భారతీయ జనతా పార్టీ అక్కడ నెగ్గినా నెగ్గిపోయినా- ఓట్ల కోసం అక్కడ ప్రకటించిన హామీలను దేశవ్యాప్తంగా కూడా అమలు చేయడానికి వాళ్ళు కట్టుబడి ఉండాలి కదా అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతుంది.

అలా చేయకపోతే దేశమంతా హిందూ ఓటు బ్యాంకు గనుక తమకే పడుతుందనే అహంకారంతో సంక్షేమ పథకాలను చిన్న చూపు చూస్తున్నారని.. జమ్మూ కాశ్మీర్లో ముస్లిం ఓటు బ్యాంకు అధికంగా ఉంటుంది గనుక ఇలాంటి తాయిలాలతో వారిని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారని ప్రజలు అనుకోవాల్సి ఉంటుంది.

10 Replies to “ఆదర్శాలను అటకెక్కించిన కమలదళం!!”

  1. ఆంధ్రా గారు అర్జెంటుగా వచ్చి బీజేపీ చేసే పనిని ఎలా సమర్థించాలో తెలియక వెంటనే కుటుంబపార్టీలు అంటూ తిట్టాలి. ప్రస్తుతం పొత్తులో ఉన్నారు కాబట్టి మళ్ళీ టీడీపీకి ఆ తిట్లు తగలకుండా ఎలా తిట్టాలో తెలియక ఇంక జగన్ ని తిట్టాలి…… సార్ మీ యొక్క పక్షపాత ధోరణి కలిగిన కామెంట్స్ మిస్ అవుతున్నాం…… Please post your diversion politics kind of comments here ASAP

    1. ఆర్టికల్ లో విషయం లేదు, ఇక్కడ నెల కి ₹4000 చొప్పున ఏడాది కి నలభై ఎనిమిది వేలు ఇస్తున్నారు, అక్కడ సీనియర్ మహిళ కి మాత్రమే పద్దెనిమిది వేలు చెబుతున్నారు. ఒక ఉగ్రవాదం రాష్ట్రం, సరిహద్దు రాష్ట్రం లో లాప్టాప్ లు ఇస్తే మంచిదే కదా!

      1. ఇలాంటి అడ్డగోలు సమర్ధనలు మీరు తప్ప ఇంకెవరూ చేయలేరు, అందుకనే మిమ్మల్ని మాత్రమే కామెంట్ కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది. థాంక్యూ సోమచ్ సార్

      2. ఎవరు ఎక్కువగా ఇస్తున్నారు అనేది ఇక్కడ మ్యాటర్ కాదు! చాకోలెట్ రాజకీయాలు చేయము అని గొప్పగా చెప్పుకొనే తాతగారు ఇప్పుడు అదే పని చేస్తున్నారు అనేది ఆర్టికల్ లో విషయం. కానీ మీరు అ *డ్డ *గో *లు *గా సమర్ధిస్తారు అనే మిమల్ని కామెంట్ కోసం అభ్యర్ధించటం జరిగింది. మా అభ్యర్థన మన్నించినందుకు ధన్యవాదములు 🙏

  2. మనం అలా బిజేపీ మీద కా మెంట్ చేయకూడదు. నీతిగా ఉంటే 2 సీట్లు ఇస్తారు, నీతి వదిలేస్తేనే జనాలు గెలిపిస్తున్నారు అని భక్తులు ఎన్నో సార్లు ఇక్కడ రాశారు.

  3. సీనియర్ మహిళ అంటే మరి ఇక్కడ నెలసరి పెన్షన్ యే ఇస్తున్నారు కదా, మీరు మరీ గోరంతలు కొండంత లు చేసి చెప్పడం కాకపోతే!

  4. దేశం లో డబ్బు మొత్తం తీసుకెళ్ళి కాశ్మీర్ లో పెట్టండి.. పరువు కాపాడుకోండి.. దేశ ప్రజలు ఇంకా ఎన్ని త్యాగాలకేనా సిద్దంగా ఉన్నారు…

Comments are closed.