దర్శన్ కు వినాయక చవితి కానుక

వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ఏ-2 నిందితుడిగా ఉన్న దర్శన్ కు జైల్లో వినాయక చవితి కానుక దక్కింది. బళ్లారి సెంట్రల్ జైలు అధికారులు అతడికి టీవీని ఏర్పాటు చేశారు. 32 ఇంచీల టీవీని…

వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ఏ-2 నిందితుడిగా ఉన్న దర్శన్ కు జైల్లో వినాయక చవితి కానుక దక్కింది. బళ్లారి సెంట్రల్ జైలు అధికారులు అతడికి టీవీని ఏర్పాటు చేశారు. 32 ఇంచీల టీవీని అతడి సెల్ లో అమర్చారు. ఇకపై అతడు రోజూ టీవీ చూడొచ్చు.

తన కేసుకు సంబంధించి అప్ డేట్స్ కోసం, జైలు బయట జరుగుతున్న వ్యవహారాలు తెలుసుకునేందుకు తనకు టీవీ కావాలంటూ వారం కిందటే అధికారులకు అర్జీ పెట్టుకున్నాడు దర్శన్. రూల్స్ ప్రకారం, అతడికి టీవీ ఇవ్వొచ్చు. కాకపోతే జైల్లో టీవీల కొరత ఉంది. దీంతో ఒక టీవీని రిపేర్ చేసి అతడి సెల్ లో అమర్చడానికి ఇన్ని రోజులు పట్టింది.

ఇంతకుముందే అతడికి సర్జికల్ ఛైర్ ను ఇచ్చారు. సెల్ లో ఉన్న ఇండియన్ స్టయిల్ టాయిలెట్ ను వాడడం ఇబ్బందిగా ఉందని కోరడంతో, అతడికి ఆ ఛైర్ ను కేటాయించారు.

తన సొంత డబ్బుతో జైలు క్యాంటీన్ లో సౌకర్యాలు పొందే అవకాశాన్ని కూడా దర్శన్ కు కేటాయించారు. ఇందులో భాగంగా దర్శన్ ఎకౌంట్ లో 35వేల రూపాయల్ని అతడి కుటుంబ సభ్యులు జమ చేయగా.. జైళ్లో కాఫీ, చిరుతిండ్ల కోసం అతడు ఇప్పటికే 735 రూపాయలు ఖర్చు చేశాడు. ఇవి కాకుండా పరిమితంగా ఫోన్ కాల్స్ చేసుకునే సౌలభ్యాన్ని కూడా దర్శన్ కు కల్పించారు.

తాజాగా దర్శన్ పై బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్ వేసిన సంగతి తెలిసిందే. 3991 పేజీల భారీ ఛార్జ్ షీటులో దర్శన్-పవిత్రతో పాటు మిగతా 15 మంది నిందితులపై 200 సాక్ష్యాధారాల్ని ప్రవేశపెట్టారు. వీటిలో అత్యంత కీలకమైన రక్తపు మరకల సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. సోమవారం దర్శన్ బెయిల్ పిటిషన్ పై మరోసారి విచారణ జరుగుతుంది.

5 Replies to “దర్శన్ కు వినాయక చవితి కానుక”

  1. అంటే ఇప్పుడప్పుడే విడుదల అయ్యేది లేదని డిసైడ్ అయిపోయారా ఏంటి???

Comments are closed.