విజయవాడ మళ్లీ గజగజ

ఓ పక్క సోషల్ మీడియా, సామాజిక మీడియా చంద్రబాబు భజ‌నతో తరిచిపోతున్నాయి. నిజానికి ఓ సిఎమ్ గా చంద్రబాబు బాగానే వర్క్ చేస్తున్నారు. నూటికి నూరు శాతం మార్కలు వేసేయచ్చు. అందులో అనుమానం లేదు.…

ఓ పక్క సోషల్ మీడియా, సామాజిక మీడియా చంద్రబాబు భజ‌నతో తరిచిపోతున్నాయి. నిజానికి ఓ సిఎమ్ గా చంద్రబాబు బాగానే వర్క్ చేస్తున్నారు. నూటికి నూరు శాతం మార్కలు వేసేయచ్చు. అందులో అనుమానం లేదు. కానీ తెలుగుదేశం అనుకుల సోషల్ మీడియా అతి ప్రచారం చూస్తుంటే మాత్రం వెగటు పుట్టించేస్తోంది.

బాబు అడుగేస్తే సూపర్, బాబు అక్కడే వున్నా సూపర్ అంటూ మామూలు భజ‌న కాదు. సరే అ ముచ్చట అలా వుంటే శనివారం మధ్యాహ్నం నుంచి మళ్లీ విజయవాడలో వర్షాలు మొదలయ్యాయి. బుడమేరు గండ్లు పూడ్చారు చాలా వరకు అనుకుంటే వీధుల్లో నీళ్ల మట్టం మళ్లీ పెరగడం మొదలైపోయింది.

ఎవరి ఇళ్లు వాళ్లు క్లీన్ చేసుకుంటున్నారు. వీధులను ఫైర్ ఇంజ‌న్లతో క్లీన్ చేయిస్తున్నారు అనుకుంటే, మళ్లీ బుదర వ్యవహారం మొదలైంది. పల్లపు ప్రాంతాల జ‌నం మళ్లీ తలలు పట్టుకుంటున్నారు. ఇక ఒకేసారి కడుక్కుందాం అని ఇళ్లకు తాళాలు వేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బాబుగారు వచ్చారు, డ్యామ్ లు పొంగి పొర్లుతున్నాయి అని ప్రచారం చేసుకుందాం అనుకుంటే అతి వర్షాలు కొంప ముంచుతున్నాయి.

విజయవాడలో ఇప్పుడిప్పుడే కొత్త వెంచర్లు వేసి, హడావుడి చేద్దాం అనుకున్నవారికి ఈ వర్షాలు భలే షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఏ ఏరియాలు అయితే నీట మునిగాయో, అ ఏరియాలు అన్నింటిలో అనేక కొత్త వెంచర్లు వున్నాయి. అవన్నీ ఇప్పుడు పక్కన పెట్టాల్సిందే.

25 Replies to “విజయవాడ మళ్లీ గజగజ”

  1. భలే shock ఇస్తున్నాయా GA….😂😂….అసలు మీరు చూపించే పైశాచిక ఆనందం చూసి భైరవ గాడు కూడా సిగ్గు పడుతాడేమో GA….🙏🙏

  2. Retaining walls to safeguard these families during the floods has been the plan since 2009. It was Chandrababu Naidu who got a DPR readied for the retaining wall and started construction as well…

  3. R_etaining walls to safeguard these families during the floods has been the plan since 2009. It was Chandrababu Naidu who got a DPR readied for the retaining wall and started construction as well.

Comments are closed.