సినిమా ప్రారంభించడానికి ముందే బడ్జెట్ రఫ్ గా ఇంత అని అనుకోవడం కామన్. దానికి ఓ పదిశాతం అటే అవుతుంది. అది కూడా కామన్. కానీ ఇప్పుడు లైమ్ లైట్ లో వున్న చాలామంది మాస్ డైరక్టర్లు అన్న బడ్జెట్ కన్నా పాతిక శాతం అదనంగా ఖర్చు చేయించేస్తున్నారు. అయినా నిర్మాతలు ఆఫ్ ది రికార్డుగా తిట్టుకోవడం లేదా దగ్గర వాళ్ల దగ్గర చెప్పుకుని వాపోవడం తప్ప చేసేదేమీ లేదు. ఏమన్నా అంటే హీరోల దగ్గరకు వెళ్లి నిర్మాతల మీదే కంప్లయింట్ ఇచ్చే పరిస్థితి కూడా వుంది. దాంతో అనవసరపు కమ్యూనికేషన్ గ్యాప్ లు తప్పవు.
గోపీచంద్ మలినేని, బాబీ, శ్రీకాంత్ ఓదెల, ఇలా చాలా మందిపేర్లు ఇండస్ట్రీలో వినిపిస్తుంటాయి ఖర్చు బడ్జెట్ ను దాటించేసే దర్శకుల పేర్లలో. పదిశాతం అంటే పెద్ద ఫరక్ కాదు. కానీ మరీ అది కూడా దాటితేనే సమస్య.
దసరా సినిమా టైమ్ లో ఈ బడ్జెట్ మీదనే దర్శకుడు- నిర్మాత చాలా కిందా మీదా పడ్డారు. పైకి ఎన్ని ఖండనలు ఇచ్చినా, దసరా టైమ్ లో ఏం జరిగింది అన్నది ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాలకు తెలుసు. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ తో సినిమా స్టార్ట్ అవుతోంది. ఈ సారి బడ్జెట్ 120 కోట్లు అని వినిపిస్తోంది. ఈ సినిమాకు హీరో నాని రెమ్యూనిరేషన్ నే 35 కోట్లు అని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల సమాచారం. అంతే కాదు ఈ సారి సినిమా చాలా భారీ ఖర్చుతో కూడుకున్న సినిమా అని తెలుస్తోంది. అంటే కనీసం పది నుంచి ఇరవై శాతం అదనంగా వేసుకున్నా, కాస్త అటు ఇటుగా 150 కోట్ల దగ్గరకు చేరుకునే అవకాశం వుంది.
సినిమా సినిమాకు నాని నాన్ థియేటర్ మార్కెట్ పెరుగుతోంది కానీ థియేటర్ మార్కెట్ కాదు. సరిపోదా శనివారం సినిమాను ఏపీలో 15 కోట్ల మేరకు మార్కెట్ చేయలేక, చివరకు 12 నుంచి 13 కోట్ల రేంజ్లో మార్కెట్ చేసారు. సీడెడ్ 5.40 కోట్లకు ఇస్తే రెండు కోట్ల నష్టం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల ఎంత దసరా కాంబినేషన్ అయినా బడ్జెట్ ను ముందు నుంచి కాస్త అదుపులో పెట్టుకుని వెళ్లడం చాలా అవసరం. ఈ విషయంలో నిర్మాత సుధాకర్ చెరుకూరి కన్నా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని నే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
నాని రెమ్యునరేషన్ 35 కోట్ల వామ్మో అసలు ఏ సినిమా వీడిది కనీసం 45 కోట్లు కలెక్ట్ చేసింది అసలు వీడి సినిమా కమర్షియల్ హిట్ అయ్యు దాదాపు 7 ఏళ్ళు అయుంది.
సినిమా రిలీజ్ అయ్యాక అందులో పదో వంతయినా వస్తుందా?
Call boy works 8341510897
ఎంత బడ్జెట్ పెట్టినా మేం థియేటర్లో చూడం
120 అంటే 150 అవుతుందో లేదో గాని, 1 7 5 అంటే 1 1 ఐయ్యింది
నాని కి బడి ఏడుస్తుంటావు ఏంటిరా బాబు అప్పుడప్పుడు అన్న న్యూస్ పాజిటివ్ గా రాయడం నేర్పుకో సన్నాసి
Great Andra vidi news yeppudu negative gane untai. Positive ga undali ante vallu vidiki ycp ki nachali
Great Andra sakshi news rendu okate .