జైలర్ విలన్ అరెస్ట్

రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాతో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్న విలన్ పాత్రధారి వినాయగన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. Advertisement ఓ సినిమా…

రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాతో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్న విలన్ పాత్రధారి వినాయగన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని గోవా వెళ్లే క్రమంలో హైదరాబాద్ లో దిగాడు వినాయగన్. ఆ టైమ్ లో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద అతడు చేయి చేసుకున్నాడనేది ఫిర్యాదు. పైగా ఆ సమయంలో వినాయగన్ మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది.

దీంతో సీఐఎస్ఎఫ్ పోలీసులు వినాయగన్ ను అదుపులోకి తీసుకొని శంషాబాద్ పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తోంది. జరిగిన ఘటనపై వినాయగన్ స్పందించాడు. తను ఏ తప్పు చేయలేదని, ఏ కారణం లేకుండా తనను ఎందుకు గదిలోకి తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదన్నాడు.

సీసీటీవీ ఫూటేజ్ చెక్ చేయాలని, తను ఎలాంటి తప్పు చేయలేదని అతడు వాదిస్తున్నాడు. వినాయగన్ కు వివాదాలు కొత్త కాదు. గతంలో ఇతడు ఇలాంటి దాడి కేసులోనే అభియోగాలు ఎదుర్కొన్నాడు.

4 Replies to “జైలర్ విలన్ అరెస్ట్”

  1. ఇతను ఎంత గొప్ప నటుడంటే, జైలర్ సినిమాలో చేసిన పాత్రలో లీనమైపోయి నిజ జీవితంలో కూడా ఆ పాత్ర నుండి బయటకు రాలేక పోతున్నాడు…

    ఇప్పుడదే జైలు పాలయ్యాడు పాపం

Comments are closed.