అన్నింటి కంటే ముందు రెడీ?

సంక్రాంతికి ఆల్రెడీ కొన్ని సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. వీటిలో ఎన్ని వస్తాయి, ఎన్ని డ్రాప్ అవుతాయనే విషయాన్ని పక్కనపెడితే.. అలా సంక్రాంతికి రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమాల్లో ముందుగా రెడీ అయ్యేది మాత్రం…

సంక్రాంతికి ఆల్రెడీ కొన్ని సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. వీటిలో ఎన్ని వస్తాయి, ఎన్ని డ్రాప్ అవుతాయనే విషయాన్ని పక్కనపెడితే.. అలా సంక్రాంతికి రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమాల్లో ముందుగా రెడీ అయ్యేది మాత్రం వెంకటేష్ సినిమానే.

అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేస్తున్నారు వెంకీ. అనీల్ రావిపూడి సినిమా మేకింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పక్కాగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటాడు, అనుకున్న టైమ్ కంటే కాస్త ముందే షూట్ పూర్తిచేస్తాడు.

వెంకీతో చేస్తున్న సినిమాను కూడా అంతే వేగంగా పూర్తి చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తిచేశాడు. ఈ షెడ్యూల్ లో కీలకమైన ఇంటర్వెల్ బ్లాక్ తో పాటు.. వెంకటేష్-ఐశ్వర్య రాజేశ్ మధ్య ఓ ఫ్యామిలీ సాంగ్ ను కూడా షూట్ చేశారు.

చూస్తుంటే.. సంక్రాంతి బరిలో అన్ని సినిమాల కంటే ముందు వెంకీ సినిమానే రెడీ అయ్యేలా కనిపిస్తోంది. చిరంజీవి విశ్వంభర రేసులో ఉన్నప్పటికీ, ఈ సినిమాకు చాలా సీజీ వర్క్ నడుస్తోంది. రవితేజ సర్జరీ కారణంగా షూటింగ్స్ కు గ్యాప్ ఇచ్చాడు.

సో.. సంక్రాంతి బరిలో నిలిచేందుకు అనీల్ రావిపూడి-వెంకీ సినిమా శరవేగంగా సిద్ధమౌతోంది. ఇప్పటికే కావాల్సినంత మెటీరియల్ షూట్ చేశారు. కావాలనుకుంటే అక్టోబర్ నుంచే ప్రచారం మొదలుపెట్టుకోవచ్చు.

9 Replies to “అన్నింటి కంటే ముందు రెడీ?”

    1. అనిల్ రావిపూడి సినిమా అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అవేరేజ్ అయినా అవుతుంది. లేటెస్ట్ NBK చూసారు గా!

Comments are closed.