40 యేళ్ల వ‌య‌సులోపు తెలుసుకోవాల్సిన జీవిత‌పాఠాలు!

జీవితం చాలా పాఠాల‌ను నేర్చుకోకుండానే నేర్పిస్తుంది. అయితే కొన్ని పాఠాల విష‌యంలో మ‌నం రియ‌లైజ్ కాలేం! వాటిని అంగీక‌రించ‌లేం. అయితే ప్ర‌తి వ‌య‌సుకు త‌గ్గ‌ట్టుగా అంగీక‌రించాల్సిన విష‌యాలు ఎన్నో ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవ‌డ‌మే…

జీవితం చాలా పాఠాల‌ను నేర్చుకోకుండానే నేర్పిస్తుంది. అయితే కొన్ని పాఠాల విష‌యంలో మ‌నం రియ‌లైజ్ కాలేం! వాటిని అంగీక‌రించ‌లేం. అయితే ప్ర‌తి వ‌య‌సుకు త‌గ్గ‌ట్టుగా అంగీక‌రించాల్సిన విష‌యాలు ఎన్నో ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవ‌డ‌మే ప‌రిణ‌తి చెంద‌డం. మ‌రి ప్ర‌తి వ‌య‌సుకూ బోధ‌ప‌డే ర‌క‌ర‌కాల విష‌యాలు ఉన్న‌ట్టుగానే మ‌నిషి న‌ల‌భై యేళ్ల వ‌య‌సుకు వ‌చ్చేస‌రికి అర్థం చేసుకోవాల్సిన విష‌యాలూ కొన్ని ఉంటాయి.

ప‌ర్ఫెక్ష‌న్ కోసం పాకులాడొద్దు!

40 యేళ్ల‌లోకి వ‌చ్చేస‌రికి మ‌నిషి అర్థం చేసుకోవాల్సిన విష‌యాల్లో ఒక‌టి ప‌ర్ఫెక్ష‌న్ కోసం అతిగా పాకూలొడొద్దు అనేది! ఏ విష‌యంలో అయినా స‌రే, అంత‌వర‌కూ మీరు చాలా సార్లు ప‌ర్ఫెక్ష‌న్ కోసం ట్రై చేసి ఉంటారు. అప్ప‌టి వ‌ర‌కూ అది మీకు సాధ్య ప‌డ‌క‌పోవ‌డం వ‌ల్ల ఇప్పుడు కూడా అలాంటి ప్ర‌య‌త్నాల్లోనే ఉంటారు. అయితే ఈ వ‌య‌సుకు వ‌చ్చేసరికి తాము ఏ విష‌యంలో ప‌ర్ఫెక్ట్ గా ఉండగ‌ల‌ము, మ‌రే విష‌యంలో ప‌ర్ఫెక్ష‌న్ కోసం ఇంకా పాకులాడుతున్నామో గుర్తించి, అప్ప‌టికీ సాధ్యం కాని ప‌ర్ఫెక్ష‌న్ కోసం పాకులాడ‌క‌పోవ‌డం మంచిది. కొన్నింటిని యాక్సెప్ట్ చేసి ప్ర‌శాంత‌త‌ను అల‌వ‌రుచుకోవాల్సిన వ‌య‌సు ఇది!

స‌మ‌యం విలువ తెలిసే ఉండాలి!

ఏ వ‌య‌సు వారికి అయినా స‌మ‌యం చాలా విలువైన‌దే. అయితే 40ల‌కు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వారు ఈ విష‌యాన్ని మ‌రింత‌గా గ్ర‌హించ‌గ‌ల‌గాలి. 40ల‌కు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నారంటేనే.. ఏ విష‌యంలో అయినా స‌మ‌యం చాలా విలువైన‌ది అని బోధ‌ప‌డే ఉండాలి. స‌మ‌యాన్ని ప్రొడ‌క్టివ్ గా వాడుకోవ‌డం గురించి అయినా, దాన్ని అర్థ‌వంతంగా గ‌డ‌ప‌డం గురించి అయినా, మ‌నుషుల‌తో గ‌డ‌ప‌డం గురించి అయినా.. స‌మ‌యం విలువ ఎంతో అర్థం అయ్యేలా చేసే, అర్థం చేసుకోవాల్సిన వ‌య‌సు ఇది!

పోరాడే దృక్ఫ‌థం!

ఏదైనా ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు విఫ‌లం అయ్యామ‌నే భావ‌న‌తో వ‌దిలేస్తూ ఉంటాం. అయితే కొంద‌రు చిన్న వ‌య‌సులోనే తిరిగి ప్ర‌య‌త్నించ‌డం అనే కాన్సెప్ట్ ను అర్థం చేసుకుని ఉంటారు. ఒక‌సారి విఫ‌లం అయినా మ‌రోసారి తిరిగి పోరాడే త‌త్వం కొంద‌రికి చిన్న వ‌య‌సులోనే ఉండ‌వచ్చు. అయితే ఎవ‌రికైనా 40ల‌కు ద‌గ్గ‌ర‌ప‌డేస‌రికి అలాంటి పోరాడే త‌త్వం అల‌వాటై ఉండాలి. ఆ వ‌య‌సులో చేసే కొత్త ప్ర‌య‌త్నాల విష‌యంలో అయినా స‌రే.. విఫ‌లం అయినా తిరిగి పోరాడ‌గ‌ల త‌త్వం అల‌వ‌రుచుకుని ఉండాలి ఈ వ‌య‌సుకు వ‌చ్చే స‌రికి.

ప్ర‌జెంట్ లో జీవించ‌డం!

క‌నీసం ఈ వ‌య‌సుకు అయినా వ‌ర్త‌మానంలో జీవించే త‌త్వం అల‌వ‌రుచుకోవాలి. ఫ్యూచ‌ర్ గురించి ఆలోచిస్తూనో, పాస్ట్ గురించి ఆలోచిస్తూనే.. చింత‌న‌లు చేసే తీరు త‌ప్ప‌క అయినా మార్చుకోవాల్సిన వ‌య‌సు అది. ప్ర‌జెంట్ లో జీవించ‌డం అంటే జీవితాన్ని నిస్సందేహంగా ఆస్వాధిస్తున్న‌ట్టు. అలాంటి తీరును త‌ప్ప‌నిస‌రిగా అయినా అల‌వ‌రుచుకోవాల్సిన వ‌య‌సు ఇది.

చేసే ప‌నిలో నిపుణ‌త‌!

చేసే ప‌ని, చేప‌ట్టిన వృత్తి ఏదైనా స‌రే.. ఈ వ‌య‌సుకు వ‌చ్చేస‌రికి దానిలో నైపుణ్యం సొంత‌మై ఉండాలి. ఒకే ప‌ని చేయ‌డానికి గ‌తంలో తీసుకునే స‌మ‌యానికి ఇప్పుడు తీసుకునే స‌మ‌యానికి వ్య‌త్యాసం ఉండాలి. అదే నిపుణ‌త‌. అలాంటి నైపుణ్యాల‌ను అల‌వ‌రుచుకోవాలి. చేసే ప‌ని మాన‌సిక ఒత్తిళ్ల‌కు కార‌ణం కాకూడ‌దు. అలాంటి ధోర‌ణిని అయినా అల‌వ‌రుచుకోవాలి, లేదా ప‌నిని అలా సుల‌భంగా అయినా చేయ‌గ‌ల‌గాలి! ఇదీ అప్ప‌టి వ‌ర‌కూ అనుభ‌వం నేర్పించిన పాఠం.

ఆరోగ్యంపై శ్ర‌ద్ధ‌!

అప్ప‌టి వ‌ర‌కూ కూడా ఆరోగ్యంపై శ్ర‌ద్ధ‌తో వ్యాయామం చేయ‌డంతో పాటు, డైట్ విష‌యంలోనూ బాడీకి సెట్ అయ్యే నియ‌మాల‌ను పెట్టుకుని ఉండ‌టం మంచిదే. లేక‌పోతే అప్పుడైనా అల‌వ‌రుచుకోవాలి. రెగ్యుల‌ర్ ఎక్సర్ సైజ్, డైట్ నియ‌మాల‌ను త‌ప్ప‌క క‌లిగి ఉండాల్సిన వ‌య‌సు ఇదే! ఇక్క‌డ నుంచి మొద‌లుపెడితే, ఆపై అనారోగ్య స‌మ‌స్య‌ల తీవ్ర‌త త‌గ్గుతుంది.

మంచి స్నేహితులు, మెంట‌ర్!

జీవితంపై సానుకూల దృక్ప‌థాన్ని అల‌వ‌ర‌చ‌గ‌ల స్నేహితులు కావొచ్చు, అలాంటి మెంట‌ర్ ఒక‌రు కావొచ్చు.. ఈ పాటికి సంపాదించుకుని ఉండాలి. లేనిపోని రిస్క్ ల‌లోకి తీసుకెళ్లే స్నేహాలేవీ, ఏ స్నేహాల‌తో ప్ర‌శాంత‌త ఉంటుందో గ్ర‌హించుకుని అలాంటి స‌ర్కిల్ ను క‌లిగి ఉండాల్సిన వ‌య‌సు ఇది.

3 Replies to “40 యేళ్ల వ‌య‌సులోపు తెలుసుకోవాల్సిన జీవిత‌పాఠాలు!”

Comments are closed.