ఈద‌క‌పోతే వైసీపీకి మున‌కే

ఇక పార్టీ, ముందు విభిన్న గొంతుల్ని వినిపించ‌నివ్వండి. న‌లుగురితో మాట్లాడండి, మాట్లాడ‌నివ్వండి.

మ‌న కోడి కూయ‌క‌పోతే తెల్లార‌దా? అని ఒక సామెత‌. టీవీ ఛానెళ్ల‌లో డిబేట్ల‌కి త‌మ పార్టీ త‌ర‌పున ఒక లిస్ట్ ఇచ్చింది వైసీపీ, ఈ మ‌ధ్య పార్టీ అంత‌ర్గ‌త విష‌యాల‌ను విమ‌ర్శించిన ర‌విచంద్రారెడ్డి పేరు అందులో లేదు. స‌జ్జ‌ల‌ని విమ‌ర్శించినందువ‌ల్లే ఇది జ‌రిగింద‌ని సోష‌ల్ మీడియా చ‌ర్చ‌.

ఇదంతా కాదు కానీ, జ‌గ‌న్ సొంత మీడియా సాక్షి ఏం చేస్తా వుంది అని ఆలోచిస్తే అది జ‌గ‌న్‌కి మంచి ఎలాగూ చెప్ప‌లేదు. అంత ధైర్యం, అంత‌ర్గ‌త విష‌యాల‌ని విమ‌ర్శించే శ‌క్తి ఆ మీడియాకి లేదు. ఎందుకంటే అక్క‌డ సొంత అభిప్రాయాలు తార్కికంగా ఆలోచించే జ‌ర్న‌లిస్టులు ఎవ‌రూ లేరు. అంద‌రికీ జీతం ఇచ్చేది జ‌గ‌నే కాబ‌ట్టి వాళ్లు జ‌గ‌న్‌ని పొగుడుతూ, వుందిలే మంచి కాలం అని పాడుతూ , జ‌గ‌న్ ద‌య‌త‌లిస్తే వుద్యోగాన్ని పొడిగించుకుంటూ, లేదంటే రిటైరై ఇంటికి దారి వెతుక్కుంటూ వుండాల్సిందే.

ఈ 57 నెల‌లు (2029లో ఎన్నిక‌లు) సాక్షి మీడియా ఏం చేస్తుందంటే చంద్ర‌బాబు లోపాలు, వైఫ‌ల్యాలు, పాపాలు, మోసం ఇలాంటి ప‌దాల మీద ఆధార‌ప‌డుతూ వార్త‌లు వండుతూ వుంటుంది. అందులో ఉప్పుకారం వుండ‌వు. వైసీపీ అభిమానులైన కొంద‌రు ర‌క్త‌పోటు రోగుల‌కి అది స‌రైన ఆహారం. లేదంటే లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం మీద రాజ‌కీయ మ‌జిలీ క‌థలు రాసుకోవాలి. ప‌వ‌న్ మీద రాయ‌డానికి ఏమీ లేదు. ఎందుకంటే ఈ ఐదేళ్లు ఆయ‌న ఏమీ చేయ‌డ‌నే క్లారిటీ ప‌వ‌న్‌కే వుంది.

మ‌రేం చేయాలి? సాక్షిని భ‌రించాల్సిందే. అదే లేక‌పోతే జ‌గ‌న్‌కి సుప్ర‌భాత సేవ‌, కీర్త‌న‌గానం చేసేవాళ్లు ఎవ‌రూ వుండ‌రు. ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు వ‌దిలే గ్యాస్‌కి స‌రిప‌డా మాస్క్‌లు వైసీపీ ద‌గ్గ‌ర లేదు. త‌యారీ రాదు. ఆత్మాహుతి ద‌ళం లాంటి సోష‌ల్ మీడియా వుంది క‌దా అంటే, వుండేది, ఇపుడంత లేదు. జ‌గ‌న్ కోసం బ‌ట్ట‌లు చించుకుంటే మానం పోవాల్సిందే త‌ప్ప‌, గ‌జం సైనుగుడ్డ కూడా కొని, మ‌న మాన సంర‌క్ష‌ణ చేసే అవ‌కాశం లేదు. ఒక‌వేళ 2029లో అధికారంలోకి వ‌స్తే (ఇప్ప‌టిలాగే ఇంకో నాలుగేళ్లు పార్టీ వ‌ర్ధిల్లితే 29కి కాదు 49కి కూడా రాదు. 29 వైసీపీకి ఆఖ‌రి ఎన్నిక‌ల సంవ‌త్స‌రం) అప్పుడు కూడా జ‌గ‌న్ చుట్టూ అర డ‌జ‌ను మంది దుడ్డు క‌ర్ర‌ల‌తో నిల‌బ‌డి, జై జ‌గ‌న్ అంటే కూడా చావ‌బాదుతారు. ఈ ఐదేళ్లు అంద‌రికీ అనుభ‌వ‌మే. జ‌నం జ‌గ‌న్ ద‌గ్గ‌రికి రాలేరు. జ‌గ‌న్ రాడు. బట‌న్ ఆప‌రేష‌న్ ఫెయిల్‌. మిగిలింది వై నాట్ 11.

కింక‌ర్త‌వ్యం సాక్షి ప్ర‌క్షాళ‌న‌. వ‌ర‌ద బుర‌ద క‌డిగినంత సుల‌భం కాదు. జ‌ర్న‌లిస్ట్ మేనేజ‌ర్లు, మేనేజ్‌మెంట్ జ‌ర్న‌లిస్టుల‌తో నిండిపోయి యాజ‌మాన్యం కూడా ఎవ‌రి మాస్క్ ఏంటో గుర్తించ‌లేని స్థితి. శుభ్ర‌మైన నాలుగు వాక్యాలు రాయ‌లేని వాళ్లంతా పీఠాధిప‌తులు. ప్ర‌క్షాళ‌న చేత‌కాక‌పోతే ఆల్ట‌ర్‌నేటివ్ వుంది. బ‌ళ్లారి డ్ర‌మ్స్ , భ‌జ‌న బృందాల‌కి ఇంట‌ర్వ్యూలు చేసి వాళ్ల‌కే జ‌ర్న‌లిజంలో శిక్ష‌ణ ఇస్తే ఇంకా బాగా ప‌ని చేస్తారు. మీక్కావాల్సింది కూడా హార్మోనియం మ‌రియు మృదంగ త‌బ‌లాలే క‌దా. ఎవ‌రి డ‌ప్పు వారే వాయించుకుని ప్ర‌శాంతంగా మునిగిపోవ‌డ‌మే.

ఇక పార్టీ, ముందు విభిన్న గొంతుల్ని వినిపించ‌నివ్వండి. న‌లుగురితో మాట్లాడండి, మాట్లాడ‌నివ్వండి. చ‌ర్చ జ‌ర‌గ‌నీ. అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యానికి విలువ ఇస్తే, కోమా నుంచి కోలుకుంటుంది. లేదంటే ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌కి ఆర్డ‌ర్ ఇచ్చుకోవ‌డ‌మే.

నిన్న‌గాక మొన్న పుట్టిన వైసీపీకే ప్ర‌జాస్వామ్య ల‌క్ష‌ణాలు లేక‌పోతే 40 ఏళ్ల క్రితం పుట్టిన తెలుగుదేశాన్ని విమ‌ర్శించే హ‌క్కు మీకుందా? ఎన్ని మాట్లాడినా మీ పార్టీ కంటే తెలుగుదేశంలో ప్ర‌జాస్వామ్య ల‌క్ష‌ణాలు ఎక్కువ‌. చంద్ర‌బాబుకి సొంత మీడియా లేదు. కానీ అంత‌కు మించి ప‌నిచేసే రెండు మీడియా సంస్థ‌లున్నాయి. చంద్ర‌బాబుకి ప‌ర‌దాలు తెలియ‌దు. అవ‌స‌రానికి త‌గిన ఆట ఆడే శ‌క్తిమంతుడు. ఈ సారి బాబుని త‌ట్టుకోవ‌డం అంత సుల‌భం కాదు, ఆరితేరాడు. పైగా అంద‌ర్నీ దూరం చేసుకుంటూ, బ‌ల‌హీన‌మైన పార్టీ నిర్మాణం వున్న ప్ర‌స్తుత స్థితిలో అస‌లు సాధ్యం కాదు.

వైసీపీ అమాయ‌క‌త్వం ఏమంటే ప‌థ‌కాలు ఇవ్వ‌లేక చంద్ర‌బాబు చ‌తికిలప‌డ‌తాడ‌ని. వీలైనంత ఎక్కువ కాలం అధికారంలో వుండ‌డ‌మే బాబు అస‌లైన ప‌థ‌కం. దాని ముందు ఏ ప‌థ‌కాన్ని లెక్క‌చేయ‌డు.

చ‌త్వారం మీరు పెట్టుకుని , బాబు కంటి జ‌బ్బుల‌పై అత్యాశ అంచ‌నాలు వేయ‌కండి. ఆల్రెడీ వైసీపీ వ‌ర‌ద‌లో వుంది. ప‌డ‌వ కావాలి. ప‌డ‌వ వుంది కానీ, దాంట్లో గాలి లేదు. హెలికాప్ట‌ర్లు , డ్రోన్లు లేవు. చేత‌న‌యితే ఈదండి.

91 Replies to “ఈద‌క‌పోతే వైసీపీకి మున‌కే”

  1. పాపం గ్రేట్ ఆంధ్రా కి ఇంకా వైసీపీ మీద హోప్స్ వున్నాయి.

    అసలు వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, అసలు వైసీపీ ఒక రాజకీయ పార్టీ కాదు. అది ఒక ప్రొప్రయిటర్ కంపెనీ. అందులో సలహాలు ఇవ్వటం, డిబేట్ చెయ్యడం అంటూ ఏమి ఉండదు.

    1. edo TDP lo salahalu babu patisthunatlu .. Babu patinchinatlu natisthadu anthe . sand theesuko emi jaruguthondi ground lo andariki thelusu aeina media mundu maathram sand free ani vallisthu vuntaru .

      inka schemes modalu kaaladu . asalu pandaga schemes modalu pettinappudu vundtundi . isthe capittal exp dabbulu vundavu . ivvakunte malli 2019 repeat story .

  2. “‌జ్యోతి, ఈనాడు వ‌దిలే గ్యాస్‌కి స‌రిప‌డా మాస్క్‌లు వైసీపీx ద‌గ్గ‌ర లేదు. త‌యారీ రాదు”

    ఓహో నిన్న చవితి పండక్కి ఓ 50 పూర్ణాలు తినడమే కాక, పూర్ణాలతోనే కూర, పప్పు కూడా GA తిన్నట్లుగా ఉంది. అత్యధిక మొత్తంలో gas వదులుతున్నాడు.

  3. సాయం చేసిన నా లాంటి ఎన్నో చేతుల్ని అడ్డం గా నరికన వ్యక్తి జగన్..విశ్వాసం లేని మనిషి..వాడు ఇంకెప్పుడు అధికారం లోకి రాడు..

  4. He mercilessly ignored alot of people who helped him, I never vote for again in my life time for jagan.. Though I’m Reddy I’m from Kadapa..cbn is 1000 times better than jagan

    1. example here: I believed that he is young and will do better. donated big amount 7 digit number towards 8 digits..

      turned to be just horrible fake guy

      thats why i am determined to spend some time to ensure andhra will not suffer again

  5. మీకు తెలుసో.లేదో కానీ hardcore వైసిపి సపోర్టర్స్ వైసిపి నీ, జగన్ని ఇంకా great Andhra ni వదిలేసి చాలా కాలం అయ్యింది..మీ వెబ్సైట్ కి నలంటల్లు టైంపాస్ కోసం వస్తాం అంతే…

  6. Only reason he became CM because YESR was elevated to the level of jesus for dying in accident. If he died in some Carona, there would not have been so much sympathy and since there WAS so much competition among media channels, they over did it in a one-upmanship to provide publicity in much much more than required. The other reason was also that Anti kamma feeling was building up due to their progress (((((after over 100 years of work on the farms aided by policy environment transformation from Zamindary system to Rythuvari system which incidentally was succinctly depicted by NTR with a slogan”DUNEY VADIDEY BHOOMI ” in one of NTRs movie of 50s/60s))))during the crucial economic liberalization period of 1993 to 2004 on which discerning sentiment there off seeing/viewing TDP as Richmans’ Govt,he (YSR)came to power in Robinhoodisque way,fctionist in tone nevertheless. Other wise YSR didnt do even 10% of what CBN did. Many middle class and kamas didnt like the way Jagan brazenly staked claim for CM position during 2009 and there was decision to elect CBN(not to TDP) in 2014.Then the accumulated sympathy of YSR and the carefully cultivated crucified image of him impacting the dlth christins mindset brought him in 2019. But where is the sympathy now with even sharmila rejoicing? Andhra voters are slowly becoming wise like Americans/Western countries and not bothered about somebody’s’ miseries as miseries can engulf anybody in free market economy. So there is no scope/chance reenacting sympathy as a strategy for success. The MOTHER (RATHER GRAND MOTHER) OF ALL KOOTAMIS, A KOOTAMI OF KOOTAMIS IN 2024 unlike the hotch botch rag doll kind in 2014 humbled many including RRR, Sujana Chowdhary etc who had to come down a level needing help from PAWAN , the architect who was hitherto seen as “After all” by many a sundry.Frankly speaking, RRR,SUJANA,Kamineni, etc etc are heavy weights compared to Jag, s o why worry for a NINCOMPOOP. in fact it was kootami of Noble prizxe winning proportions as it brought out order,serenity and piece of mind among a section of people who were targetted in a Nazi sque manner for the simple and mundane reason that they attempted a Brahminical ascent and achieving it to some extent too. Looking at the BONHOMIE exhibited by the Kootami partners at swearing in ceremony and the desire to accomodate mutual ambitions, it is curtains to Jagu till 2034. So he need to refurbish the ruffled Ego to undergo sauna for few days, probably some massage from the drty hands of sri redy to some to terms to realty, the realty of all options closed

  7. Naa Sontha babai hardcore ysr abhimani. Ycp lo cheradu. Power vachaka ye pani avvaledu aina aasa second time vaste chestaru ani. Maa vullo ycp nayakudu. Monna adigithe inkekkadi party ayyipoyindi jagan ki yevadu votes veyyaru annadu. Idi ground reality.

  8. ఇంతలా ఏడుస్తూ కూడా… మధ్యలో pawan మీద విషం కక్కడం personal…..😂😂… అంతేనా కుక్క తోక GA….

  9. ఇంతలా ఏడుస్తూ కూడా…. మధ్యలో pawan kalyan మీద విషం కక్కడం మాత్రం personal….😂😂 అంతేనా GA…

  10. “జ‌గ‌న్ సొంత మీడియా సాక్షి ఏం చేస్తా వుంది”

    didn’t jagan ay he has no media?

    సిగ్గు అన్నది లేదా జగన్ కి?

  11. సాక్షి లో కొమ్మినేని ఈశ్వర్ చేసే పని ఒక అబద్దాన్ని తీసుకొని దాన్ని బాబు గారికి ఆపాదించి వీళ్ళు డిబేట్ లు పెట్టుకోవడం ఉదాహరణకి పెగసిస్ సాఫ్ట్వేర్ పింక్ డైమండ్ కమ్మ డీస్పీ లు లేదా అయన సొంత చెల్లెల్లు ఎవరితో తిరిగేరు ఇది వీళ్ళ పని దీనికి వీళ్ళను పోషించడం ఎదుటివాళ్లను తిట్టించడం ఇలాంటి పేపర్ లను టీవీ లను ఎవరు చూస్తారు పేపర్ చదివే వాడికి కూడా ఎంతో కొంత తెలివితేటలూ వుంటాయని దాన్ని మర్చిపోతున్నారు

    1. ఎప్పుడూ అన్నీ అబద్దాలే రాసే ఈనాడు, జ్యోతి లాంటి పేపర్స్ కొనే వాళ్ళు ఉన్నప్పుడు, కనీసం అప్పుడప్పుడైనా నిజాలు రాసే సాక్షి పేపర్ కొనరా 🤔

        1. పోరంబోకులు అయితే పర్వాలేదు, నీలా గులపిచ్చి ఉండి చెప్పులు లెక్క పెట్టుకునే వాళ్లతోనే సమస్య

          1. ప్రియమైన రఘునాధ్ గారికి,

            మీరు కమ్మ, కాపు వర్గాలపై చూపుతున్న విభేదం, ద్వేషం చాలా ఆశ్చర్యం కలిగించింది. మీరు విద్యావంతులు మరియు ఎంతో గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చి, ఇంతటి ద్వేషంతో ఉండటం చాలా విచారకరం. ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల నుండి మీకు కలిగిన అనుభవం కారణంగా మీరు బాధపడివుంటారు, కానీ దాని ఆధారంగా మొత్తం వర్గాలపై ద్వేషం పెంచుకోవడం సమంజసం కాదు.

            విద్యావంతులు మరియు సంస్కారవంతులుగా, మనం ఎప్పుడూ ద్వేషాన్ని ప్రోత్సహించకూడదు. నిరంతరం ద్వేష భావనలు మన ఆరోగ్యానికి కూడా హానికరం. ఈ రకమైన కఠిన భావాలు గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కాబట్టి ఈ ద్వేషాన్ని వదిలిపెట్టడం మీ ఆరోగ్యానికీ, మనశ్శాంతికీ మంచిది.

            మీరు ఒక గౌరవనీయమైన పురోహిత కుటుంబం నుండి వచ్చారు. కాబట్టి మీకు సమాజంలో శాంతిని, ఏకతను ప్రోత్సహించే అవకాశం ఉంది. మీరు ప్రార్థనల్లో తలంచే సమయంలో ఈ విషయంలో లోతుగా ఆలోచించండి. ఈ ద్వేషాన్ని పట్టుకుని ఉండడం మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసిందా? లేక మరింత హాని చేసిందా? అనేది ఆలోచించాలి.

            మీరు ఇతరులపై వారి కుల భావనల గురించి మాట్లాడుతారు, అయితే మీరు వారిని ద్వేషించడం మరింత ఘోరం. కులాన్ని పట్టుకుని వారు చేసిన తప్పులు తప్పని ఎంతగానో ద్వేషించడమూ, మీరు ప్రస్తుత స్థితిలో ఉన్నందుకు ప్రధాన కారణం. ఇదే అత్యంత భయంకరమైన విషయం – కుల భావన కంటే, వారిని ద్వేషించడం తక్కువ తక్కువ కాదు, మరింత ఘోరమైనదే.

            ఇంకా, సాక్షి పత్రిక, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా పాక్షికంగా వ్యవహరిస్తున్నాయన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సాక్షి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పక్షపాతంగా ఉండగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వేరే కోణంలో ఆలోచిస్తున్నాయి. కాబట్టి వీటినీ విమర్శాత్మకంగా చూసి, సమతులత లేకుండా ఉండవచ్చని అర్థం చేసుకోవాలి.

            మీరు ఈ విషయాలను ఆలోచించి, ప్రేమ మరియు శాంతి దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాను. మనందరం మనుషులమే, మన మధ్య ఉన్న భేదాలు కంటే మనిషిగా ఉండటమే చాలా గొప్పది. దీన్ని లోతుగా పరిశీలించి, మీ జీవితంలో శ్రేయస్సుకు మార్గం కనుగొంటారని విశ్వసిస్తున్నాను.

          2. Volunteer latho paper koni pinchukuni circulation penchukunna paper adi .. nelontolake adi correct…meku mantrulu bhootulu mantralu ga untayi . Roads advanamuga unna .. babu gari meeda vyatrekato kallaki kanapadavu .. rupai pettubadi rastraniki raka poyina.. parvaledu .. babu garini jail lo pedite chalu .. nela nela biccham intiki voste chalu ..

      1. ప్రియమైన రఘునాధ్ గారికి,

        మీరు కమ్మ, కాపు వర్గాలపై చూపుతున్న విభేదం, ద్వేషం చాలా ఆశ్చర్యం కలిగించింది. మీరు విద్యావంతులు మరియు ఎంతో గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చి, ఇంతటి ద్వేషంతో ఉండటం చాలా విచారకరం. ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల నుండి మీకు కలిగిన అనుభవం కారణంగా మీరు బాధపడివుంటారు, కానీ దాని ఆధారంగా మొత్తం వర్గాలపై ద్వేషం పెంచుకోవడం సమంజసం కాదు.

        విద్యావంతులు మరియు సంస్కారవంతులుగా, మనం ఎప్పుడూ ద్వేషాన్ని ప్రోత్సహించకూడదు. హిందూ శాస్త్రాలు కూడా ద్వేషాన్ని ప్రోత్సహించవు. “అహింసా పరమో ధర్మః” అని చెబుతాయి – హింస, ద్వేషం మనిషికి హానికరమైనవని. నిరంతరం ద్వేష భావనలు మన ఆరోగ్యానికి కూడా హానికరం. ఈ రకమైన కఠిన భావాలు గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కాబట్టి ఈ ద్వేషాన్ని వదిలిపెట్టడం మీ ఆరోగ్యానికీ, మనశ్శాంతికీ మంచిది.

        మీరు ఒక గౌరవనీయమైన పురోహిత కుటుంబం నుండి వచ్చారు. కాబట్టి మీకు సమాజంలో శాంతిని, ఏకతను ప్రోత్సహించే అవకాశం ఉంది. మీరు ప్రార్థనల్లో తలంచే సమయంలో ఈ విషయంలో లోతుగా ఆలోచించండి. ఈ ద్వేషాన్ని పట్టుకుని ఉండడం మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసిందా? లేక మరింత హాని చేసిందా? అనేది ఆలోచించాలి.

        మీరు ఇతరులపై వారి కుల భావనల గురించి మాట్లాడుతారు, అయితే మీరు వారిని ద్వేషించడం మరింత ఘోరం. కులాన్ని పట్టుకుని వారు చేసిన తప్పులు తప్పని ఎంతగానో ద్వేషించడమూ, మీరు ప్రస్తుత స్థితిలో ఉన్నందుకు ప్రధాన కారణం. ఇదే అత్యంత భయంకరమైన విషయం – కుల భావన కంటే, వారిని ద్వేషించడం తక్కువ తక్కువ కాదు, మరింత ఘోరమైనదే.

        ఇంకా, సాక్షి పత్రిక, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా పాక్షికంగా వ్యవహరిస్తున్నాయన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సాక్షి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పక్షపాతంగా ఉండగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వేరే కోణంలో ఆలోచిస్తున్నాయి. కాబట్టి వీటినీ విమర్శాత్మకంగా చూసి, సమతులత లేకుండా ఉండవచ్చని అర్థం చేసుకోవాలి.

        మీరు ఈ విషయాలను ఆలోచించి, ప్రేమ మరియు శాంతి దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాను. మనందరం మనుషులమే, మన మధ్య ఉన్న భేదాలు కంటే మనిషిగా ఉండటమే చాలా గొప్పది. హిందూ ధర్మం ఎల్లప్పుడూ ప్రేమ, శాంతి, సహనాలనే ప్రోత్సహిస్తుంది. దీన్ని లోతుగా పరిశీలించి, మీ జీవితంలో శ్రేయస్సుకు మార్గం కనుగొంటారని విశ్వసిస్తున్నాను.

  12. రాసింది బాగానే ఉంది కాని SAJ*JALA పేరు రాస్తే మోడరేషన్ కి వెళ్ళింది ఏమిటి?

  13. Only reason he became CM because YESR was elevated to the level of jesus for dying in accident. If he died in some Carona, there would not have been so much sympathy and since there WAS so much competition among media channels, they over did it in a one-upmanship to provide publicity in much much more than required. The other reason was also that Anti kamma feeling was building up due to their progress (((((after over 100 years of work on the farms aided by policy environment transformation from Zamindary system to Rythuvari system which incidentally was succinctly depicted by NTR with a slogan”DUNEY VADIDEY BHOOMI ” in one of NTRs movie of 50s/60s))))during the crucial economic liberalization period of 1993 to 2004 on which discerning sentiment there off seeing/viewing TDP as Richmans’ Govt,he (YSR)came to power in Robinhoodisque way,fctionist in tone nevertheless. Other wise YSR didnt do even 10% of what CBN did. Many middle class and kamas didnt like the way Jagan brazenly staked claim for CM position during 2009 and there was decision to elect CBN(not to TDP) in 2014.Then the accumulated sympathy of YSR and the carefully cultivated crucified image of him impacting the dlth christins mindset brought him in 2019. But where is the sympathy now with even sharmila rejoicing? Andhra voters are slowly becoming wise like Americans/Western countries and not bothered about somebody’s’ miseries as miseries can engulf anybody in free market economy. So there is no scope/chance reenacting sympathy as a strategy for success. The MOTHER (RATHER GRAND MOTHER) OF ALL KOOTAMIS, A KOOTAMI OF KOOTAMIS IN 2024 unlike the hotch botch rag doll kind in 2014 humbled many including RRR, Sujana Chowdhary etc who had to come down a level needing help from PAWAN , the architect who was hitherto seen as “After all” by many a sundry.Frankly speaking, RRR,SUJANA,Kamineni, etc etc are heavy weights compared to Jag, s o why worry for a NINCOMPOOP. in fact it was kootami of Noble prizxe winning proportions as it brought out order,serenity and piece of mind among a section of people who were targetted in a Nazi sque manner for the simple and mundane reason that they attempted a Brahminical ascent and achieving it to some extent too. Looking at the BONHOMIE exhibited by the Kootami partners at swearing in ceremony and the desire to accomodate mutual ambitions, it is curtains to Jagu till 2034. So he need to refurbish the ruffled Ego to undergo sauna for few days, probably some massage from the drty hands of sri redy to some to terms to realty, the realty of all options closed

  14. చంద్రబాబు నాయుడికి 75 ఏళ్ళు..

    స్కిన్ డీసీసీస్ ఉన్నాయి.. అయినా బురద నీటిలో రోజంతా గడిపాడు..

    కంటి నిండా నిద్ర ఉండాలి.. మూడు రోజుల్లో 6 గంటలే నిద్ర..

    కడుపుకు సరిపడా తిండి ఉండాలి.. సమయానికి తిండి కూడా తిందకుండా పోరాడాడు..

    అధికారాలనందరినీ పరుగులు పెట్టించాడు.. ప్రతి ప్లాన్ కి ఫాలో అప్ అయ్యేవాడు.. ప్రతి వార్డ్ తిరిగాడు.. అందరికీ అన్ని సదుపాయాలూ కలిగేలా కష్టపడ్డాడు..

    ఎంత చేసినా.. ప్రజలకు అన్ని కల్పించలేనంతటి విపత్తు జరిగింది..

    2019 -24 మందలో ఒక లంజాకొడుకు అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయి.. 45 మంది చనిపోతే .. తెలంగాణ లో స్పీకర్ ఇంట్లో పెళ్లి భోజనాలకు వెళ్ళాడు..

    వారం తర్వాత.. రెడ్ కార్పెట్ మీద క్యాట్ వాక్ చేస్తూ వెళ్లి బాధితులను కలిసి.. ఇల్లు కట్టిస్తానని మాటిచ్చాడు..

    ఇపప్టి వరకు ఒక్కరికి కూడా ఇల్లు కట్టివ్వలేదు..

    ఆ దరిద్రుడు.. ఇప్పుడు చంద్రబాబు పడుతున్న కష్టాన్ని ప్రశ్నిస్తున్నాడు..

  15. “ధర్మం చెయ్యటం మంచిదని తెలుసు, కానీ చెయ్యలేను

    ద్రోహం చెయ్యకూడదని తెలుసు, చెయ్యకుండా ఉండలేను.”

    ఇదీ వైసీపీ/జగన్ పరిస్థితి.

  16. సజ్జ*లు పేరు రాయడానికి కూడా గ్రేట్ ఆంధ్ర కి బాల్స్ అదిరిపోతున్నాయి, భయ్యం తో..

    రంకు మొగుడు ప్యాలస్ పులకేశి ఏమో సజ్జాల్ కి అతుక్కుపోయి , పాపం గ్రేట్ ఆంధ్ర దగ్గరకి రావడం మానేశాడు.

    దానితో ఈ విరహ విలాపం.

  17. చంద్రబాబు నాయుడికి 75 ఏళ్ళు..

    స్కిన్ డీసీసీస్ ఉన్నాయి.. అయినా బురద నీటిలో రోజంతా గడిపాడు..

    కంటి నిండా నిద్ర ఉండాలి.. మూడు రోజుల్లో 6 గంటలే నిద్ర..

    కడుపుకు సరిపడా తిండి ఉండాలి.. సమయానికి తిండి కూడా తినకుండా పోరాడాడు..

    అధికారాలనందరినీ పరుగులు పెట్టించాడు.. ప్రతి ప్లాన్ కి ఫాలో అప్ అయ్యేవాడు.. ప్రతి వార్డ్ తిరిగాడు.. అందరికీ అన్ని సదుపాయాలూ కలిగేలా కష్టపడ్డాడు..

    ఎంత చేసినా.. ప్రజలకు అన్ని కల్పించలేనంతటి విపత్తు జరిగింది..

    2019 -24 మందలో ఒక లంజకొడుకుఁ అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయి.. 45 మంది చనిపోతే .. తెలంగాణ లో స్పీకర్ ఇంట్లో పెళ్లి భోజనాలకు వెళ్ళాడు..

    వారం తర్వాత.. రెడ్ కార్పెట్ మీద క్యాట్ వాక్ చేస్తూ వెళ్లి బాధితులను కలిసి.. ఇల్లు కట్టిస్తానని మాటిచ్చాడు..

    ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇల్లు కట్టివ్వలేదు..

    ఆ దరిద్రుడు.. ఇప్పుడు చంద్రబాబు పడుతున్న కష్టాన్ని ప్రశ్నిస్తున్నాడు..

  18. కనీసం ఒక్క అన్నం పొట్లం కూడా పంచలేని ద*ద్దమ్మ, సై*కో, పోరం*బోకు, సన్నా*సి, బే*వారేసు ప్యాలస్ పులకేశి గాడు

    నీకు ఇంకా వా*డు బి*చ్చం వేస్తాడు ఏమో అని అడు*క్కోడం ఆపి, ఇప్పటికైనా నీ కి తెలిసిన న్యూస్ రాసుకుని అభివృద్ధి అవ్వు .

    కష్ట*పడే వా*ళ్ళకి ప్రో*త్సాహం ఇచ్చే ప్రభు*త్వం ఇది.

    1. లేదు ఇంకా ఆ ప్యా*లస్ పుల*కేశి గాడు వాడేసిన డయాపర్ వాసనే చూసుకుంటూ బానిస బతుకు బతుకుతాను అంటే నీ ఇష్టం.వెనకటి రెడ్డి.

  19. పైనవాడు చేసిన తప్పులకు చేతకాని తరానికి మధ్యన ఉన్నవాడు ఆ అపవాదును తన మీద వేసుకొని తనను తానే శిక్షించుకోవాలన్న మాట.

    తప్పు బిజ్జల దేవుడిదో, వాడి కొడుకు భల్లం దేవుడిదో కాదు.

    తప్పంతా ఆ ధుర్యోధన సార్వభౌముల వారిదే.

    కానీ అది మొహం మీద చెప్పడానికి భయంతో కూడిన, భక్తితో కూడిన గౌరవం.

    ఒక్క విషయం: పైవాడు ఏది చెబితే అదే చేస్తాడు తప్ప తన తెలివిని వాడడు బిజ్జల దేవుడు.

  20. పాపం పైవాడు చే-తకాని- తనాన్ని, అ-హంకా-రాన్ని, అవి-వేకాన్ని, కప్పి-పుచ్చడానికి,నింద-లన్ని- బిజ్జల-దేవుడిమీద వేస్తున్నారు,

  21. Though it is a natural disaster Babu has seen this as an opportunity to help people , to build goodwill, to strengthen party and cadre, to increase the liaison between people and government where as Jagan tried to play politics, mudsling on babu and try to flee country leaving an opportunity. He has done what he always does his best, escape. You have too much faith on him still , people realized and sent him sankaragiri manyalu.

  22. పథకాలు అయితే ఇచ్చే త డబ్బు ఖజానా లో.లేదు పైగా ఇప్పుడు వరదలు . బాబు గారు పథకాలు ఆపేసేతే నే బెటర్ . కానీ.పథకాలు అంటూ స్టార్ట్ చేస్తే ఇక కష్టాలు మొదలు .ఎందుకంటే అసలు అంత బడ్జెట్ .అనకు లేదు . 29 లో పథకాలు ఇవ్వకుండా కేవలం అభివృద్ధి కార్డు మీదే ఎన్నికలు జరగాలి .జగన్ పథకాలు తో ఎన్నికలకు వస్తాడు కానీ పవర్ బిల్ తగ్గించడం ఇసుక మద్యం దోపిడీ అరికట్టడం ఉపాధి సుపరిపాలన టీడీపీ egenda అవ్వాలి అప్పుడు చూడాలి

  23. అమర్వతి meedha దుష్ప్రచారం. ఆపలేదు. ఇంకా మీరు మారరు అని అర్థం అయ్యింది. అమరావతి బ్రాండ్ పోతే అది రాష్ట్రానికి మంచిదేహాన ? కక్ష కార్పన్యం తో చేసారు రాజకీయం . రాష్ట్రం జగన్ స్వంత అడ్డ కాదు నచ్చిన స్టాండ్ తీసుకోడానికి . మీరు చరిత్ర లో కల్సి పోయే పార్టీ ఎప్పటికయినా షర్మిల గారే దిక్కు ప్రధాన ప్రతిపక్షంగా

  24. గెలుపు తీరం చాలా దూరం…….. జగన్ కి దమ్ము సరిపోదు ఈదడానికి……… నమ్మకం కలగడం లేదు అతన్ని చూస్తుంటే…..

  25. పరమ చెత్త వారిని కూడా మళ్ళీ మళ్ళీ ఎన్నుకున్న చెరిత్ర ఉన్న గొప్ప దేశం మనది.. మన నిరుపేద నిరక్షర దేశం లో జనాలకి అంత గొప్ప తెలివి విచక్షణ ఉంటాయి అనుకోవడం అత్యాశ…

  26. ప్రియమైన రఘునాధ్ గారికి,

    మీరు కమ్మ, కాపు వర్గాలపై చూపుతున్న విభేదం, ద్వేషం చాలా ఆశ్చర్యం కలిగించింది. మీరు విద్యావంతులు మరియు ఎంతో గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చి, ఇంతటి ద్వేషంతో ఉండటం చాలా విచారకరం. ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల నుండి మీకు కలిగిన అనుభవం కారణంగా మీరు బాధపడివుంటారు, కానీ దాని ఆధారంగా మొత్తం వర్గాలపై ద్వేషం పెంచుకోవడం సమంజసం కాదు.

    విద్యావంతులు మరియు సంస్కారవంతులుగా, మనం ఎప్పుడూ ద్వేషాన్ని ప్రోత్సహించకూడదు. హిందూ శాస్త్రాలు కూడా ద్వేషాన్ని ప్రోత్సహించవు. “అహింసా పరమో ధర్మః” అని చెబుతాయి – హింస, ద్వేషం మనిషికి హానికరమైనవని. నిరంతరం ద్వేష భావనలు మన ఆరోగ్యానికి కూడా హానికరం. ఈ రకమైన కఠిన భావాలు గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కాబట్టి ఈ ద్వేషాన్ని వదిలిపెట్టడం మీ ఆరోగ్యానికీ, మనశ్శాంతికీ మంచిది.

    మీరు ఒక గౌరవనీయమైన పురోహిత కుటుంబం నుండి వచ్చారు. కాబట్టి మీకు సమాజంలో శాంతిని, ఏకతను ప్రోత్సహించే అవకాశం ఉంది. మీరు ప్రార్థనల్లో తలంచే సమయంలో ఈ విషయంలో లోతుగా ఆలోచించండి. ఈ ద్వేషాన్ని పట్టుకుని ఉండడం మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసిందా? లేక మరింత హాని చేసిందా? అనేది ఆలోచించాలి.

    మీరు ఇతరులపై వారి కుల భావనల గురించి మాట్లాడుతారు, అయితే మీరు వారిని ద్వేషించడం మరింత ఘోరం. కులాన్ని పట్టుకుని వారు చేసిన తప్పులు తప్పని ఎంతగానో ద్వేషించడమూ, మీరు ప్రస్తుత స్థితిలో ఉన్నందుకు ప్రధాన కారణం. ఇదే అత్యంత భయంకరమైన విషయం – కుల భావన కంటే, వారిని ద్వేషించడం తక్కువ తక్కువ కాదు, మరింత ఘోరమైనదే.

    ఇంకా, సాక్షి పత్రిక, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా పాక్షికంగా వ్యవహరిస్తున్నాయన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సాక్షి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పక్షపాతంగా ఉండగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వేరే కోణంలో ఆలోచిస్తున్నాయి. కాబట్టి వీటినీ విమర్శాత్మకంగా చూసి, సమతులత లేకుండా ఉండవచ్చని అర్థం చేసుకోవాలి.

    మీరు ఈ విషయాలను ఆలోచించి, ప్రేమ మరియు శాంతి దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాను. మనందరం మనుషులమే, మన మధ్య ఉన్న భేదాలు కంటే మనిషిగా ఉండటమే చాలా గొప్పది. హిందూ ధర్మం ఎల్లప్పుడూ ప్రేమ, శాంతి, సహనాలనే ప్రోత్సహిస్తుంది. దీన్ని లోతుగా పరిశీలించి, మీ జీవితంలో శ్రేయస్సుకు మార్గం కనుగొంటారని విశ్వసిస్తున్నాను.

  27. eedatama bokka…already mottam ayyipoindhi….appudappudu vachhu oka 5 mins show cheyyatam okate migilindhi ee party ki…aa sakshi news channel ni kooda andharu choodatam maanesaru…..anni thappudu news cheppatame….

  28. వీలైనన్ని ఎక్కువ రోజులు అధికారం లో ఉండి కేసులు తప్పించుకోవాలని లెవెల్ -రెడ్డి పథకం కాదా ?

    నువ్వు నువ్వు మారు ఎంకటి..మార్పు నీతో మొదలవ్వాలేమో..ఆలోచించు

  29. బాబు గారి అక్రమ అరెస్టుకు ఏడాది!

    పాలనకు, పాలకులకు అర్థాన్ని మార్చి, ప్రజల అభివృద్దే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలుగా రాజకీయ ప్రస్థానం సాగించిన నాయకుడి అక్రమ అరెస్టుకు ఏడాది

    రాజకీయ కక్ష సాధింపులతో దేశం గర్వించే రాజనీతిజ్ఞుడు అరెస్టు అది….!

    దేశాన్ని నివ్వెరపరిచిన…ప్రభుత్వ టెర్రరిజం పతాకస్థాయికి చేర్చిన అరెస్టు అది….!

    దేశం లో కోట్లమంది ప్రజల గుండెలను బరువెక్కించిన అరెస్టు అది….!

    ప్రపంచంలో ఎన్నడూ లేనివిధంగా ఒక రాజకీయ నాయకుడి కోసం 70 దేశాల్లో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేసిన అరెస్టు అది….!

    నిద్రాణమై, భయకంపితులై ఉన్న ప్రజల్లో తిరుగుబాటు తీసుకువచ్చిన అరెస్టు అది….!

    అరాచకాన్ని ప్రశ్నించేందుకు కుల, మత, ప్రాంత, వర్గ భేదం లేకుండా తెలుగు జాతి గళమెత్తిన అరెస్టు అది….!

    ప్రజాస్వామ్యం కోసం రాజకీయ ప్రయోజనాలు వదులుకునే నేతను అప్రజాస్వామ్యకంగా చేసిన అరెస్టు అది…!

    విధ్వంస ప్రభుత్వ పతనానికి నిశ్శబ్ద విప్లవంతో నాంది పలికిన అరెస్టు అది….!

    చరిత్ర క్షమించని తప్పు చేసిన వారిని భూస్థాపితం చేసేందుకు అడుగు పడిన అరెస్టు అది…..!

  30. అప్పుడే ఎందుకు.. గెలిచి ఇంకా 6 నెలలు అవ్వలేదు.. టైం ఇవ్వాలి కదా, ఏం చేస్తారో… ఇప్పుడే యాక్టివేట్ అవ్వడం very early..

Comments are closed.