స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ తల్లయింది. రణ్వీర్-దీపిక దంపతులకు ఆడ బిడ్డ జన్మించింది. పెళ్లయిన ఆరేళ్లకు ఇలా తల్లిదండ్రులయ్యారు దీపిక-రణ్వీర్.
శుక్రవారం దీపిక-రణ్వీర్ ఇద్దరూ ముంబయిలోని ప్రముఖ సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ రోజు విశ్రాంతి తీసుకొని, నిన్న సాయంత్రం నగరంలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఈరోజు ఉదయం ఆడ బిడ్డకు జన్మనిచ్చింది దీపిక.
తను గర్భం దాల్చిన విషయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించింది దీపిక. గర్భంతోనే ఆమె కల్కి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. ఆ తర్వాత తన ప్రెగ్నెన్సీ ఫొటోషూట్ ఫొటోల్ని కూడా విడుదల చేసింది. సెప్టెంబర్ లో డెలివరీ అనే విషయాన్ని ఆమె అప్పుడే ప్రకటించింది.
2013 నుంచి డేటింగ్ లో ఉన్నారు దీపిక-రణ్వీర్. రామ్-లీలా సినిమా సెట్స్ లో వీళ్లు క్లోజ్ అయ్యారు. 2018లో ఇటలీలో ఈ జంట పెళ్లి చేసుకొని భార్యాభర్తలుగా మారారు. ఇప్పుడు తల్లిదండ్రులయ్యారు.
త్వరలోనే వీళ్లు తమ కూతురితో కొత్త ఇంట్లోకి మారబోతున్నారు. బాంద్రాలోని ఓ ఖరీదైన అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ ను వీళ్లు కొనుగోలు చేశారు. షారూక్ ఉంటున్న మన్నత్ కు పక్కనే ఇది ఉంది. ఇందులో 16 నుంచి 19వ ఫ్లోర్స్ వరకు వీళ్లు కొనుగోలు చేశారు.
vc estanu 9380537747
Call boy works 8341510897